SIM క్లోన్ చేసి 10 లక్షలు కాజేసారు, ఆ కాల్స్ నమ్మకండి

ఢిల్లీలో ఓ వ్యాపారవేత్తకు చెందిన మొబైల్ నెంబర్ ను క్లోన్ చేసి రూ.10 లక్షలు కాజేసిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రముఖ మీడియా ప్రచురించిన కథనం ప్రకారం..

SIM క్లోన్ చేసి 10 లక్షలు కాజేసారు, ఆ కాల్స్ నమ్మకండి

సామ్‌సంగ్ నుంచి లెనోవో వరకు బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు

బాధితుడు సంజయ్ జైన్ ఈస్ట్ ఢిల్లీ వాసి. ఉచితంగా క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తామంటూ ఈయన ఫోన్ నెంబర్ గత కొంత కాలంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ కాల్స్‌ను బ్లాక్ చేసే క్రమంలో సంజయ్ తన టెలీఫోన్ సర్వీసుకు సంబంధించిన సెక్యూరిటీ ఆఫీసర్లు సంప్రదించాడు. వారు తన ఫోన్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ను రన్ చేసుకోమని చెప్పారు. వారు చెప్పిన విధంగానే సంజయ్ సంబంధిత సాఫ్ట్‌వేర్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసాడు. సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్ అయిన వెంటనే ఫోన్ కొన్ని రోజులు పాటు పనిచేయటం మానేసింది. ఈ ఫోన్ నెంబర్ పనిచేయని గ్యాప్‌లో సంజయ్ జైన్ పేరు మీద ఉన్న క్రెడిట్ కార్డు‌ను ఉపయోగించుకుని హ్యాకర్లు ఆన్‌లైన్ కొనుగోళ్లను చేసారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

VK-MYAMEX పేరుతో..

డిసెంబర్ 30,2016, జనవరి 2, 2017 మధ్య తన మొబైల్ నెంబర్‌కు VK-MYAMEX అనే పేరు మూడు మెసేజ్‌లు అందాయని వాటిలోని లింక్స్ పై క్లిక్ చేయటం `American Express' అనే వెబ్‌సైట్‌లోకి డైవర్ట్ అయ్యానని సంజయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో తన ఈమెయిల్ ఐడి వివరాలను పొందుపరిచటంతో తన పాన్‌కార్డ్ అలానే పాస్‌పోర్ట్‌కు సంబంధించిన స్కాన్ కాపీలను కూడా అటాచ్ చేసానని సంజయ్ తెలిపారు. చివరిలో తన క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ.100 చెల్లించానని అయితే, ఆ లావాదేవీ ఫెయిల్ అయ్యిందని సంజయ్ పేర్కొన్నారు.

security software ఇన్‌స్టాల్ చేసుకున్నప్పటికి..

జనవరి 4 నుంచి తమ మొబైల్ నెంబర్‌ను అంతర్జాతీయ నెంబర్ నుంచి కాల్స్ రావటం మొదలైందని సంజయ్ తెలిపారు. వెనువెంటనే సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించి కాల్స్ బ్లాక్ చేసేందుకు రిక్వస్ట్ పెట్టారు, అయినప్పటికి కాల్స్ ఆగలేదు. జనవరి 6న ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి జైన్‌కు ఫోన్ చేసి తనను సర్వీస్ ప్రొవైడర్‌కు చెందిన సెక్యూరిటీ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నారు. అతను సూచనల మేరకే సంజయ్ తన ఫోన్‌లో "security
software"ను ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

Firefox కధ ముగిసింది

10 లక్షలు గల్లంతు..

ఆ తరువాత ఫోన్ కొద్ది రోజులు పనిచేయలేదు. ఈ మధ్యలో రూ.2.24 లక్షలు, రూ.7.79లక్షలు విలువ గల లావాదేవీలు సంజయ్ క్రెడిట్ కార్డు నుంచి జరిగినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. సంజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు.

పోలీసులు హెచ్చరిస్తునే ఉన్నారు..

మొబైల్ ఫోన్‌లలోని సిమ్‌లను క్లోన్ చేసి ఆర్ధిక మోసాలకు తెగబడే ప్రయత్నాలు జోరందుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొత్త రకం సైబర్ మోసాల్లో ఒకటైన సిమ్ క్లోనింగ్ మిమ్మల్ని బ్యాంక్ దివాళా కోరుగా మార్చేయగలదు. మీ పర్సనల్ సిమ్ కార్డ్‌ను క్లోన్ చేయటం ద్వారా హ్యాకర్లు ఆ నెంబరుతో అనసంధానమై ఉన్న మీ బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి అకౌంట్‌లో ఉన్న నగదును మీకు తెలియకుండా లూటీ చేసేయగలరు.

ఇవి పాటిస్తే, మీ ఆండ్రాయిడ్ ఫోన్ సేఫ్

హైటెక్ సాఫ్ట్‌వేర్‌లను హ్యాకర్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం

సిమ్ కార్డ్‌లను క్లోన్ చేసేందుకు హైటెక్ సాఫ్ట్‌వేర్‌లను హ్యాకర్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి సిమ్‌కార్డ్ రీడర్ సహయంతో టార్గెటెడ్ యూజర్ మొబైల్ సిమ్‌లోని సమాచారాన్నివేరొక సిమ్‌కార్డ్‌లోకి కాపీ చేసేస్తారు. కొన్ని వైరస్ కమాండ్‌లతో కూడిన ఎస్ఎంఎస్‌ల ద్వారా కూడా సిమ్ క్లోనింగ్ సాధమ్యవుతుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

ఆ నంబర్ క్లోన్ అయ్యిందనే అర్ధం చేసుకోవాలి

ఒక వ్యక్తికి తెలియకుండానే వారి ఫోన్ నుండి అవతలి వ్యక్తికి మెసేజ్ వెళ్లిందంటే ఆ నంబర్ క్లోన్ అయ్యిందనే అర్ధం చేసుకోవాలి. వెంటనే మీ మొబైల్ బిల్‌ను చెక్ చేసుకోండి. అందులో ఏమైనా మీకు తెలియని నెంబర్ల నుంచి కాల్స్ వెళ్లినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించండి.

ఆగంతకుల ఉచ్చులో లక్ష మంది

#90, +92, #09 వంటి ప్రారంభ సంఖ్యతో వచ్చిన మిస్సుడ్ కాల్స్‌కు స్పందించకండి. ఎవరో తెలసుకోవాలన్న ఆత్రుతతో తిరిగి స్పందించే ప్రయత్నం చేస్తే మీ సిమ్‌కార్డ్ చోరికి గురయ్యే ప్రమాదముంది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఇప్పటి వరకు ఆగంతకుల ఉచ్చులో లక్ష మంది వినియోగదారులు ఇరుక్కున్నట్లు సమాచారం.

#90 లేదా #09 సంఖ్యను ప్రెస్ చెయ్యమని

ఆ డేంజర్ కాల్‌కు తిరిగి స్పందించిన వెంటనే.. కాల్ సెంటర్ ప్రతినిధినంటూ ఒక వ్యక్తి మీతో మాట్లాడటం ప్రారంభిస్తారు. మీ సిమ్‌కార్డ్ కనెక్టువిటీ స్థాయిని పరీక్షించాల్సి ఉందని #90 లేదా #09 సంఖ్యను ప్రెస్ చెయ్యమని ఆదేశిస్తారు. వారి మాటలను నమ్మి ఆ సంఖ్యను ప్రెస్‌చేస్తే ఫోన్‌లోని కీలక సమాచారం కాపీ కాబడుతుంది. క్లోనింగ్ కాబడిన సదరు వ్యక్తి సిమ్ కార్డును ఆగంతకులు ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటారు.

జీఎస్ఎమ్ కార్డులను అంత సులువుగా క్లోన్ చేయలేరు...

హ్యాకర్లు సీడీఎమ్ఏ కార్డులను క్లోన్ చేసినంత సులువుగా జీఎస్ఎమ్ కార్డులను క్లోన్ చేయలేరని నిపుణులు చెబుతున్నారు.GSM కార్డులను క్లోన్ చెయ్యాలంటే సిమ్ కార్డులను ఫోన్ నుండి బైటికి తీయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. బైటకు తీసాక ఫోన్‌కు సిమ్ కార్డుకు మధ్య క్లోనింగ్ జరిగే సిమ్ కార్డ్ రీడర్ ను ఉంచి కొద్ది రోజుల పాటు ఆపరేట్ చేయాల్సి ఉంటుందని తద్వారా రహస్య కోడ్‌తో సహా క్లోనింగ్ చేయవచ్చని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
SIM cloned, businessman loses Rs 10 lakh to hackers. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot