సిమ్ స్వాప్.. న్యాయవాదికి తెలియకుండా బ్యాంక్ ఖాతా నుంచి రూ.50 లక్షలు చోరీ..!
సైబర్ నేరాలు రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఫలితంగా అనేక మంది వీరి చేతిలో మోసపోతున్నారు. భారీగా డబ్బులు కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సిమ్ స్వాప్ మోసం వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీకి చెందిన న్యాయవాది భారీగా నగదును కోల్పోయారు. న్యాయవాది బ్యాంక్ అకౌంట్ నుంచి సుమారు రూ. 50 లక్షల నగదు కాజేసినట్లు ఢిల్లీ పోలీస్ సైబర్ క్రైం యూనిట్ వెల్లడించింది. సిమ్ స్వాప్ అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే న్యాయవాది తన వ్యక్తిగత, బ్యాంకు వివరాలు వెల్లడించలేదని.. అయినా ఆమె ఖాతా నుంచి నగదు కాజేశారని పోలీసులు వెల్లడించారు.

ఢిల్లీకి చెందిన న్యాయవాది ఫోన్‌కు మూడు మిస్ కాల్స్ వచ్చాయి. అయితే కొద్దిసేపు అనంతరం ఇతర నంబర్ నుంచి ఆ నంబర్‌కు తిరిగి కాల్ చేశారు. అయితే తాను ఓ డెలివరీ బాయ్ అని సదరు కాలర్ న్యాయవాదిలో పరిచయం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో న్యాయవాది... ఫ్రెండ్‌కు సంబంధించిన ఓ పార్సిల్ కోసం తన ఇంటి అడ్రస్‌ను వారికి చెప్పినట్లు తెలిసింది.
అయితే అనంతరం తన అడ్రస్‌కు ఎలాంటి పార్సిల్ డెలివరీ కాలేదు. కానీ తనకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్ నుంచి రెండు సార్లు నగదు విత్‌డ్రా అయినట్లు న్యాయవాది ఫోన్‌కు మెసెజ్ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన బాధితురాలు అక్టోబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది.
సిమ్ స్వాపింగ్ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే తప్పుడు మార్గాల ద్వారా సిమ్ కార్డు యాక్సెస్ పొంది.. వినియోగదారుడు బంధువులు సహా ఇతర స్నేహితులను డబ్బులు డిమాండ్ చేస్తారు. దాంతోపాటు ఇంటర్నెట్ బ్యాంక్ సహా ఇతర మార్గాల ద్వారా బ్యాంకు ఖాతాలు ఖాళీచేస్తారు.
సిమ్ కార్డు స్వాపింగ్ ద్వారా సురక్షితంగా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు వినియోగిస్తున్న సిమ్ కార్డును ఆపేస్తే వెంటనే టెలికాం ప్రొవైడర్‌కు తెలియజేయండి. పాస్‌వర్డ్ లేకుండా మీ సిమ్ కార్డును ఇతర ఫోన్లలో వినియోగించకుండా ఉండేందుకు సిమ్ లాక్‌ను ఉపయోగించవచ్చు. పటిష్ఠమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
పెరుగుతున్న టెక్నాలజీని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అందువల్ల ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసెజ్, లింక్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు సంబంధిత సమాచారాన్ని నేరుగా బ్యాంకింగ్ ప్రతినిధుల వద్ద నుంచి తెలుసుకోవడం ఉత్తమం. అలాగే వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని ఎవరితో పంచుకోకూడదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








