Home
News

ట్విట్టర్ వేదికగా కత్తులు దూసుకుంటున్న చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ బాసులు

ఇండియన్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌‌లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనా కంపెనీల బాసులు ఒకరి మీద మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. వీరితో పాటు అమెరికా, దక్షిణ కొరియా కంపెనీల మధ్య పోటీ నెలకొని ఉండటంతో భార

ఇండియన్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌‌లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనా కంపెనీల బాసులు ఒకరి మీద మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. వీరితో పాటు అమెరికా, దక్షిణ కొరియా కంపెనీల మధ్య పోటీ నెలకొని ఉండటంతో భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ లో విపరీతమైన పోటీ నెలకింది. ఆపిల్, శాంసంగ్ లాంటి దిగ్గజ కంపెనీలకు ధీటుగా చైనా కంపెనీలు షియోమి, వివో, ఒప్పో, రియల్‌మి లాంటి కంపెనీలు సరికొత్త వ్యూహాలతో మార్కెట్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ఓ కంపెనీ ఫోన్ లాంచ్ కాగానే మరొక కంపెనీ అధినేత దానిపై వ్యంగ్యంగా ట్వీటులు చేస్తూ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నారు.

ట్విట్టర్ వేదికగా కత్తులు దూసుకుంటున్న చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ బాసులు

ట్విటర్ వేదికగా యుద్ధం

ఇండియా మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు బాస్‌లు ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. ట్విటర్ వేదికగా పరస్పరం బహిరంగంగా ట్వీట్‌ యుద్ధం మొదలు పెట్టారు. దీంతో నెటిజన్లు పలు జోక్‌లు, ట్విటర్ మెమెలతో పండుగ చేసుకుంటున్నారు.

ప్రత్యర్థులపై వరుస ట్వీట్లతో..

ప్రత్యర్థులపై వరుస ట్వీట్లతో..

ఇందులో భాగంగా షియోమి ఇండియా ఎండీ మను కుమార్‌జైన్‌ భారతీయ మార్కెట్‌లో టాప్‌ పొజిషన్‌ కోసం తంటాలు పడుతున్నాడు. ప్రత్యర్థులపై వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఒప్రో సబ్ బ్రాండ్ రియల్ మి మీద ఆయన చేసిన ట్వీట్ ఇప్పుు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మకాలను రాబట్టుకునేందుకు ఆయన వేసిన ఎత్తుగడ ఆయనకే ఎదురు తగిలింది.

వణుకు పుట్టిస్తున్న ఒప్పో

వణుకు పుట్టిస్తున్న ఒప్పో

కాగా చైనా దిగ్గజం షియోమి 2018లో రికార్డు స్థాయి అమ్మకాలతో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపింది. 2019 వచ్చే నాటికి ఆ పొజిషన్ లో గట్టి పోటీ ఇచ్చేందుకు ఒప్పో కంపెనీ దూసుకువచ్చింది. చైనాకు చెందిన ఒప్పో బ్రాండ్‌ రియల్‌మి బడ్జెట్‌ ధరల డివైస్‌లతో ఇండియా మార్కెట్లో షియోమికి వణుకు పుట్టిస్తోంది.

కౌంటర్ రీకౌంటర్

కౌంటర్ రీకౌంటర్

ఒప్పో నుంచి వచ్చిన ప్రతీ ఫోన్ సరికొత్త ఫీచర్లు, తక్కువ ధరలతో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటున్నయి. ఈ పరిణామాలపై గుర్రుగా ఉన్న జైన్‌ రెడ్‌మి నోట్‌ ప్రొ 7 స్మార్ట్‌ఫోన్‌ ప్రాసెసర్‌ క్వాల్కం స్నాప్డ్రాగెన్ రియల్‌ మి 3 ప్రొ ప్రాసెసర్‌ కంటే పాతది అని ట్వీట్‌ చేశాడు. దీనికి అదే స్థాయిలో రియల్‌మి ఇండియా సీఈవో సేథ్‌ కౌంటర్‌తో విరుచుకుపడ్డారు. తమ మిలియన్ల విక్రయాలను చూసి ఎవరికో భయం పట్టుకుందంటూ కౌంటర్‌ ఇచ్చాడు.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

ఈ ట్వీట్లు, సోషల్ మీడియాలో విపరీతంగా రీట్వీట్‌ అవుతుండటం, వీటిపై విపరీతంగా జోక్స్‌ పేలుతుండటంతో ఇద్దరూ వారి వారి ట్వీట్లను వెంటనే డిలిట్‌ చేశారు. అయినప్పటికీ అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా 2019 మొదటి త్రైమాసికంలో షావోమి ఎగుమతులు 2 శాతం క్షీణించడం, భారత్‌లో రియల్‌ మి ఏడు శాతం మార్కెట్ వాటాను సాధించడంతో మను జైన్‌లో ఆందోళన మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

2019 మొదటి త్రైమాసికంలో

2019 మొదటి త్రైమాసికంలో

కౌంటర్‌ పాయింట్‌ పరిశోధన ప్రకారం 2019 మొదటి త్రైమాసికంలో షియోమి మార్కెట్‌ వాటా పడిపోయింది. గత ఏడాది 31శాతంతో పోలిస్తే 2 శాతం క్షీణించి ఏడాది 29 శాతానికి పరిమితమైంది. అయితే అదే తరణంలో రియల్‌మి మాత్రం రెండవ వరుస క్వార్టర్లో టాప్‌ 5 బ్రాండ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. మరోవైపు వివో 2019 ఫస్ట్‌ కార్టర్లో టాప్‌కి చేరింది.

వన్ ప్లస్ మీద ట్వీట్,
ఇటీవల తైవాన్‌ స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ వన్‌ప్లస్‌ను డైరెక్ట్‌గానే టార్గెట్‌ చేసిన మనూ జైన్‌.. వన్‌ప్లస్‌ లేటెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ వస్తోందని విన్నాం. ఫ్లాగ్‌షిప్‌ కిల్లర్‌ 2.0 వస్తోంది..అంటూ ఉడికిస్తూ ట్వీట్‌ చేశారు. దీంతో వన్ ప్లస్ కూడా ఆ ట్వీట్ పై గుర్రుగా ఉంది. రీకౌంటర్ కోసం ఎదురుచూస్తోంది.

 

నెక్ట్స్‌ టార్గెట్‌ అసుస్

నెక్ట్స్‌ టార్గెట్‌ అసుస్

ఇదిలా ఉంటే ఆసుస్‌ జెన్‌ ఫోన్‌ సిరీస్‌లో భాగంగా రొటేటింగ్‌ కెమెరా స్పెషల్‌ ఫీచర్‌గా జెన్‌ఫోన్‌6ను ఈ మధ్య ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. మరి షియోమి బాస్‌ మను కుమార్ జైన్ నెక్ట్స్‌ టార్గెట్‌ అసుస్ ఫోన్ మీదనే అంటే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

150 నగరాల్లో 20వేల మల్టీ బ్రాండ్‌ రీటైల్‌ ఔట్‌లెట్లను

150 నగరాల్లో 20వేల మల్టీ బ్రాండ్‌ రీటైల్‌ ఔట్‌లెట్లను

రియల్‌ మి దేశంలో 150 నగరాల్లో 20వేల మల్టీ బ్రాండ్‌ రీటైల్‌ ఔట్‌లెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే ఈ ఏడాది కనీసం 15 మిలియన్ హ్యాండ్ సెట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రియల్‌ మి ఇండియా సీఈవో మాధవ్‌ సేథ్‌ ప్రకటించారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Smartphone bosses fight it out on social media in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X