కంటికి ఎసరు తెచ్చిన మొబైల్ పిచ్చి, మీరు జాగ్రత్త మరి !

Written By:

స్మార్ట్‌ఫోన్లు ఎంత ప్రమాదమో ఈ న్యూస్ చదివినవారికే తెలుస్తుంది. దానికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు చాలామందే ఉన్నారు. రోజువారి జీవితంలో స్మార్ట్‌ఫోన్‌ లేకుండా గడపలేనంత స్థితికి నేడు జనాలు వచ్చారు. అలానే ఓయువతి స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి ఫోన్‌లో ఒకరోజంతా ఆటలాడి తన కన్నును కోల్పోయింది.

దూసుకొస్తున్న Jio పేమెంట్ బ్యాంక్‌, SBIతో కలిసి ముందుకు,సమగ్ర సమాచారం ఇదే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనాకు చెందిన షుడోనిమ​వూ జియాజింగ్‌

వివరాల్లోకి వెళ్తే చైనాకు చెందిన షుడోనిమ​వూ జియాజింగ్‌ అనే 21 ఏళ్ల యువతి ఓకంపెనీలో ఫైనాన్స​ డిపార్ట్‌మెంట్‌లో పనిస్తోంది. ఈనెల ఒకటో తేదీన 'కింగ్ గ్లోరీ' అనే గేమ్‌ను రోజు మొత్తం ఆడింది.

కుడికన్ను రెటినాల్ ఆర్టరి

దీంతో ఆమె కుడి కన్ను పాక్షికంగా పనిచేయడం మానేసింది. దీంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుడికన్ను రెటినాల్ ఆర్టరి ఆక్యులోషన్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. చూపు కోసం పలు ఆస్పత్రుల్లో చికిత్స అందించినా ఉపయోగం లేకపోయింది.

ప్రతిరోజు 8గంటల పాటు గేమ్‌

జియాజింగ్‌ ప్రతిరోజు 8గంటల పాటు గేమ్‌ ఆడేది. కనీసం తిండి తినడం, ఏదైనా తాగకుండా ఏకధాటిగా ఆడేది.

ఒకరోజంతా ఆటతోనే..

ఆక్టోబర్‌ ఒకటిన మాత్రం ఒకరోజంతా ఆటతోనే గడిపింది. దీంతో తన చూపు కోల్పోవాల్సి వచ్చింది. ఈ గేమ్‌కు చైనాలో అత్యంత ప్రజాదరణ ఉంది. ఏకంగా 200 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.

 

పోకేమాన్ ఆటలో పడి ..

ఇంతకు ముందు పోకేమాన్ ఆటలో పడి ఇలానే చాలామంది తమ ప్రాణాలను కోల్పోయారు. అది పోలీసులను సైతం ముప్పతిప్పలను పెట్టిన సంగతి తెలిసిందే.

తేరుకోకముందే మళ్లీ బ్లూ వేల్..

ఆ దుర్ఘటన నుంచి తేరుకోకముందే మళ్లీ బ్లూ వేల్ అంటూ ఓ కొత్త ఆట ప్రపంచానికి మరిచిపోయింది. ఈ ఆట ఆడేవారు డిప్రెసన్ లో కెళ్లి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Smartphone addict goes BLIND in one eye after 24-hour gaming binge Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot