లైటు వేయండి,రూటర్ లేకుండా డేటాను పొందండి
సాధారణంగా ఎయిర్ పోర్టులు, ఆస్పత్రులు వంటి ప్రత్యేక ప్రాంతాల్లో ఎక్కువగా రేడియో ఫ్రీక్వెన్సీ వాడుతుంటారు. ఇలా ఎందుకంటే ఇంటర్నల్ గా వైర్ లెస్ కమ్యూనికేట్ కావడం లేదా కొన్ని ముఖ్యమైన డివైజ్ లతో కనెక్ట్ అవ్వడం కోసం ఈ ఫ్రీక్వెన్సీ వాడుతుంటారు. ఇందులో భాగంగానే శాస్ర్తవేత్తలు కొన్ని సంవత్సరాల క్రితం Li-Fi వైర్ లెస్ టెక్నాలజీని రూపొందించారు. ఏమయిందో ఏమో కానీ ఈ టెక్నాలజీ ఇంకా పెద్దగా వినియోగంలోకి రాలేదు.

అయితే ఈ కొరతను తీరుస్తూ నెదర్లాండ్ దిగ్గజం Philips లేటెస్ట్ టెక్నాలజీతో రూటర్ అవసరం లేని వైఫైని ప్రవేశపెట్టింది. రూటర్ లేకుండా వైఫై ఎలా అనుకుంటున్నారా..అయితే ఈ న్యూస్ చదివేయండి.

ట్రూలిఫై (Truelifi)
స్మార్ట్ బల్బ్ ల తయారీ సంస్థ పిలిఫ్స్ హ్యూ స్మార్ట్ బల్బ్ లైనప్ లో భాగంగా కొత్త రేంజ్ Li-Fi లైట్స్ ను ప్రవేశపెట్టనుంది. దీనికి ట్రూలిఫై (Truelifi) అనే నామకరణం చేసింది. కాగా వై-ఫై నుంచే లి-ఫై అనే పేరు దీనికి పెట్టారు. ఈ లైట్ సహయంతోకాంతి తరంగాల ద్వారా డేటా ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టమ్ కు కనెక్ట్ అవుతుంది. 4G, వై-ఫై ద్వారా రేడియో సిగ్నల్స్ కంటే కాంతి తరంగాల ద్వారా డేటా షేరింగ్ ఈజీగా షేర్ అవుతుంది.

150 Mbps స్పీడ్ నెట్
Smart Blub వైర్ లెస్ నెట్ వర్క్. స్మార్ట్ బల్బ్ ద్వారా వెలువడే కాంతి తో నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. ట్రూలిఫి ద్వారా స్మార్ట్ బల్బ్ నుంచి వెలువడే కాంతిలో 150 Mbps స్పీడ్ నెట్ వస్తుంది. ఈ డేటాను ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జిస్టింగ్ లైటింగ్ తో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు.

250Mbps స్పీడ్ వరకు డేటా కనెక్ట్
అవసరానిబట్టి Li-Fi వైర్ లెస్ కనెక్షన్ రెండు పాయింట్లతో 250Mbps స్పీడ్ వరకు డేటా కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ టెక్నాలజీని బిజినెస్, ఆస్పత్రుల్లో మాత్రమే వాడుతున్నారు. భవిష్యత్తులో రెగ్యులర్ యూజర్లకు కూడా లి-ఫై టెక్నాలజీ అందుబాటులోకి రానుంది.

కాంతి ఎంత వరకు ఉంటే
దీని రాకతో భవిష్యత్తులో రూటర్ల అవసరం ఉండకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరికరాన్ని ఎవరైతే యాక్సస్ అయి ఉన్నారో వారు ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. డేటా కూడా పరిమితంగా ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. లైటు నుంచి వచ్చే కాంతి ఎంత వరకు ఉంటే ఆ స్థాయిలో మాత్రమే డేటా ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది.

హ్యాకింగ్ సమస్య
ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ లైట్ ద్వారా ఎంతరవకు సెక్యూరిటీ గా ఉంటామనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టతనివ్వలేదు. హ్యాకర్లు ఇది అనుకూలంగా మారే అవకాశం ఉంటుందనే దానిపై కూడా సందేహాలు వస్తున్నాయి. రక్షణ పరంగా ఇది ఎంతవరకు పనిచేస్తుందనేది ముందు ముందు చూడాలి.


Click it and Unblock the Notifications