చిన్నారి సాహసం!!! రూ.3.7 కోట్ల స్కామ్ యాప్ లను గుర్తించడంలో పరిశోధకులకు సహాయం
బాలికలు ఎందులోనూ తక్కువ కాదు అని ఒక చిన్నారి మరొకసారి ప్రపంచానికి రుజువు చేసింది. ప్రాగ్‌కు చెందిన ఒక చిన్న అమ్మాయి గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్‌లలో గల ఏడు స్కామ్ యాప్లను కనుగొనింది మరియు వాటిని ఫ్లాగ్ చేయడానికి భద్రతా పరిశోధకులకు సహాయపడింది కూడా. కొన్ని నివేదికల ప్రకారం ఈ హానికరమైన స్కామ్ యాప్ లు ఇప్పటికే 2.4 మిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేయబడ్డాయి మరియు వీటిని తొలగించడానికి ముందు సుమారు 3.7 కోట్ల కంటే ఎక్కువ సంపాదనను ఆర్జించాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

హానికరమైన స్కామ్ యాప్ ల ప్రచారం
హానికరమైన స్కామ్ యాప్ లు ఆశ్చర్యకరంగా ఇన్‌స్టాగ్రామ్ మరియు టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అధికంగా ప్రచారం చేయబడ్డాయి. ఇవి ఎక్కువగా చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకున్నాయి. చెక్ రిపబ్లిక్‌లోని అవాస్ట్ బీ సేఫ్ ఆన్‌లైన్ ప్రాజెక్ట్‌కు యాప్ లలో ఒకదాన్ని ప్రచారం చేస్తున్న టిక్‌టాక్ ప్రొఫైల్‌ను ఈ చిన్న అమ్మాయి నివేదించే వరకు ఈ యాప్ లు ఎవరికి తెలియకుండా విజయవంతంగా తమను తాము దాచడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో చదువుకున్న పిల్లలు ఎలా సురక్షితంగా ఉండాలనేది అవాస్ట్ యొక్క ప్రత్యేక ప్రాజెక్ట్.

అవాస్ట్ బీ సేఫ్ ఆన్‌లైన్ ప్రాజెక్ట్‌లో స్కామ్ యాప్ లు
అవాస్ట్ యాప్ లను పరిశీలించినప్పుడు దూకుడుగా ప్రదర్శించబడుతున్న ప్రకటనలు మరియు వాటిని తొలగించడానికి వినియోగదారుల వద్ద నుండి $ 2 నుండి $ 10 మధ్య వసూలు చేసినట్లు వెల్లడించారు. యాప్ లు సరళమైన పరికరాలలోను అందించబడతాయి అవి "డివైస్ ను వైబ్రేట్ చేయడానికి, వాల్‌పేపర్‌ల కోసం లేదా సంగీతం వినడానికి కారణమవుతాయి" అని అవాస్ట్ చెప్పారు. కొన్ని యాప్ లు హిడెన్ఆడ్స్ ట్రోజన్లు ఇవి సురక్షితమైన యాప్ వలె మారువేషంలో ఉంటాయి కానీ వాటికి బదులుగా అనుచిత ప్రకటనలను అధికంగా అందిస్తాయి.

నకిలీ యాప్ లను అన్‌ఇన్‌స్టాల్ చేసే ప్రక్రియ
నకిలీ యాప్ లో డజన్ల కొద్ది ప్రకటనలు అందించబడతాయి. దీని యొక్క అసలు యాప్ చిహ్నం దాచబడి ఉంటుంది కాబట్టి వినియోగదారులు ఈ ప్రకటనలు ఎక్కడ నుండి వస్తున్నాయో గుర్తించడంలో విఫలమవుతారు. దాచిన చిహ్నాలు అంటే ఈ యాప్ లను గుర్తించడం మరియు అన్‌ఇన్‌స్టాల్ చేయడం చాలా కష్టం. ఈ యాప్ లు అవి ఉపయోగించబడనప్పుడు కూడా ప్రకటనలను చూపుతాయి. భద్రతా పరిశోధకులు అప్రమత్తమై వీటిని గుర్తించిన తర్వాత వారు ఆపిల్ మరియు గూగుల్ రెండింటికి తెలియజేస్తారు. గూగుల్ ఇప్పటికే ఈ యాప్ లను తొలగించింది కానీ ఆపిల్ ఇంకా స్పందించలేదు.


Click it and Unblock the Notifications