స్మార్ట్ సైలెంట్ యాప్, సైలెంటుగా పని కానిచ్చేస్తుంది!

Posted By:

రకరకాల పనులు రిత్యా మన స్మార్ట్‌ఫోన్‌లను ఏదో ఒక సందర్బంలో సైలెంట్ మోడ్‌లో పెడుతుంటాం. ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పుడు ముఖ్యమైన కాల్స్‌ను రిసీవ్ చేసుకోవటం కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో వేర ధ్యాసలో పడిపోయి ఫోన్‌ను సైలెంట్ మోడ్ నుంచి నార్మల్ మోడ్‌కు తీసుకురావటం మర్చిపోతుంటాం.

స్మార్ట్ సైలెంట్ యాప్, సైలెంటుగా పని కానిచ్చేస్తుంది!

ఇలాంటి పరిస్థితుల్లో చాలా ముఖ్యమైన కాల్స్‌ను మిస్ అవ్వాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా స్మార్ట్ సైలెంట్ యాప్ మార్కెట్లో హల్‌చల్ చేస్తోంది. ఆటో రెస్పాన్స్, అర్జెంట్ కాల్ అలర్ట్, స్విచెస్ ఆఫ్ వంటి ప్రత్యేకతలు ఈ యాప్‌లో ఉన్నాయి.

స్మార్ట్ సైలెంట్ యాప్, సైలెంటుగా పని కానిచ్చేస్తుంది!

స్మార్ట్ సైలెంట్ యాప్‌లోని ఆటో రెస్పాన్స్ ఫీచర్ ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పుడు ఎవరైనా కాల్ చేసినట్లయితే కాలర్, యూజర్ గురించి తప్పుగా అర్థం చేసుకోకుండా బిజీగా ఉన్నట్లు సదరు కాలర్‌కు ఆటో ఎస్ఎంఎస్‌ను స్మార్ట్ సైలెంట్ యాప్‌ పంపుతుంది. పంపిన ఆటో ఎస్ఎంఎస్‌కు రిప్లైగా అవతలి కాలర్ నుంచి URGENT అని మెసేజ్ వచ్చినట్లయితే అతిముఖ్యమైన కాల్‌‍గా భావించి స్మార్ట్ సైలెంట్ యాప్ వెంటనే యూజర్‌ను అప్రమత్తం చేస్తుంది.

స్మార్ట్ సైలెంట్ యాప్, సైలెంటుగా పని కానిచ్చేస్తుంది!

స్మార్ట్ సైలెంట్ యాప్‌లోని స్విచెస్ ఆఫ్ ఫీచర్ ద్వారా ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉంచినపుడు కొంత టైమ్‌ను సెట్ చేసుకున్నట్లయితే ఆ టైమ్ ముగిసిన వెంటనే ఫోన్ ఆటోమెటికగా నార్మల్ మోడ్‌కు వచ్చేస్తుంది. ఆక్మిన్ టెక్నాలజీస్ ద్వారా డిజైన్ కాబడిన ఈ సరికొత్త ఆండ్రాయిడ్ యాప్‌ను www.SmartSilent.in నుంచి  ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు Google Play Store నుంచి స్మార్ట్ సైలెంట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

English summary
Smart Silent App - The New Way To Put Your Phone in Silent Mode. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot