ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వృద్ధి మీద ఓ లుక్ వేయండి!!!
యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా యొక్క మొత్తం జనాభా కంటే ఇండియాలో మొబైల్ ఫోన్లను వినియోగించే వారి సంఖ్య అధికంగా ఉంది. స్మార్ట్ఫోన్ కంపెనీలకు మార్కెటింగ్ కోసం ఎక్కువ మంది మొబైల్ వినియోగదారులను కలిగి ఉన్న మరియు అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రదేశాలలో భారతదేశం ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 2022 నాటికి సుమారు 442 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఇండియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెటింగ్ వృద్ధి రేటు
ప్రపంచవ్యాప్తంగా చైనాలో స్మార్ట్‌ఫోన్‌ల మార్కెటింగ్ అధికంగా ఉంది. తరువాత స్థానంలో రెండవ అతిపెద్ద మార్కెట్ గా భారత్ ఉంది. కేవలం 2017 సంవత్సరంలోనే భారతదేశం అంతటా సుమారు 134 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయి. ఆసియా పసిఫిక్ అంతటా జరిపిన సర్వేలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మొబైల్ వెబ్‌లో గడిపిన సగటు సమయంలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇండియాలో తమ మార్కెటింగ్ ను మరింత విస్తృతం చేసాయి. ప్రతి సంవత్సరం స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ఇండియాలో ఎక్కువ అవుతున్నందున విదేశీ అమ్మకందారులకు ఇండియా చాలా ఆకర్షణీయమైన మార్కెట్‌గా మారిపోయింది.

అంతర్జాతీయ సంస్థలు vs స్థానిక సంస్థలు
మొబైల్ ఫోన్ మార్కెట్ అనేది నిరంతరం ఒడిదుడుకులను ఎదురుకుంటున్నది. దేశంలోని స్థానిక సంస్థల నుండి బలమైన పోటీని ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సంస్థలు అధిక పోటీని తగ్గించుకోవడానికి మరియు తయారీదారులు తమ మార్కెట్ వాటాలను నిలుపుకోవటానికి కొన్ని ఇబ్బందులను పడుతూఉంటారు. చైనాకు చెందిన అమ్మకందారుల యొక్క సమిష్టి మొత్తం వాటా 2017లో 53 శాతానికి చేరుకోవడంతో చైనా సంస్థలు భారతదేశం అంతటా స్మార్ట్‌ఫోన్ విభాగంలో తమ స్థానాలను మరింత బలపరుచుకుంటున్నారు. 2018 లో ఇండియా యొక్క స్మార్ట్ఫోన్ ఎగుమతుల విషయంలో సుమారు 140 మిలియన్లకు దగ్గరగా ఉంది.

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ల సగటు వినియోగం
భారతదేశంలో దేశీయంగా తయారు చేయబడిన స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్ విలువ 2016 ఆర్థిక సంవత్సరంలో సుమారు 490 బిలియన్ యుఎస్ డాలర్లు. ఇది భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ల సగటు అమ్మకపు ధరను తగ్గించడానికి దోహదం చేసి ఉండవచ్చు. దక్షిణాసియాలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఎంతగానో ఉంది. ట్రైల్ బ్లేజింగ్ టెక్నాలజీ, అద్భుతమైన ఫీచర్స్ మరియు డిజైన్లలో కొత్త ఫీచర్లతో వస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు మధ్యతరగతి వారిని ఆకట్టుకోవడానికి ఎక్కువగా దృష్టిని సారిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు అనేవి ప్రస్తుతం మనిషి యొక్క రోజువారీ జీవితంలో అంతర్భాగంగా కొనసాగుతున్నందున సరసమైన ధర వద్ద కూడా అద్భుతమైన ఫీచర్లతో దేశీయ మరియు విదేశీ తయారీదారులు తమ ఫ్లాగ్-షిప్ ఫోన్లను అందిస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో వీటి యొక్క ప్రభావం మరింత పెరగవచ్చు అని భావిస్తున్నారు.

భారతదేశంలో షియోమి స్మార్ట్‌ఫోన్ సంస్థ మార్కెట్
షియోమి సంస్థ ఇండియాలో 2010 లో ప్రారంభమయినప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా తన హవాను కొనసాగిస్తున్నది. 2016 నుండి ఈ సంస్థ యొక్క వార్షిక ఆదాయం విపరీతంగా పెరిగింది. భారతదేశంలో మొట్టమొదటి షియోమి స్మార్ట్‌ఫోన్ జూలై 2014 లో ప్రారంభించబడింది. రెండేళ్లలోనే ఇది గణనీయమైన పెరుగుదలతో మార్కెట్ వాటాను వృద్ధి చేసుకొని దేశంలోని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ప్లేయర్‌లలో ఒకటిగా నిలిచింది. దేశం యొక్క అవసరాన్ని అర్థం చేసుకోవడం భారతదేశంలో సరఫరా గొలుసులను మార్చడం మరియు దేశీయ పంపిణీ నెట్‌వర్క్‌లో పెట్టుబడులు పెట్టడం మరియు పరిశోధన మరియు అభివృద్ధి ఈ విజయానికి కొన్ని కారణాలు.


Click it and Unblock the Notifications








