ఇండోనేషియాలో స్కైపీతో ఒప్పందం కుదిరింది

Posted By: Super

ఇండోనేషియాలో స్కైపీతో ఒప్పందం కుదిరింది

ఇండోనేషియాలో ఉన్న కస్టమర్స్‌కు వీడియో కాలింగ్ సర్వీస్‌లను అందించేందుకు అక్కడున్న మొబైల్ ఆపరేటర్ 'టెల్కామ్ సెల్'తో ప్రపంచపు ప్రఖ్యాత కాలింగ్ సర్వీస్‌లను అందించే స్కైపీ ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. ఇటీవలే స్కైపీని మైక్రోసాప్ట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సదుపాయాన్ని ఇండోనేషియా మొబైల్ ఆపరేటర్ 'టెల్కామ్ సెల్' టాప్ 24 స్మార్ట్ ఫోన్స్‌కి అందుబాటులోకి తేనుంది. ఈ టాప్ 24 స్మార్ట్ ఫోన్స్‌లలో బ్లాక్‌బెర్రీ, నోకియా, శాంసంగ్, ఎల్‌జీకి సంబంధించిన మొబైల్స్ ఉన్నాయి.

ఇటీవల కాలంలో మొబైల్ ఆపరేటర్ 'టెల్కామ్ సెల్' ప్రకటించిన అరుదైన ఆఫర్స్‌లలో ఇది ఒకటి. ఏప్రిల్ నెలలో 'టెల్కామ్ సెల్' మొబైల్ వినియోగ దారులు 100 మిలియన్‌కు చేరుకొవడం జరిగింది. ఇండోనేషియాలో మొట్టమొదటి సారి 3జీ సర్వీస్‌లను ప్రారంభించిన ఆపరేటర్‌గా 'టెల్కామ్ సెల్' చరిత్రను సృష్టించింది. స్కైపీ కాలింగ్ సర్వీస్‌లను ప్రవేశపెట్టడం వల్ల 'టెల్కామ్ సెల్' ఆపరేటర్ మరింత అభివృద్దిని సాధించనుందని సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot