ఫేస్‌బుక్ సేప్టీ‌గా ఉండాలంటే చిట్కాలు ఇవే

Written By:

ఈ రోజుల్లో ఫేస్‌బుక్ లేకుండా ఎవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఫేస్‌బుక్ లేకుండా ఇప్పుడు బతకడమే కష్టమైపోయింది చాలామందికి. ఉదయాన్నే ప్రెండ్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పడం అలాగే సాయంత్రం గుడ్ నైట్ చెప్పడం మధ్యలో ఆసక్తికర అంశాలు పోస్ట్ చేయడం మాములే కదా..ఇక లైకులు , కామెంట్లు ఇష్టపడేవారయితే ఎన్ని లైకులు వచ్చాయో ఎన్ని కామెంట్లు పెట్టరోనంటూ ఎప్పుడూ దాన్నే అంటిపెట్టుకుని ఉంటారు. అలాంటివారందరికోసం ఫేస్‌బుక్ సేఫ్టీకి కొన్ని చిట్కాలు ఇస్తున్నాం చూడండి.

Read more: ల్యాప్‌టాప్‌కి వైఫై హాట్‌స్పాట్ కనెక్ట్ అవ్వడం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెక్యూర్ అకౌంట్

మీ ఫేస్‌బుక్ తో ఇప్పుడు అనేక సైట్లు అనుసంధానమై ఉంటున్నాయి. అన్నీ ఫేస్ బుక్ నుంచే లాగిన్ కమ్మని చెబుతుంటాయి. వీటి విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ పాస్ వర్డ్ వీలయినంత బలమైనదిగా పెట్టుకోవడం మరచిపోకండి

రివ్యూ యువర్ ప్రైవసీ

మీరు మీ ప్రైవసీ సెట్టింగ్స్ ని ఓ సారి క్లియర్ గా చదవడండి. అందులో టైమ్ లైన్ సెట్టింగ్ లో ట్యాగింగ్ కు సంబంధించిన కొన్ని ఆప్సన్స్ ఉండాయి. మీరు కావాలనుకుంటే వాటిని సెట్ చేసుకోండి.

మేక్ ఎనిమీస్

కొంతమందికి ట్యాగింగ్ పిచ్చి ఉంటుంది. అలాగే ఊరికే మీకు షేర్ చేస్తుంటారు. అటువంటి వారిని మీరు అన్ ప్రెండ్ చేయడం వల్ల వారి భారీ నుంచి రక్షణ పొందవచ్చు. ఇక మీరు కొన్ని లిస్ట్ లు క్రియేట్ చేసుకోండి కాలేజీ ఫ్రెండ్స్ అలాగే కొలీగ్స్, ఫ్యామిలీ.. వీటిల్లో ఫ్రెండ్స్ ని యాడ్ చేసుకోండి.

వాచ్ దోజ్ యాప్స్

మీరు చాలామంది రకరకాల గేమ్స్ ఆడుతామంటూ రిక్వెస్ట్ లు పెడుతుంటారు. అయితే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారు పంపే యాప్స్ విషయంలో ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోని ఓపెన్ చేయండి. దీనికోసం మీరు ఇక్కడ క్లిక్ చేసి రక్షణ పొందండి.

కంట్రోల్ యువర్ డాటా

మీ డాడాను కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం వీడియోలు ప్లే కాకుండా చేయటం అలాగే ముఖ్యమైన పోస్టులు మాత్రమే చూడటం లాంటివి చేయడం వల్ల కూడా డేటా సేవ్ అవుతుంది.

ప్లాన్ ఏ హెడ్

ఎంత సెక్యూరిటీ తీసుకున్నా కొంతమంది మీ అకౌంట్ ని హ్యాక్ చేసి లాక్ చేసి పడేస్తారు. అటువంటి సమయంలో గాబారా పడకుండా ఎవరు హ్యాక్ చేశారు అనే విషయంపై దృష్టిపెట్టి మీ వాల్ లో మెసేజ్ పెట్టండి. మీ ప్రెండ్స్ అందరూ అర్థం చేసుకుంటారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Six Tips to Keep Your Facebook Clean, Secure, and Private
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot