గ్రూప్ మెసేజింగ్ సర్వీస్ కోసం 'గ్రూప్ మి'ని కొన్న స్కైపీ

Posted By: Super

గ్రూప్ మెసేజింగ్ సర్వీస్ కోసం 'గ్రూప్ మి'ని కొన్న స్కైపీ

శాన్ ప్రాన్సికో: వరల్డ్ ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీస్ స్కైపీ న్యూయార్క్‌కు చెందిన 'గ్రూప్ మి' అనే ఛాటింగ్ సర్వీస్ సంస్దను కోనుగోలు చేయడం జరిగింది. గ్రూప్ మి అప్లికేషన్ సహాయంతో మెసెజీలు పంపడం, మీయొక్క సన్నిహితులు, స్నేహితులు, ఆఫీస్ సహచరులతో కాన్ఫరెన్స్ కాల్స్‌తో మాట్లాడొచ్చు. సరిగ్గా చెప్పాలంటే బ్లాక్ బెర్రీ మొబైల్‌లో మెసేజింగ్ సర్వీస్ లాగన్నమాట. ఇక సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన గూగుల్ ప్లస్‌లో గూగుల్ ప్లస్ హడ్డల్, ఫేస్ బుక్‌లో ఐతే ఫేస్ బుక్ మెసెంజర్ అప్లికేషన్ మాదిరి ఇది పని చేస్తుంది.

రాబోయే కాలంలో స్కైపీ, గ్రూప్ మి రెండు కలసి సంయుక్తంగా వారియొక్క ఐడియాస్‌ని షేర్ చేసుకొని ప్రపంచంలో ఉన్న బిలియన్ జనాభా డైలీ కమ్యూనికేషన్ మరింత ఈజీ చెయ్యడానికి తొడ్పడనున్నాయి. అంతేకాకుండా టాలెంట్‌కి టెక్నాలజీ గనుక తొడైతే రియాలిటీని మన కళ్ల ముందు ఉంచవచ్చునని స్కైపీ సిఈవో టోనీ బేట్స్ తెలియజేశారు. స్కైపీ చెప్పిన దాని ప్రకారం గ్రూప్ మితో కలసి గ్రూప్ మెసేజింగ్ ఎక్స్ పీరియన్స్‌ని మొబైల్ డివైజెస్ ప్లాట్ ఫామ్ అందించడం జరగుతుందని అన్నారు. సాధారణంగా మొబైల్ డివైజెస్‌కి వాయిస్, వీడియో, టెక్ట్స్ లాంటి సర్వీస్‌లను అందిస్తామని తెలియజేశారు.

గ్రూప్ మితో కుదుర్చుకున్న డీల్ ప్రకారం గ్రూప్ మి టీమ్ అంతా న్యూయార్క్ నుండే స్టాండలోన్ అప్లికేషన్స్ తయారు చేస్తుంది. ప్రతి నెలా ప్రపంచ వ్యాప్తంగా స్కైపీకి 174 మిలియన్ యూజర్స్ కనెక్ట్ అవ్వడం జరుగుతుందని తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot