Noise కొత్త స్మార్ట్‌వాచ్.. దూరంలో ఉన్న స్మార్ట్‌ఫోన్లతోనూ కనెక్ట్ కావచ్చు..!
ప్రముఖ స్మార్ట్‌వాచ్‌ల తయారీ సంస్ధ నాయిస్ గుడ్‌న్యూస్ చెప్పింది. తన కొత్త వాచ్ కలర్‌ఫిట్ మైటీని భారత మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు తెలిపింది. మంచి ఫీచర్లు, స్టైలిస్ లుక్ స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్న యువతను తమ కలర్‌ఫిట్ మైటీ వాచ్ ఆకట్టుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కలర్‌ఫిట్ మైటీ స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలు మీకోసం.
నాయిస్ కలర్‌ఫిట్ మైటీ స్మార్ట్‌వాచ్ 1.96 అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మెటల్ బిల్డ్‌తో వస్తుంది. ఆకర్షణీయమైన స్ట్రిప్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ స్మార్ట్‌వాచ్ 500 nits బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా ఎక్కువ సూర్యకాంతిలోనూ స్పష్టంగా డిస్‌ప్లేను చూడవచ్చు.

నాయిస్ తాజా స్మార్ట్‌వాచ్ 360 డిగ్రీలు తిరగగలిగే క్రౌన్‌ను కలిగి ఉంటుంది. వాచ్‌లోని ఇతర ఫీచర్ల కోసం మిగిలిన స్మార్ట్‌వాచ్‌ల మాదిరిగా స్క్రీన్‌ను స్వైప్ చేయాల్సిన అవసరం లేదు. క్రౌన్‌ను పైకి, కిందకు కదిలించడం ద్వారా ఫీచర్లను వినియోగించుకోవచ్చు. మరియు ఈ వాచ్ సింగిల్ చిప్ బ్లూటూత్ టెక్నాలజీతో వస్తుంది. దీంతో సులభంగా స్మార్ట్‌ఫోన్లతో జతచేయవచ్చు. ఈ వాచ్‌లో ఉన్న v5.3 టెక్నాలజీతో తక్కువ బ్యాటరీ వినియోగంతో దూరంలోని ఫోన్లతో కనెక్ట్ చేయవచ్చని సంస్థ వెల్లడించింది.
నాయిస్ కలర్ ఫిట్ మైటీ స్మార్ట్‌వాచ్‌లో ఆరోగ్యానికి సంబంధించిన అనేక ఫీచర్లు ఉన్నాయి. నాయిస్ హెల్త్ సూట్‌ను కలిగి ఉంటుంది. అందులో SPO2 లెవల్, గుండె స్పందన రేటు, స్లీప్ ప్యాట్రన్లు, బ్రీతింగ్ ప్యాట్రన్లు మరియు యాక్టివిటీ లెవల్‌కు సంబంధించిన ఫీచర్లు ఉంటాయి. అంతర్గతంగా ఏర్పాటు చేసిన ఫీచర్లతో రోజు వారీగా ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం అందిస్తుంది. మరియు వాతావరణ సమాచారం కూడా అందిస్తుందని నాయిస్ సంస్థ తెలిపింది.
నాయిస్ కలర్ ఫిట్ మైటీ స్మార్ట్‌వాచ్ నాయిస్ ఫిట్ యాప్ సహా 110పైగా స్పోర్ట్స్ మోడళ్లు, 100 పైగా ఫేస్‌లతో అందుబాటులో ఉంది. ఈ వాచ్‌ను ఒక్కసారి పుల్ ఛార్జింగ్ చేస్తే వారం రోజులపాటు బ్యాటరీ వస్తుందని సంస్థ వెల్లడించింది. దీంతోపాటు వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్ IP67 రేటింగ్‌తో వస్తుందని పేర్కొంది.
నాయిస్ కొత్త స్మార్ట్‌వాచ్ జెట్ బ్లాక్, క్లామ్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, బుర్గుండి వైన్ మరియు సిల్వర్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. కలర్‌ఫిట్ మైటీ స్మార్ట్‌వాచ్ ధర రూ. 1,999గా ప్రకటించింది. గోనాయిస్ మరియు ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చని తెలిపింది.
సరికొత్త టెక్నాలజీతో వినియోగదారుల అవసరాలకు తగినట్లు ఉత్పత్తులను అందిస్తున్నామని నాయిస్ సహ వ్యవస్థాపకుడు అమిత్ ఖత్రి తెలిపారు. విలువైన అప్‌గేడ్‌లతో పరిశ్రమ ప్రమాణాలను మార్చడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








