స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ల పై కుప్పలు కుప్పలుగా క్రిములు

స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్‌లను శుభ్రం చేసే అంశానికి సంబంధించి ఇంగ్లాడ్‌కు చెందిన ప్రముఖ గాడ్జెట్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ‘ఇన్సూరెన్స్‌టుగో’ ఓ ప్రత్యేకమైన స్టడీని నిర్వహించింది.

By GizBot Bureau
|

స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లను శుభ్రం చేసే అంశానికి సంబంధించి ఇంగ్లాడ్‌కు చెందిన ప్రముఖ గాడ్జెట్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ 'ఇన్సూరెన్స్‌టుగో’ ఓ ప్రత్యేకమైన స్టడీని నిర్వహించింది. ఈ పరిశోధనలో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్టడీ చెబుతోన్న దాని ప్రకారం స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ల పై ప్రమాదకర స్థాయిలో క్రిములు పేరుకుపోతున్నాయి.

మూడు రెట్లు అధికమైన క్రిములు...

మూడు రెట్లు అధికమైన క్రిములు...

టాయిలెట్ సీట్ల పై ఉండే క్రిములతో పోలిస్తే మూడు రెట్లు అధికమైన క్రిములు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ల పై తిష్ట వేస్తున్నాయట. ‘ఇన్సూరెన్స్‌టుగో' సర్వే చెబుతోన్న దాని ప్రకారం ప్రతి వంద స్మార్ట్‌ఫోన్ యూజర్లలో 35 శాతం మంది యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లను ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. దీంతో అవి క్రిములకు ఆవాస కేంద్రాలుగా మారిపోతున్నాయట.

 

 

చర్మ సంబంధిత వ్యాధులు..

చర్మ సంబంధిత వ్యాధులు..

ఈ కారణంగా చర్మ సంబంధిత వ్యాధులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయట. స్టీడి నిమిత్తం తాము ఎంపిక చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌లలో 35 శాతానికి పైగా స్మార్ట్‌ఫోన్‌ల పై టాయిలెట్ సీట్ల పై ఉండే క్రిములతో పోలిస్తే మూడు రెట్లు అధికమైన క్రిములు ఉన్నాయని రిసెర్చర్లు తెలిపారు. ప్రతి 20 ఫోన్‌లలో ఒక్క ఫోన్‌ను మాత్రమే ఆరు నెలలకు ఒకసారి శుభ్రం చేస్తున్నట్లు తేలిందని ఈ స్టడీ చెబుతోంది.

ఏరోబిక్ బాక్టీరియా ఇంకా ఈస్ట్‌లను అంచనా వేసేందుకు..
 

ఏరోబిక్ బాక్టీరియా ఇంకా ఈస్ట్‌లను అంచనా వేసేందుకు..

ఈ స్టడీకిగానూ రీసెర్చర్లు ఐఫోన్ 6, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8 ఇంకా గూగుల్ పిక్సల్ ఫోన్‌లను ఎంచుకున్నారు. ఈ ఫోన్‌లకు సంబంధించిన స్ర్కీన్‌ల పై పేరుకుపోయి ఉన్న ఏరోబిక్ బాక్టీరియా ఇంకా ఈస్ట్ వివరాలను అంచనావేసేందుకు పలు పరీక్షలు నిర్వించారు. ఈ పరీక్షల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 

 

ఒక్కో స్మార్ట్‌ఫోన్ స్క్రీన్  పై 84.9 యూనిట్ల క్రిములు..

ఒక్కో స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ పై 84.9 యూనిట్ల క్రిములు..

ఈ మూడు ఫోన్‌లకు సంబంధించిన స్ర్కీన్స్ పై ప్రతి చదరపు సెంటీమీటర్ ఏరియాకుగాను 254.9 కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ ఏర్పడ్డాయని పరిశోధనలో తేలిపింది. ఈ లెక్క ప్రకారం ఒక్కో స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్ పై 84.9 యూనిట్ల క్రిములు, కాలనీలను ఏర్పాటు చేసుకుని ఉంటున్నాయి.

 

 

Best Mobiles in India

English summary
Smartphone screens found to be more than three times dirtier than a toilet seat.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X