స్మార్ట్‌ఫోన్ సిగ్నల్స్‌ను నిరోధించే కొత్త దుస్తు

Posted By:

స్మార్ట్‌ఫోన్ సిగ్నల్స్‌ను నిరోధించే కొత్త దుస్తు

స్మార్ట్‌ఫోన్ సిగ్నల్స్‌ను బ్లాక్‌చేసే సరికొత్త దుస్తును జపాన్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ కునిహైకో మరినాగా డిజైన్ చేసారు. ఈ సరికొత్త దుస్తు పేరు ‘ఫోకస్'. ఈ లైనప్ నుంచి రూపకల్పన చేయబడిన దుస్తులు స్మార్ట్‌ఫోన్‌కు అందే రేడియో సిగ్నల్స్‌ను పూర్తిగా బ్లాక్ చేస్తాయి. ఈ దుస్తును దరించటం ద్వారా స్మార్ట్‌‌ఫోన్ యూజర్లు అనవసరమైన రేడియోషన్‌ల నుంచి విముక్తి పొందవచ్చని సదరు డిజైనింగ్ సంస్థ పేర్కొంది.

మీ దుస్తులు భవిష్యత్‌లో వాటంతటకవే శుభ్రపరుచుకోనున్నాయ్! అవును మీరు వింటున్నది నిజమే. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన పలువురు నిపుణుల బృందం తమ క్రియేటివ్ మైండ్స్‌తో సరికొత్త ఆవిష్కరణను విజయవంతం చేసారు. ఈ బృందం డిజైన్ చేసిన సిలిక్ షర్ట్ దానంతటకదే శుభ్రపరుచుకునే తత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ దుస్తు హైడ్రోఫోబిక్ నానోటెక్నాలజీని కలిగి ఉండటం చేత ద్రవాలు ఇంకా ఇతర పదార్థాలు చొక్కా పై నిలిచే అవకాశం ఉండదు. దీంతో ఈ చొక్కా ఎప్పటికప్పుడు కొత్తదిలానే అనిపిస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అమెరికాకు చెందిన ‘వూల్ అండ్ ప్రిన్స్'(Wool&Prince) కంపెనీ ఓ సరికొత్త చొక్కాను రూపొందించింది. దీన్ని 100 రోజులైనా ఉతకకుండా వేసుకోవచ్చట. దీని నుంచి దుర్వాసన రాదట. ఉన్నితో ప్రత్యేకంగా రూపొందించిన ఈ చొక్కాకు మురికి, దుమ్ము అండదట. మొదటి రోజు  వేసుకున్నప్పుడు ఏలా ఉందో.. 100వ రోజు కూడా అలానే ఉంటుందట. దీన్ని ఇప్పటికే ఆ సంస్థ వ్యవస్థాపకుడు మాక్ బిషప్ 100 రోజుల పాటు ధరించి పరిశీలించారు కూడా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot