అవాక్కయ్యే రిజల్ట్..?

By Super
|
Siri: Nokia Lumia 900 is the best smartphone


ఈ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ కొందామనుకునేవారికి ఎంపిక మరింత క్లిష్టతరం కానుంది. రాజీపడని అత్యాధునిక మొబైలింగ్ కమ్ కంప్యూటింగ్ స్పెసిఫికేషన్‌లతో త్వరలో అందుబాటులోకి రానున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3, ఆపిల్ ఐఫోన్ 5, నోకియా లూమియా 900 స్మార్ట్‌ఫోన్లు ఎంపిక విషయంలో వినియోగదారును కచ్చితంగా ఇరుకుకు నట్టేస్తాయి. అయితే ఆపిల్ ఐఫోన్ 4ఎస్‌లో నిక్షిప్తం చేసిన వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ సిరి మాత్రం ముమ్మాటికి ‘నోకియా లూమియా 900’నే బెస్ట్ స్మార్ట్‌ఫోన్ అని కితాబిస్తుంది. ఇదేంటి ఆపిల్ ఫోన్‌లో లోడ్ చేసిన సిరి అప్లికేషన్ ఐఫోన్5ను సపోర్ట్ చెయ్యకుండా, నోకియాను సపోర్ట్ చేస్తుందని సందిగ్థంలో పడ్డారా..?, అవునండి.. సిరి అప్లికేషన్ చెప్పిన మాట వాస్తవమే, లూమియా 900కు వచ్చిన యూజర్ రివ్యూలను ఆధారంగా చేసుకుని తన జవాబును ప్రకటించింది.

నోకియా లూమియా 900:

భారతీయులు విశ్వసించదగిన నెంబర్ 1 మొబైల్ బ్రాండ్ ‘నోకియా’ ఇటీవల నిర్వహించిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో వేదిక పై విండోస్ ఆధారిత ‘లూమియా 900 LTE’ హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మొబైల్ విడుదల కావల్సి ఉండగా, ఇండియా తదితర దేశాల్లో ఎల్‌టీ‌ఈ నెట్‌వర్క్‌ అందుబాటులో లేదు. ఈ ప్రతికూల పరిస్థితుల నేపధ్యంలో నాన్ LTE వర్షన్ విండోస్ ఆధారిత మొబైల్‌ను ప్రవేశపెట్టేందుకు నోకియా సన్నాహాలు చేస్తుంది. నాన్ LTE వర్షన్ ‘నోకియా లూమియా 900’ మోడల్‌లో వస్తున్న ఈ స్మార్ట్ డివైజ్ జూన్ నాటికి గ్యాడ్జెట్ స్టోర్‌లలో లభ్యం కానుంది. ధర వివరాలను త్వరలోనే వెల్లడిస్తారు.

ఫోన్ ముఖ్య ఫీచర్లు:

* విండోస్ ఆపరేటింగ్ సిస్టం,

* 4.3 అంగుళాల క్లియర్ ఆమోల్డ్ డిస్‌ప్లే,

* సింగిల్ కోర్ APQ 8055 మొబైల్ ప్రాసెసర్,

* 3జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే విధంగా MDM9200 చిప్ వ్యవస్థ,

* 14.5 జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబీ ర్యామ్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X