రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న 'స్కైపీ'

Posted By: Super

 రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న 'స్కైపీ'

 

వరల్డ్ ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీస్ స్కైపీ ఓ సరిక్రొత్త రికార్డుని సృష్టించింది. ఇంతకీ ఆ రికార్డు ఏమిటనుకుంటున్నారా..? ఒకే రోజు ప్రపంచ వ్యాప్తంగా స్కైపీని సుమారు 35 మిలియన్ యూజర్స్ ఉపయోగించడం వల్ల ఈ రికార్డుని సొంతం చేసుకుంది. దీని అర్దం ఏమిటంటే 35 మిలియన్ల యూజర్స్ ఒకేసారి లాగిన్ అయి స్కైపీ సర్వీస్‌ని ఉపయోగించి ఆడియో లేదా వీడియో కాల్స్‌తో ఛాట్ చేశారన్నమాట.

గత వారంలోనే స్కైపీ 34 మిలియన్లకు చేరిందని ప్రకటించిన అతి కొద్ది రోజుల్లో ఈ రికార్డుని నమోదు చేయడం చాలా సంతోషంగా ఉందని స్కైపీ ప్రతినిధులు తెలియజేశారు. అంతక ముందు స్పైపీ యూజర్స్ 32 మిలియన్లు. ఆడియో మరియు వీడియో కాల్స్ కోసం ఎక్కువ మంది స్కైపీని ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాలన్నింటిని స్కైపీ ప్రతినిధులు బ్లాగ్ ద్వారా తెలియజేశారు.

ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీస్ స్కైపీని గత సంవత్సరం సాప్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాప్ట్ $8.5B చెల్లించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే స్కైపీకి చెందిన అప్లికేషన్‌ని విండోస్ స్మార్ట్‌ఫోన్స్‌లో ప్రవేశపెట్టారు. ఇది మాత్రమే కాకుండా గూగుల్ ప్లస్ కాంపిటేషన్ తట్టుకోవడానికి ఫేస్‌బుక్లో వీడియో ఛాట్‌ని ప్రవేశపెట్టేందుకు గాను స్కైపీతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot