అమ్మకానికి సిద్దంగా ఉన్న స్కైపీ, పోటీలో ఫేస్‌బుక్, గూగుల్

Posted By: Staff

అమ్మకానికి సిద్దంగా ఉన్న స్కైపీ, పోటీలో ఫేస్‌బుక్, గూగుల్

ప్రపంచంలో కెల్లా అతి పెద్దదైన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ తన ఖాతాలోకి స్కైపీని చేర్చుకోవడం లేదా స్కైపీతో కలసి పని చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఫేస్‌బుక్ సిఈవో మార్క్ జూకర్స్‌బర్గ్ స్కైపీ యాజమాన్యంతో చర్చలు జరపినట్లు తెలస్తుంది. స్కైపీని ఫేస్‌బుక్‌లో గనుక ఇంటిగ్రేట్ చేసినట్లైతే యూజర్స్ వాయిస్ కాల్స్, ఛాట్స్‌కి ఇంటర్నెట్‌లో అనుకూలంగా ఉంటుందని తెలిపారు.

మాకు అందినటువంటి వార్తల ప్రకారం ఫేస్‌బుక్ సిఈవో మార్క్ జూకర్స్‌‌బర్గ్ స్కైపీని $3 లేదా $4 మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ఈ విషయంలో స్కైపీ ఫేస్‌బుక్‌తో కలసి జాయింట్ వెంచర్‌గా పని చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు స్కైపీ వాడుతున్నటువంటి వారి సంఖ్య దాదాపు 600మిలియన్స్.

ఇది ఇలాఉండగా సెర్చ్ ఇంజన్ గూగుల్ కూడా స్కైపీ మీద ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే ఫేస్‌బుక్ కంటే ముందు స్కైపీని సెర్చ్ ఇంజన్ గూగుల్ కలసి జాయింట్ వెంచర్‌గా సహాకరించమని కోరినట్లు తెలుస్తుంది. ఐతే వీరిద్దరూ స్కైపీని సంప్రదించినప్పటికీ స్కైపీ మాత్రం పూర్తిగా అమ్మేయడమా లేక ఎవరితో ఒకరితో కలసి జాయింట్‌గా పని చేయడమా అనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈవిషయంలో స్కైపీ అఫీసియల్స్ మాట్లాడడానికి నిరాకరించారు.

ఇలా స్కైపీ మీద రూమర్ రావడం ఇదే మొట్టమొదటి సారి కాదు. మార్చి 2011లో కూడా స్కైపీ ఫేస్‌బుక్‌తో కలసి వీడియో కాలింగ్‌ ప్లాట్ ఫామ్‌ని ఇంటిగ్రేట్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్నటువంటి స్కైపీ వర్సన్ 5.0 కూడా ఫేస్‌బుక్‌ని సపోర్టు చేస్తుంది. చివరకు మరి స్కైపీ ఎవరితో జత కడుతుందో తెలియడం లేదు. ఈ సమాచారం అందిన వెంటనే తెలియజేస్తాం..టచ్‌లో ఉండండి...

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot