స్లో ఇంటర్నెట్‌తో విసిగిపోయారా.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి.. సూపర్ స్పీడ్ ఇంటర్నెట్ మీ సొంతం..
Slow Mobile Internet: ఇంటర్నెట్ ఇప్పుడు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. సోషల్ మీడియాలో స్క్రోల్ చేయాలన్నా, వీడియోలు చూడాలన్నా, ఆన్‌లైన్ మీటింగ్స్‌కు అటెండ్ అవ్వాలన్నా.. ఇంటర్నెట్ స్పీడ్ సరిగా లేకపోతే చాలా చిరాకు వస్తుంది. వీడియోలు బఫర్ అవుతూ ఆగిపోవడం, డౌన్‌లోడ్స్ లేట్ అవ్వడం, వీడియో కాల్స్ మధ్యలో ఆగి ఆగి రావడం.. ఇలాంటి సమస్యలతో పనులు చేసుకోవడం చాలా కష్టం అవుతుంది.
మీ నెట్‌వర్క్ ఎప్పుడు బాగుపడుతుందా అని వెయిట్ చేయకుండా, మీరే కొన్ని ఫోన్ సెట్టింగ్స్‌లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా, ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచుకోవచ్చు. ఈ పద్ధతులు ఫోన్‌ను ఫాస్ట్ ఇంటర్నెట్ బ్యాండ్‌కు కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. దీంతో మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్‌గా బ్రౌజింగ్ చేసుకోవచ్చు.

* ఇంటర్నెట్ స్పీడ్ ఎందుకు స్లో
మీ మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్ (జియో, ఎయిర్‌టెల్, విఐ లాంటివి) డేటాను 2G, 3G, 4G, LTE, VoLTE వంటి వేర్వేరు బ్యాండ్స్ ద్వారా ట్రాన్స్‌మిట్ చేస్తారు. ఒక్కోసారి, ఫాస్ట్ బ్యాండ్ అందుబాటులో ఉన్నా కూడా మీ ఫోన్ స్లో బ్యాండ్‌లోనే ఉండిపోతుంది. ఇది మీరు నెట్‌వర్క్ సిగ్నల్ తక్కువగా ఉన్న ప్రదేశానికి వెళ్లినప్పుడు జరుగుతుంది.
మీ ఫోన్ ఆటోమేటిక్‌గా స్ట్రాంగ్ బ్యాండ్‌కు మారనప్పుడు కూడా నెట్ స్లో అవుతుంది. నెట్‌వర్క్ రద్దీగా ఉండటం లేదా టెక్నికల్ సమస్యల వల్ల సిగ్నల్ హెచ్చుతగ్గులు తలెత్తవచ్చు అప్పుడు ఇంటర్నెట్ తక్కువ స్పీడ్‌తో వస్తుంది. నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ను రీసెట్ చేయడం లేదా బెస్ట్ బ్యాండ్‌ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా, ఇంటర్నెట్ స్పీడ్‌ను వెంటనే పెంచుకోవచ్చు.
* నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ను ఎలా రీసెట్ చేయాలి
నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ను రీసెట్ చేస్తే, ఫోన్ బెస్ట్ ఇంటర్నెట్ బ్యాండ్‌కు మళ్లీ కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. రీసెట్ చేయడానికి ముందుగా ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. "మొబైల్ నెట్‌వర్క్" లేదా "నెట్‌వర్క్ & ఇంటర్నెట్" ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. (ఇది మీ ఫోన్ మోడల్‌ను బట్టి ఉంటుంది). నెట్‌వర్క్ ప్రొవైడర్ సెలెక్ట్ చేయాలి.
"సెలెక్ట్ ఆటోమేటిక్లీ" ఆప్షన్‌ను డిసేబుల్ చేయడానికి దానిపై ట్యాప్ చేయాలి. నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను (జియో, ఎయిర్‌టెల్, విఐ, మొదలైనవి) మ్యాన్యువల్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెట్టింగ్స్ మార్చాక ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేసిన తర్వాత, మీ ఫోన్ ఫాస్ట్ ఇంటర్నెట్ బ్యాండ్‌కు కనెక్ట్ అవుతుంది. దీంతో బ్రౌజింగ్ స్పీడ్ పెరుగుతుంది.
* 4G లేదా LTE నెట్‌వర్క్‌ను ఎలా ఎన్నుకోవాలి
మీ ఫోన్ ఎప్పుడూ ఫాస్టెస్ట్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యేలా చేసుకోవడానికి, కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. "కనెక్షన్స్" లేదా "సిమ్ కార్డ్ మేనేజర్" ఆప్షన్‌పై నొక్కాలి. మొబైల్ డేటా లేదా మొబైల్ నెట్‌వర్క్ సెలెక్ట్ చేయాలి. "ప్రిఫర్డ్ నెట్‌వర్క్ టైప్" లేదా "నెట్‌వర్క్ మోడ్" ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి.
4G/LTE/3G (ఆటో కనెక్ట్) ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. సెట్టింగ్స్ నుండి బయటకు రావాలి. ఈ సెట్టింగ్ వల్ల మీ ఫోన్ 3G లేదా 2G లాంటి స్లో నెట్‌వర్క్స్ కంటే 4G లేదా LTEకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఫలితంగా ఇంటర్నెట్ స్పీడ్ బాగా పెరుగుతుంది. తద్వారా వీడియోలు మంచి క్వాలిటీలో చూసుకోవచ్చు.
* మరికొన్ని ట్రిక్స్
నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ను మార్చడంతో పాటు, మీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచడానికి ఇంకా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టిప్ ఏంటంటే ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ అండ్ ఆఫ్ చేయాలి. ఎయిర్‌ప్లేన్ మోడ్ మీ నెట్‌వర్క్ కనెక్షన్‌ను రిఫ్రెష్ చేస్తుంది. దీన్ని 10 సెకన్ల పాటు ఆన్ చేసి, తర్వాత ఆఫ్ చేయాలి.
ఇది ఫోన్‌ను స్ట్రాంగెస్ట్ సిగ్నల్‌కు మళ్లీ కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అలాగే బ్రౌజర్లు, యాప్స్ నుంచి క్యాచీ క్లియర్ చేయాలి. ఎక్కువ క్యాచీ డేటా ఉంటే ఇంటర్నెట్ స్పీడ్ స్లో అవుతుంది. బ్రౌజర్, యాప్ క్యాష్‌ను రెగ్యులర్‌గా క్లియర్ చేయాలనే సెట్టింగ్స్ > యాప్స్ > బ్రౌజర్/యాప్ > స్టోరేజ్ > క్లియర్ క్యాచీకి వెళ్లాలి.
* వేరే సిమ్ స్లాట్‌ను యూజ్ చేయాలి
ఫోన్‌లో రెండు సిమ్ స్లాట్స్ ఉంటే, సిమ్ కార్డ్‌ను వేరే స్లాట్‌లో వేసి ట్రై చేయాలి. ఒక్కోసారి ఒక స్లాట్‌లో సిగ్నల్ రిసెప్షన్ ఇంకో స్లాట్ కంటే బెటర్‌గా ఉంటుంది. అలాగే పీక్ అవర్స్‌లో (సాయంత్రం లేదా వీకెండ్స్‌లో), నెట్‌వర్క్‌లు రద్దీగా ఉంటాయి. తక్కువ మంది ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఇంటర్నెట్‌ను యూజ్ చేయడానికి ట్రై చేయాలి.
* వై-ఫై బూస్టర్ యాప్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్
కొన్ని యాప్స్ నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ను ఆప్టిమైజ్ చేసి స్పీడ్‌ను పెంచుతాయి. ప్లే స్టోర్ నుంచి ఏదైనా నమ్మదగిన నెట్‌వర్క్ బూస్టర్ యాప్‌ను ట్రై చేయవచ్చు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌తో నెట్‌వర్క్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సెట్టింగ్స్ > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కు వెళ్లి లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.


Click it and Unblock the Notifications








