స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడితే భయంకర ఫలితాలు, తేల్చి చెప్పిన స్డడీ

Written By:

మీరు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా...అయితే దీని వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగంతో అందరూ తీరని సమస్యలను ఎదుర్కుంటున్నారని ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ రోజుల్లో చిన్నా..పెద్దా అందరూ స్మార్ట్‌ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. ఇంకా చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్‌ వినియోగం మనుషుల మధ్య మాటల్ని మాయం చేస్తోంది. అనుబంధాలను దూరం చేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ మోజులో యూజర్లు సోషల్‌ సైట్లలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారట. ఇది పెద్ద ముప్పుగా పరిణమిస్తోందని తాజా అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను న్యూరోరెగ్యులేషన్‌ జర్నల్‌ ప్రచురించింది. ఇందుకోసం సోషల్‌ మీడియాకు అడిక్ట్‌ అయిన 135మందిని ఎంచుకొని వారి మానసిక పరిస్థితిపై అధ్యాయనం చేశారు. ఇందులో భయంకరమైన విషయాలు వెలుగుచూశాయి.

స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడితే భయంకర ఫలితాలు, తేల్చి చెప్పిన స్డడీ

అవసరం కోసం కొద్ది సమయం స్మార్ట్‌ఫోన్‌పై వెచ్చించడం పెద్ద ముప్పు కాకపోవచ్చు కానీ, మరీ ఎక్కువ సమయం అదే పనిగా వాటిపై దృష్టి కేంద్రీకరించడం మానవ జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ అధ్యయనం వెల్లడించింది. వారి ఆలోచన పరిధి తగ్గడమే కాకుండా, పెయిన్‌ కిల్లర్‌కు బానిసగా మారడంతో సమానమని తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా వినియోగించేవారిలో ఆత్రుత, ఒంటరితనం, ఒత్తిడి పెరుగుతుందని.. ఇది దీర్ఘకాలంలో మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని రిపోర్ట్‌ చేసింది. ఒక పనిచేసేటప్పుడు మానవ మెదడులోని ఒక భాగం యాక్టివ్‌గానూ , మరోభాగం విశ్రాంతి తీసుకుంటుందన్న విషయం తెలిసిందే.

ఫస్ట్ టైం డ్యూయెల్ కెమెరాతో గెలాక్సీ జె7 Duo,బడ్జెట్ ధరతో నేటి నుంచి అమ్మకాలు

కానీ చాలామంది వేరొక పనిచేస్తూ కూడా స్మార్ట్‌ఫోన్‌లు వాడటం మెదడును ఒత్తిడికి గురిచేస్తుంది. సహజ సిద్ధంగా ఉన్న వ్యవహారశైలితోపాటు, చాలా విషయాల్లో వారికి తెలియకుండానే మార్పులు చోటుచేసుకుంటాయి. స్మార్ట్‌ఫోన్‌లో నిరంతరం నెట్‌ అన్‌లో ఉండటం వల్ల రేడియేషన్‌ సమస్యలు కూడా ఎదురవుతాయని ఈ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

English summary
The study also found that those who used their phones the most reported higher levels of feeling isolated, lonely, depressed and anxious.More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot