చైనా నష్టం ...మనకు లాభం! 24 స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు ఇండియా వైపే !

By Maheswara
|

చైనా నుండి దూరమయ్యే వ్యాపారాలను ఆకర్షించే క్రమంలో భారతదేశం యొక్క తాజా ప్రోత్సాహకాలు పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కో నుండి ఆపిల్ ఇంక్ యొక్క అసెంబ్లీ భాగస్వాములు మరియు కొన్ని స్మార్ట్ ఫోన్ తయారు కంపెనీ లు కూడా భారత దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం
 

నరేంద్ర మోడీ ప్రభుత్వం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సంవత్సరం మార్చిలో ఎలక్ట్రానిక్స్ తయారీదారులను - వచ్చే ఐదేళ్ళలో వారి పెరుగుతున్న అమ్మకాల్లో 4% -6% చెల్లింపుకు అర్హమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది.ఈ నిర్ణయం ఫలితంగా మన దేశంలో మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీలను స్థాపించడానికి సుమారు 24 కంపెనీలు 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్టు అందిన సమాచారం.

శామ్‌సంగ్‌తో పాటు,

శామ్‌సంగ్‌తో పాటు,

శామ్‌సంగ్‌తో పాటు, ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ కార్ప్ మరియు పెగాట్రాన్ కార్ప్ అని పిలువబడే హన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కో. లు పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ విధమైన ప్రోత్సాహకాలు స్మార్ట్ఫోన్ ల రంగానికే కాక వైద్య మరియు ఔషదాల తయారీ లో కూడా విస్తరించింది.

Also Read:Jio బంపర్ ఆఫర్!!! ఉచితంగా 5నెలల డేటాAlso Read:Jio బంపర్ ఆఫర్!!! ఉచితంగా 5నెలల డేటా

యు.ఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు

యు.ఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు

యు.ఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు మరియు కరోనావైరస్ వ్యాప్తి కారణంగా వ్యాపార సరఫరా గొలుసులను విస్తృతం చేయడానికి కంపెనీలు చురుకుగా చూస్తున్నప్పటికీ. సులభంగా వ్యాపారాలు ను ప్రారంభిచడానికి మన దేశం చౌకగా ఉన్నప్పటికీ ఇది భారతదేశానికి పెద్దగా అనుకూలించలేదు. స్టాండర్డ్ చార్టర్డ్ పిఎల్‌సి ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం వియత్నాం అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా ఉంది, తరువాత కంబోడియా, మయన్మార్, బంగ్లాదేశ్ మరియు థాయిలాండ్ ఉన్నాయి.

ఒక మిలియన్ ఉద్యోగాలు
 

ఒక మిలియన్ ఉద్యోగాలు

ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం మాత్రమే వచ్చే పెట్టుబడులతో ,రానున్న ఐదేళ్ళలో 153 బిలియన్ డాలర్ల విలువైన తయారీ వస్తువుల మార్కెట్ దారితీస్తుందని, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఒక మిలియన్ ఉద్యోగాలను సృష్టించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది ఐదేళ్ళలో 55 బిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడిని భారతదేశ ఆర్థిక ఉత్పత్తికి 0.5% ను పెంచుతుంది. ఇది ఐదేళ్ళలో ప్రపంచ స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిలో అదనంగా 10% భారతదేశానికి మార్చగలదు, అందులో ఎక్కువ భాగం చైనా నుండి తరలిపోయేవే.

మేక్ ఇన్ ఇండియా

మేక్ ఇన్ ఇండియా

‘మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా ఆర్థిక వ్యవస్థలో తయారీ పరిశ్రమల వాటాను ప్రస్తుతమున్న 15% నుండి 25% కి పెంచాలనే మోడీ లక్ష్యాన్ని ఈ పెట్టుబడుల ద్వారా సాధించవచ్చు. మోడీ ప్రభుత్వం ఇప్పటికే కంపెనీలపై ఉన్న పన్నులను ఆసియాలోనే అత్యల్ప స్థాయికి తగ్గించింది. వీటితో మరికొన్నిరంగాలకు చెందిన కంపెనీలు ఇండియా బాట పట్టే అవకాశం ఉంది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Smartphone Companies Leaving China And Plans To Setup Factories In India.Read The Details. 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X