రెండు ప్రాణాలను తీసిన సెల్ ఫోన్ చార్జర్

By Anil
|

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు అనేవి కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు ఉంటుంది . సోషల్ మీడియా వచ్చిన తరువాత అయితే ఇవి మరీ ఊపందుకున్నాయి. పొద్దున లేస్తే వాట్సప్ , ఫేస్ బుక్, ట్విట్టర్ వీటితోనే టైం పాస్ చేస్తున్నారు. టైంపాస్ వరకు బాగానే ఉంది కాని ఫోన్ ఛార్జింగ్ అనేది చాలా సమస్యగా మారిన విషయం అందరూ గమనించే ఉంటారు. అదీగాక ఫోన్లు ఛార్జింగ్ పెట్టగానే పేలిపోతున్నాయి.ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది సెల్ ఫోన్ చార్జర్ పేలి రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి..... పూర్తి వివరాల్లోకి వెళ్తే

 

తాంబరం  కు చెందిన...

తాంబరం కు చెందిన...

చెన్నై సిటీ లో ఉన్న తాంబరం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.హబీబ్ మహమ్మద్ (90) మరియు వారి కూతురు ముహరూమీష(60) ఘటన లో మృతి చెందారు . వారు పండ్ల వ్యాపారం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తు ఉండేవారు.

ఆ రాత్రి ఎం జరిగిందంటే.....

ఆ రాత్రి ఎం జరిగిందంటే.....

వ్యాపారం ముగించుకొని వచ్చిన తండ్రి కూతురు రాత్రి నిద్రపోయేటప్పుడు సెల్ ఫోన్ ను గోడకి ఉన్న చార్జర్ సాకెట్ కి ఛార్జింగ్ పెట్టి నిద్రపోయారు.యాదృచ్ఛికంగా, రాత్రిపూట దోమలను దూరంగా ఉంచడానికి వారు ఒక దోమల కాయిల్ను కూడా వెలిగించారు. అయితే అందరూ దోమలు కాయిల్ వల్ల చనిపోయారు అనుకున్నారు, కానీసెల్ ఫోన్ చార్జర్ పేలి ప్రాణాలు పోగొట్టుకున్నారని రిపోర్ట్ ద్వారా తెలిసింది.

హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాక...
 

హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాక...

సమీపంలోని కుటుంబ సభ్యులు అప్రమత్తమై హాస్పిటల్ కి తీసుకొని వెళ్లగా తండ్రి హబీబ్ మహమ్మద్ (90) ప్రొద్దునే మృతి చెందాడు. అయితే కూతురు ముహరూమీష(60) మాత్రం పోలీసులకు జరిగిందంతా చెప్పక తుది శ్వాస విడిచారు.

పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు:

పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు:

తాంబరం పోలీసు స్టేషన్ లో స్మార్ట్ ఫోన్ ఛార్జర్ పేలడంతో ఈ అగ్ని ప్రమాదం ఏర్పడింది అని రిపోర్ట్ నమోదు అయింది.ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇలాంటి ఘటనే మలేషియా లో ఇంకొకటి జరిగింది....

ఇలాంటి ఘటనే మలేషియా లో ఇంకొకటి జరిగింది....

క్రెడిల్ ఫండ్ CEO నజీరిన్ హసన్ తన ఇంట్లో ఉన్న చార్జర్ పేలి మరణించాడు.హసన్ BlackBerry మరియు Huawei స్మార్ట్ ఫోన్లను ఉపయోగించేవాడు. అయితే రాత్రి నిద్రపోయే ముందు తన రెండు స్మార్ట్ ఫోన్లను ఛార్జింగ్ పెట్టి నిద్రపోయాడు . అయితే ఏ ఫోన్ చార్జర్ పేలిందో ఇప్పటివరకు స్పష్టత లేదు. ఫోన్‌ పేలిన తర్వాత రూములో అలుముకున్న దట్టమైన పొగవల్ల ఊపిరాడక కొంత సమయానికే చనిపోయారని రిపోర్ట్ లో తెలిసింది.

Best Mobiles in India

English summary
Smartphone charger explodes; kills 2 in Chennai.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X