ఐప్యాడ్ వీడియో చాటింగ్ కోసం స్కైపీ కొత్త అప్లికేషన్

By Super
|
Skype-iPad
శాన్ ఫ్రాన్సికో: స్కైపీ ఆపిల్ ఐప్యాడ్ కోసం ప్రత్యేకంగా ఓ కొత్త అప్లికేషన్‌ని తయారుచేయనుంది. ఇంటర్నెట్ వాయిస్ ఓవర్ ఐపి సర్వీస్ ప్రోవైడర్ స్కైపీ ఐకానిక్ టాబ్లెట్ అయినటువంటి ఆపిల్ ఐప్యాడ్ కోసం కొత్త అప్లికేషన్ విడుదల చేయడం పట్ల ఆపిల్ కస్టమర్స్ హార్షనీయం వ్యక్తం చేశారు. కొత్తగా రూపోందిస్తున్నటువంటి ఈ ఆప్లికేషన్ వల్ల వై-పై నెట్ వర్క్‌కి కనెక్ట్ అయ్యి వీడియో కాల్స్ ఫంక్షన్స్ అయినటువంటి ఛాటింగ్, ఆడియో కాలింగ్‌ని సులభంగా చేసుకోవచ్చు.

2009వ సంవత్సరం నుండి స్కైపీ ఐఫోన్ అప్లికేషన్ ఉన్నప్పటికీ ఐప్యాడ్‌ ముందు భాగాన కెమెరా లేకపోవడం వల్ల ఈ అప్లికేషన్‌ని అతి కష్టం మీద తోయాల్సి వచ్చేది. మొట్టమొదటి జనరేషన్‌లో వచ్చినటువంటి ఐప్యాడ్‌లో ముందు భాగాన కెమెరా లేకపోవడం వల్ల వీడియో చాటింగ్‌కి బాగా కష్టమైంది. ఐప్యాడ్ 2 వచ్చిన తర్వాత వీడియో చాటింగ్ అనేది సర్వ సాధారణమై పోయింది.

ఐప్యాడ్ 2 వచ్చిన తర్వాత వీడియో చాట్స్, ఫేస్ టైమ్ చాలా ఈజీగా ఉంది. కానీ యూజర్స్ ఎక్కవగా స్కైపీని వాడడానికి కారణం స్కైపీ 3జి, వై-పై రెండు నెట్ వర్క్స్ లోను వర్క్ అవ్వడమే. ఆపిల్ నుండి ఆపిల్ మొబైల్ ఫోన్స్‌ వీడియా చాటింగ్‌కి ఫేస్ టైమ్ ఉపయోగపడుతున్నప్పటికీ, ఆపిల్ నుండి వేరే ప్రోడక్ట్స్‌కి చాటింగ్ చేయాలంటే స్కైపీ ఉంటే చాలా సులభం కనుక స్కైపీ ఈ కొత్త అప్లికేషన్‌ని ప్రవేశపెడుతుంది. కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం స్కైపీ తన కొత్త అప్లికేషన్‌ని యూట్యూబ్‌లో పోస్ట్ చేసిందని సమాచారం.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X