కాలి బూడిదవుతున్న అమెజాన్ అడవులు, ప్రమాదం తప్పదా ?

By Gizbot Bureau
|

ప్రపంచంలోనే అతి పెద్ద అడవి అయిన అమెజాన్ గత కొన్ని రోజులుగా కాలి బూడిదవుతోంది. భూగ్రహం మీద లభించే 20 శాతం ప్రాణవాయువుకు ఆధారమైన ఈ అడవుల్లో కార్చిచ్చు రేగి దగ్ధం అవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రత, తక్కువ మొత్తంలోని ఆర్థ్రత వల్ల ఈ సమయంలో అక్కడ కార్చిచ్చు రగులుకోవడం సాధారణమే అయినా.. ఈ సారి రికార్డు స్థాయిలో మంటలు చెలరేగుతున్నాయి.

కాలి బూడిదవుతున్న అమెజాన్ అడవులు, ప్రమాదం తప్పదా ?

 

ఈ తీవ్రతను శాటిలైట్‌ చిత్రాల్లో బంధించి నాసా సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. దీనిపై యావత్ ప్రపంచం ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరి దీనితో ఆకాశం ఏమైనా చీకటి రంగులోకి మారుతుందేమో అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

 పది లక్షల మంది ఆదిమవాసులు

పది లక్షల మంది ఆదిమవాసులు

30 లక్షలకు పైగా మొక్కలు, జంతువులు, ఇతర జీవజాతులకు అమెజాన్ అడవులు ఆవాసంగా ఉన్నాయి . దాదాపు పది లక్షల మంది ఆదిమవాసులు కూడా ఈ అడవుల్లో నివసిస్తున్నారు. భూతాపాన్ని నియంత్రించటానికి ఈ ప్రాంతం చాలా కీలకమైనది. ఎందుకంటే అమెజాన్ అడవులు ప్రతి ఏటా కోట్లాది టన్నుల కర్బన ఉద్గారాలను పీల్చుకుంటాయి. ఈ చెట్లను నరికి, దహనం చేసినపుడు.. అవి నిల్వచేసుకున్న బొగ్గుపులుసు వాయువు వాతావరణంలోకి విడుదలవుతుంది. కర్బన ఉద్గారాలను శోషించుకునే సామర్థ్యం కూడా ఈ అడవికి తగ్గిపోతుంది.

దాదాపు 74 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న అమెజాన్ అడవులు ప్రధానంగా బ్రెజిల్‌లో ఉన్నాయి. ఆ దేశంలోని అమెజాన్‌ అడవుల్లో గత దశాబ్దం కాలంలోనే ఇప్పుడు చాలా అధికంగా, తీవ్రంగా మంటలు చెలరేగుతున్నాయి. ప్రత్యేకించి ఉత్తర ప్రాంత రాష్ట్రాల్లో ఈ మంటల దుష్ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. అడవుల్లో మంటల కారణంగా బ్రెజిల్‌లో అతి పెద్ద రాష్ట్రమైన అమెజానాస్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

85 శాతం అధికంగా మంటలు
 

85 శాతం అధికంగా మంటలు

ప్రపంచంలో అతిపెద్ద వర్షాధార అడవులు అమెజాన్ అడవులు. ఇక్కడ జులై నుంచి అక్టోబర్ వరకూ కొనసాగే పొడి కాలంలో అటవీ మంటలు చెలరేగటం సాధారణ విషయమే. పిడుగులు పడటం వంటి సహజ సంఘటనలతో పాటు పంటల కోసం, పశువులను మేపటం కోసం అడవులను శుభ్రం చేసే రైతుల వల్ల కూడా ఈ మంటలు చెలరేగుతుంటాయి. అయితే ఈసారి ఈ మంటల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో 85 శాతం అధికంగా మంటలు చెలరేగాయని బ్రెజిల్ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ సమాచారం చెప్తోంది.

 ప్రమాదం ఎంత ?

ప్రమాదం ఎంత ?

ఈ మంటల నుంచి భారీ ఎత్తున పొగ, కార్బన్ విడుదలవుతోంది. మంటల నుంచి రేగుతున్న పొగ అమెజాన్ అడవి మీద, అడవిని దాటి కూడా విస్తరించింది. ఈ పొగ అట్లాంటిక్ సముద్ర తీరం వరకూ ప్రయాణిస్తోందని యూరోపియన్ యూనియన్ కోపర్నికస్ అట్మాస్ఫియర్ మానిటరింగ్ సర్వీస్ (కామ్స్) చెప్తోంది. ఈ పొగ వల్ల దాదాపు 3,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సావో పాలో నగరం మీద ఆకాశం కూడా నల్లబారింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon fire: The sky never goes dark while the rainforest blazes

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X