మీ వైఫై స్లోగా ఉందా, అయితే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి
నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో ఇంటర్నెట్ ఓ నిత్యావసర సాధనంలా మారిన నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ కనిపిస్తోంది. వై-ఫై నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చాక పోన్ బిల్స్ విపరీతంగా ఆదా అవు
నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో ఇంటర్నెట్ ఓ నిత్యావసర సాధనంలా మారిన నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ కనిపిస్తోంది. వై-ఫై నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చాక పోన్ బిల్స్ విపరీతంగా ఆదా అవుతున్నాయి. అయితే ఇంట్లో ఒక్కోసారి Wi-Fi సిగ్నల్ సరిగ్గా రాకపోవచ్చు.దానికి ముఖ్య కారణం మీ Wi-Fi router ను సరైన ప్లేస్ లో ఉంచకపోవడం. అవగాహన లేకుండా వై-ఫై వ్యవస్థను ఏర్పాటు చేయటం కనక్షన్ అంత వేగవంతంగా పని చేయదు. అందుకని ఇల్లు అన్ని మూలల నుండి యాక్సిస్ చెయ్యగల గదిలో ఉంచండి.

ఈ విధంగా ఇది ఇంటిలోని అన్ని ప్రాంతాలలో సిగ్నల్ బలం సమానంగా ఉందని నిర్ధారిస్తుంది.ఈ శీర్షిక లో భాగంగా Wi-Fi router వేగంగా పని చేయడానికి టిప్స్ ను మీకు అందిస్తున్నాం. ఓ లుక్కేయండి .

మీ రూటర్ అప్ డేట్
మీ రూటర్ ని ఎప్పటికప్పుడే లేటెస్ట్ firmwareకు అప్ డేట్ చేయడం మరచిపోకండి. అలా చేయడం వల్ల వైఫై ఫాస్ట్ గా అందుకోవచ్చు.

డ్యూయల్ బ్యాండ్ స్పీడ్
మీరు డ్యూయల్ బ్యాండ్ రూటర్ స్పీడ్ వాడుతుంటే దాని స్పీడు 5GHz frequency ఉండేలా చూసుకోండి. మాములుగా అయితే ఇది 2,4GHz స్పీడు ఉంటుంది. దీని వేల్ల వైఫై ఫాస్ట్ అయ్యే అవకాశం ఉంది.

maximum coverage
మీ వైఫైని వీలయినంతవరకు స్పీడు ఎంత ఎక్కువ ఉంటే అంతవరకు పెంచుకునే విధంగా ప్రయత్నించండి.

ఇంటి మధ్య భాగంలో
వై-ఫై రూటర్‌ను ఇంటి మధ్య భాగంలో సెట్ చేసినట్లయితే సిగ్నల్ అన్ని మూలలకు అందుతుంది.టీవీల దగ్గర వైఫై రూటర్‌ని ఉంచండం వల్ల సిగ్నల్స్ సరిగా అందవని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి

యాప్స్
బ్యాండ్ విడ్త్ ని కంట్రోల్ చేసుకునేందుకు మంచి యాప్స్ వాడేందుకు ప్రయత్నించండి. సెట్టింగ్స్ లో నెట్ వర్క్ అడ్మినిస్ట్రేషన్ లో Quality of Service (QoS)మీద బాగా దృష్టి పెట్టండి.

ప్లాన్ అప్ డేట్
లేటెస్ట్ వై-ఫై టెక్నాలజీని వాడటం వల్ల వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్‌లను అందుకోవచ్చు.అలాగే ప్లాన్ కూడా అప్ డేట్ అవుతూ ఉండాలి.మీ ఇంట్లోని వై-ఫై ఛానల్ కరెక్టుగా పనిచేస్తుందో లేదో తెలుసుకునేందుకు వైఫై ఎనలైజర్‌ను వాడుకోండి

ఎత్తైన టేబుల్
వై-ఫై రూటర్‌ను ఎప్పుడూ ఎత్తైన టేబుల్ లేదా అల్మారా పై ఉంచండి. కింద ఉంచడం వల్ల సిగ్నల్స్ అంత తొందరగా అన్ని చోట్లకు రావు.డవై-ఫై రూటర్‌కు దగ్గరలో ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైస్‌లను ఉంచటం మంచిది కాదు. ఈ ప్రభావం సిగ్నల్ప్ పై చూపుతుంది.

పాస్‌వర్డ్‌ను బయటకు పొక్కకుండా
మీ వై-ఫై రూటర్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌ను బయటకు పొక్కకుండా చూసుకోండి. ఇతరులకు తెలిస్తే వాళ్లు మీ అనుమతి లేకుండానే మీ వై-ఫైను యూస్ చేసుకో గలుగుతారు.వై-ఫై కనెక్షన్ బాగుండాలంటే మంచి కనెక్షన్ అవసరం. కాబట్టి కంపెనీ రూటర్స్‌ను ఎంపిక చేసుకోండి.


Click it and Unblock the Notifications








