బుల్లెట్ ను ఆపి మనిషి ప్రాణాలు కాపాడిన స్మార్ట్ ఫోన్ ! వివరాలు తెలుసుకోండి.

By Maheswara
|

మనలో చాలా మందికి మన మొబైల్ ఫోన్‌లు కొన్ని అత్యవసర పరిస్థితులలో మనల్ని రక్షించే విధంగా కూడా ఉపయోగ పడుతుంటాయి. సాధారణంగా స్మార్ట్ఫోన్ వాడకాన్ని తగ్గించమని అందరు సలహా ఇస్తుంటారు, కొంతమానికి ఎల్లప్పుడూ చేతిలో ఉండాల్సిందే. మన జీవితంలో కనీసం ఒక్కసారైనా స్క్రీన్ సమయాన్ని తగ్గించమని చెప్పిన సలహాలు వైన్ ఉంటాము. కానీ, బ్రెజిల్‌లో ఒక పౌరుడి జీవితాన్ని ఒక స్మార్ట్ ఫోన్ కాపాడింది . ఎలాగో తెలుసుకుందాం రండి.

 

మోటోరోలా స్మార్ట్‌ఫోన్

ఇటీవల బ్రెజిల్‌లో సాయుధ దోపిడీ జరిగింది అందులో బాడితుడు అయిన వ్యక్తి ఈ సంఘటనలో అతను కాల్చబడ్డాడు, కానీ ఆ బులెట్ ను అతని గుండె కు తగలకుండా ఐదేళ్ల మోటోరోలా స్మార్ట్‌ఫోన్ ఆపివేసింది. ఈ సంఘటనలో చాలావరకు దెబ్బను స్మార్ట్ఫోన్ తీసుకోవడం కారణంగా, ఆ వ్యక్తిని బుల్లెట్ ప్రమాదకరమైన స్థితిలో గాయపరచలేక పోయింది. ఈ సంఘటనలో మరో చక్కని ఆసక్తికరమైన  విషయం ఏమిటంటే, అతనిని రక్షించిన మోటోరోలా G5 ఫోన్‌లో ఇన్క్రెడిబుల్ హల్క్ ఫోన్ కేసు కూడా ఉంది.ప్రముఖ వార్త పత్రికల కథనాల ప్రకారం, అక్టోబర్ 7 న దేశంలోని ఈశాన్యంలోని పెట్రోలినా మునిసిపాలిటీలోని గ్రామీణ ప్రాంతంలో ఈ దోపిడీకి ప్రయత్నించారు. బాధితునికి వైద్యంకోసం హాజరవుతున్న డాక్టర్లలో ఒకరైన పెడ్రో కార్వాల్హో ఈ సంఘటనకు సంబందించిన వివరాలు మరియు ఆ ఫోన్ యొక్క చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సాయుధ దోపిడీలలో కాల్పులు తరచుగా విషాద మరణాలకు మరియు కోలుకోలేని నష్టానికి దారితీస్తుండగా, ఈ సందర్భంలో, బుల్లెట్ ప్రభావాన్ని ఎక్కువగా గ్రహించేది ఫోన్ అని వైద్యులు చూశారు.

పగిలిపోయిన స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌
 

పగిలిపోయిన స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌

పెడ్రో కార్వాల్హో షేర్ చేసిన చిత్రాలలో, ఫోన్ బాగా పగిలిపోయిన స్క్రీన్‌తో స్మార్ట్ ఫోన్ ను  చూడవచ్చు. అయితే, హల్క్ ఫోన్ కవర్ కొత్తది వలె కనిపిస్తుంది. చిత్రాలను పంచుకుంటూ, "దోపిడీకి గురైన తర్వాత బాధితుడిని ER లో చేర్చారు, మరియు బుల్లెట్ అతని సెల్ ఫోన్‌లో ముగిసింది ..." అని అనువదించే ఒక గమనికను డాక్టర్ వ్రాశారు, ఈ ట్వీట్ సోషల్ మీడియాలో 6,355 లైకులు మరియు వందల రీట్వీట్స్ తో వైరల్ అయింది. సంఘటన లో గాయపడిన ఆ వ్యక్తి ఎవరనేది వెల్లడికాకపోయినా, డాక్టర్ అతను బాగానే ఉన్నాడని చెప్పి ఇంటికి పంపించాడు. రోగి గురించి చాలా మంది అడుగుతున్నారని మిస్టర్ కార్వాల్హో ఒక ట్వీట్‌లో ధృవీకరించారు. అతనికి "చిన్న గాయమైంది" అని డాక్టర్ చెప్పాడు మరియు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.

ఒక స్మార్ట్ ఫోన్, ఒక వ్యక్తి ని బుల్లెట్ నుండి రక్షించడం ఇదే మొదటిసారి కాదు.

ఒక స్మార్ట్ ఫోన్, ఒక వ్యక్తి ని బుల్లెట్ నుండి రక్షించడం ఇదే మొదటిసారి కాదు.

ఒక స్మార్ట్ ఫోన్, ఒక వ్యక్తి ని బుల్లెట్ నుండి రక్షించడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని సంవత్సరాల క్రితం, తైవాన్‌లో ఒక వ్యక్తిని తన శామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3 స్మార్ట్‌ఫోన్ రక్షించింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్క్రీన్ కారణంగా తుపాకీ కాల్పుల్లో బుల్లెట్ తగలకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ వ్యక్తి చేతిలో కాల్పులు జరిగాయి కానీ బుల్లెట్ అతని చొక్కా జేబులో ఉన్న ఫోన్ ద్వారా నిరోధించబడింది, అది అతని ఛాతీకి రాకుండా నిరోధించింది. ఆ వ్యక్తి ప్రమాదం నుండి బయటపడ్డాడని నివేదించబడినప్పటికీ , స్మార్ట్ ఫోన్ మాత్రం రిపేర్ చేయలేని విధంగా దెబ్బతినింది అని గమనించ వచ్చు. ఇంకా,ప్యారిస్‌లో జరిగిన ఉగ్రవాదులు దాడిలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. అయితే, ఈ మారణహోమం నుంచి ఓ వ్యక్తి తృటిలో తప్పించుకోగలిగాడు.అతని చేతిలోనే ఫోన్  ప్రాణాలను కాపాడటం విశేషం. ఓ ఫ్రెంచ్ వెబ్ సైట్ వెల్లడించిన వివరాల మేరకు... సిల్వెస్టర్ అనేక వ్యక్తి దాడికి కొద్ది నిమిషాల ముందు ఫుట్‌బాల్ స్టేడియం బయట ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇదే సమయంలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.ఆ సమయంలో అతని చేతిలో ఫోన్ లేకపోతే ఆ పొదునైన బుల్లెట్ నేరుగా అతని శరీరంలోకి ప్రవేశించి ఉండేది. ఏదేమైనప్పటికి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 6 ఎడ్జ్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది.

Best Mobiles in India

English summary
Smartphone Saves Man's Life By Stopping Bullet In An Armed Robbery Incident.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X