ఒకరి పేరు మీదే రెండు Jio సిమ్‌లు, మరో మోసం..

ఉచితంగా అందుబాటులో ఉన్న రిలయన్స్ జియో సిమ్‌లను మోసపూరితంగా విక్రయిస్తోన్న ఆరుగురు సభ్యుల ముఠాను ఇండోర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 346 జియో సిమ్ కార్డులతో పాటు 14 ప్రీ-యాక్టివేటెడ్ సిమ్స్ అలానే నాలుగు వేలి ముద్ర మెచీన్‌లను స్వాదీనం చేసుకున్నట్లు అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అమరేంద్ర సింగ్ తెలిపారు.

Read More : ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒకే వ్యక్తి పేరు మీద రెండేసి సిమ్ కార్డులు

ఈ ముఠాలోని సభ్యులు, కస్టమర్‌ల దగ్గర నుంచి ఒకటి కంటే ఎక్కువ వేలి ముద్రలను తీసుకుని, ఒకే వ్యక్తి పేరు మీద రెండేసి సిమ్ కార్డులను కార్డులను తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

మరొక సిమ్‌ను వేరొకరికి..

ఇందులో ఒక సిమ్‌ను కస్టమర్‌కు ఇచ్చేసి మరొక సిమ్‌ను వేరొకరికి ఎటువంటి యాక్టివేషన్ లేకుండా విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

జియో ప్రతినిధుల పాత్ర పై కూడా ఆరా..

ఈ విధమైన సిమ్ కార్డులతో ఏదైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వీరు పాల్పడ్డారు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీళ్లు సిమ్‌లను జారీ చేసిన స్ధానిక రిలయన్స్ జియో ప్రతినిధుల పాత్ర పై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

డిమాండ్ నెలకున్న నేపథ్యంలో

రిలయన్స్ జియో 4జీ సిమ్‌లకు దేశవ్యాప్తంగా డిమాండ్ నెలకున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని తమకు అనుగుణంగా క్యాష్ చేసుకునేందుకు పలువరు మోసగాళ్లు బరితెగిస్తున్నారు. జియో 4జీ సిమ్ పేరుతో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న మోసపూరిత స్కామ్‌లను మీ దృష్టికి తీసుకువస్తున్నాం.

రూ.199కే జియో 4జీ సిమ్ ఇంకా లైఫ్ స్మార్ట్‌ఫోన్

రూ.199కే జియో 4జీ సిమ్ ఇంకా లైఫ్ స్మార్ట్‌ఫోన్ మీ సొంతం అంటూ కొన్ని రిపోర్ట్స్ ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి. రూ.2,999 ఖరీదు చేసే లైఫ్ ఫోన్‌ను కేవలం రూ.199కే ఎలా ఇస్తారు..? ఇది పూర్తిగా స్కామ్. ఇలాంటి పుకార్లను నమ్మకండి.

ఓ నకిలీ వెబ్‌సైట్

ఈ మధ్య కాలంలో ఓ నకిలీ వెబ్‌సైట్ జియో వై-ఫై హాట్ స్పాట్ డివైస్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తామంటూ ప్రకటించింది. ఈ డివైస్‌తో పాటు జియో 4జీ సిమ్‌ను ఆఫర్ చేస్తారట. ఇందుకు మీరు చేయవల్సిందల్లా మీ వ్యక్తిగత వివరాలు ఆ వెబ్‌సైట్‌లో పొందుపరచటమే కాకుండా ఆ మెసెజ్‌ను వాట్సాప్‌లో షేర్ చేయాలట. ఇది పూర్తిగా నిరాధారమైన ఆఫర్. ఇలాంటి పుకార్లను నమ్మి మోసపోకండి.

మరో నకిలీ వెబ్‌సైట్

మరో నకిలీ వెబ్‌సైట్ జియో సిమ్‌లను ఉచితంగా అందిస్తున్నట్లు తన సైట్‌లో పేర్కొంది. యూజర్లు తమ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలను నమోదు చేసుకోవటం ద్వారా నేరుగా జియో సిమ్‌ను వారి వారి ఇళ్లకే డెలివరీ చేస్తామని ఈ వెబ్‌సైట్ చెబుతోంది. డెలివరీ సమయంలో అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ఇంకా పాస్‌ర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. 7 నుంచి 10 రోజుల్లో ఈ సిమ్‌ను డెలివరీ చేస్తామని ఛార్జీల క్రింద రూ.199 చెల్లించాల్సి ఉంటుందని వెబ్‌‍సైట్ పేర్కొంది. ఇది పూర్తిగా నిరాధారమైన ఆఫర్. ఇలాంటి పుకార్లను నమ్మి మోసపోకండి.

నేరుగా రిలయన్స్ స్టోర్‌కు వెళ్లి సంప్రదించండి..

జియో సిమ్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తామని చాలా వెబ్‌సైట్‌లు ఇంటర్నెట్‌లో పుట్టుకొస్తున్నాయి. వీటి నమ్మటం వల్ల పూర్తి నష్టపోయేది మీరే. మీరు ఒకవేళ జియో సిమ్‌ను తీసుకోవాలనుకుంటున్నట్లయితే నేరుగా రిలయన్స్ స్టోర్‌కు వెళ్లి సంప్రదించండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Six held for selling Reliance Jio SIM. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot