సిమ్ స్వాపింగ్ ద్వారా కోట్లు కొల్లగొడతారు, ఎలాగో తెలుసుకోండి

|

టెక్నాలజీ అమిత వేగంగా పుంజుకుంటోంది. ఎక్కడ చూసినా ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌మయం అయిపోయింది. ఏది కావాలన్నా క్షణాల్లో ఇంటికి చేరుతుంది. అలాగే ఇతర పనులు కూడా చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి. మొబైల్ టెక్నాలజీ వచ్చిన తరువాత ఇది మరితంగా పెరిగిపోయింది. చేతిలో సిమ్ కార్డు ఉన్న మొబైల్ ఉంటే చాలు. అన్నీ ఆటోమేటిగ్గానే జరిగిపోతున్నాయి. బ్యాకింగ్ లావాదేవీలు , షాపింగ్లు, అలాగే ఇతర రకాల పనులు చాలా వేగంగా చేస్తున్నారు. అయితే దీంతో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నా నష్టాల కూడా అదే స్థాయిలో ఉన్నాయి.

సిమ్ స్వాపింగ్ ద్వారా కోట్లు కొల్లగొడతారు, ఎలాగో తెలుసుకోండి

 

ఇప్పుడు సిమ్ కార్డులు వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. స్విమ్ స్వాపింగ్ పేరుతో ఇప్పుడు హ్యాకర్లు విరుచుకుపడుతున్నారు.మన అకౌంట్లల ఉన్న డబ్బును కొల్లగొట్టేస్తున్నారు. ఎలా జరుగుతుందో ఓ సారి చూద్దాం.

సిమ్ మార్చేయడం ద్వారా

సిమ్ మార్చేయడం ద్వారా

ఇటీవల ముంబైలో ఒక వ్యాపారి సిమ్ స్వాపింగ్ అంటే సిమ్ మార్చేయడం ద్వారా ఒకే రోజు 1.86 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు.వ్యాపారి ఖాతా నుంచి ఆ డబ్బు 28 వేరు వేరు అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఈ ఫ్రాడ్ అంతా కేవలం ఒకే ఒక్క రాత్రిలో జరిగిపోయింది.

బ్లాక్ చేయడానికి రిక్వెస్ట్

బ్లాక్ చేయడానికి రిక్వెస్ట్

ఇలాంటి కేసుల్లో హ్యాకర్లు అలాగే ఎవరో ఒకరిని టార్గెట్ చేసే మోసగాళ్లు అతడి సిమ్ కార్డ్ బ్లాక్ చేయడానికి రిక్వెస్ట్ పెడతారు. సిమ్ బ్లాక్ కాగానే, అదే నంబరుతో తీసుకున్న కొత్త సిమ్ నుంచి లావాదేవీల కోసం వన్ టైమ్ పాస్‌వర్డ్(ఓటీపీ) రిక్వెస్ట్ పెడతారు.

ఇతర ఖాతాలకు డబ్బు ట్రాన్స్‌ఫర్
 

ఇతర ఖాతాలకు డబ్బు ట్రాన్స్‌ఫర్

తర్వాత ఓటీపీ రాగానే, దాని సాయంతో ఒక ఖాతా నుంచి ఇతర ఖాతాలకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడం మొదలుపెడతారు. ఈ మధ్య ఎక్కువగా లావాదేవీలన్నీ ఆన్‌లైన్ లేదా డిజిటల్ మాధ్యమం ద్వారానే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది వివరాలు ఆన్‌లైన్లో లభిస్తున్నాయి.అలాంటప్పుడు ఫ్రాడ్ చేసే వారు దానిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. సిమ్ స్వాపింగ్ ద్వారా వారిని నిలువునా ముంచేస్తారు.కాబట్టి ఇలాంటి వాటిపట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిమ్ కార్డు బ్లాక్ అయిన వెంటనే దాని గురించి సమాచారం క్షుణ్ణంగా తెలుసుకోవాలి.

20-digit SIM number

20-digit SIM number

హ్యాకర్లు మీ సిమ్ కార్డులోని 20 డిజిట్ నంబర్లను వెరిఫికేషన్ కోసం అడుగుతారు. మేము కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నామని నమ్మబలుకుతారు. వీరికి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ నంబర్ ఇవ్వవద్దు. ఇస్తే మీ అకౌంట్లను గుల్లచేసే అవకాశం ఉంది.

ఈ-మెయిల్ అలర్ట్ సదుపాయం

ఈ-మెయిల్ అలర్ట్ సదుపాయం

ప్రతి బ్యాంకు ఖాతాకు ఈ-మెయిల్ అలర్ట్ సదుపాయం ఉండాలి. మీ సిమ్ కార్డ్ హఠాత్తుగా బ్లాక్ అయితే, కనీసం ఈ-మెయిల్ ద్వారా అయినా మీ అనుమతి లేకుండా లావాదేవీలు జరుగుతున్న విషయం తెలుస్తుంది. అలా మీరు వెంటనే బ్యాంక్‌కు సమాచారం ఇచ్చి నష్టం జరగకుండా ఆపవచ్చు.

 సెలవుల్లో ..

సెలవుల్లో ..

సాధారణంగా సెలవుల్లో ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే సెలవుల వల్ల బాధితులు బ్యాంకులు లేదా టెలికాం కంపెనీలను సంప్రదించడం కష్టం అవుతుంది. అందుకే సెలవుల్లో మీ సిమ్ కార్డ్ హఠాత్తుగా బ్లాక్ అయితే, అప్రమత్తం కావాలి. మీ బ్యాంకు ఖాతాను సురక్షితంగా ఉంచడానికి చర్యలు తీసుకోవాలి

ఆన్‌లైన్ లావాదేవీలు చేస్తుంటే

ఆన్‌లైన్ లావాదేవీలు చేస్తుంటే

క్రెడిట్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలు ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉండాలి. మీరు ఆన్‌లైన్ లావాదేవీలు చేస్తుంటే వాటిని సెక్యూర్డ్ వెబ్‌సైట్ నుంచే చేస్తున్నామా, లేదా అనేది చూసుకోవాలి. మీ ఓటీపీ లేదా కార్డ్ సీవీవీ ఎవరికీ ఇవ్వకండి

Most Read Articles
Best Mobiles in India

English summary
SIM Swap Fraud: 13 things you must know about this online banking scam

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X