గ్లోబల్ 2019 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈసారి లాభపడింది ఎవరు? నష్టపోయింది ఎవరు?

|

2019 మూడవ త్రైమాసికంలో గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ దాదాపు ఫ్లాట్‌గా ఉంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 379.8 మిలియన్ యూనిట్లతో వున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఈ సంవత్సరం దాని యొక్క మొత్తం ఎగుమతులు 380 మిలియన్ యూనిట్లకు తాకింది. గతంతో పోలిస్తే ఈసారి స్వల్పంగా మాత్రమే వృద్ధిని పొందాయి.

మార్కెట్ షేర్‌

స్మార్ట్‌ఫోన్ మార్కెట్ స్వల్పంగా అభివృద్ధి చెందిన కూడా కొన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు వాటి మార్కెట్ షేర్‌లలో మాత్రం నష్టాన్ని చవిచూసాయి. ప్రస్తుతం మీరు వాడుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఎంత మాత్రం వృద్ధిని సాధించిందో అని ఆలోచిస్తున్నారా? Q3 కౌంటర్ పాయింట్ యొక్క గ్లోబల్ స్మార్ట్ఫోన్ షిప్మెంట్ నివేదిక ప్రకారం ప్రపంచంలోని 10 అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఈ జాబితాలో అత్యధిక లాభాలు పొందిన వారు మరియు నష్టాలు పొందిన వారి గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రెడ్‌మి 8 ఫ్లాష్ సేల్స్... అందుబాటులో గొప్ప ఆఫర్స్రెడ్‌మి 8 ఫ్లాష్ సేల్స్... అందుబాటులో గొప్ప ఆఫర్స్

1. శామ్సంగ్

1. శామ్సంగ్

శామ్సంగ్ సంస్థ తన వృద్ధి రేటును ఈ సంవత్సరం కూడా 8.4% వద్ద కొనసాగించింది. శామ్సంగ్ నోట్ 10 మరియు గెలాక్సీ A సిరీస్ ఫోన్ల సేల్స్ బలమైన ఊపును అందుకోవడంతో గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఐదవ వంతును కంపెనీ స్వాధీనం చేసుకుంది. విభిన్న ఉత్పత్తుల మిశ్రమ అమ్మకం ద్వారా కూడా సంస్థ లాభాలను పెంచడానికి సహాయపడింది.

 

Infinix Hot 8 Price Cut: RS.2000 తగ్గింపుతో ఇన్ఫినిక్స్ హాట్ 8 సేల్స్... త్వరపడండిInfinix Hot 8 Price Cut: RS.2000 తగ్గింపుతో ఇన్ఫినిక్స్ హాట్ 8 సేల్స్... త్వరపడండి

2. హువాయి

2. హువాయి

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హువాయి సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం 28.5% వృద్ధి రేటుతో చాలా బాగా మెరుగుపడింది. చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రికార్డు స్థాయిలో 40% మార్కెట్ వాటాను హువాయి కంపెనీ కైవసం చేసుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యుఎస్ లో హువాయి యొక్క ఇబ్బందులు చైనాలో సహాయపడ్డాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది హువాయి సంస్థకు అనుకూలంగా జాతీయవాదం యొక్క ఉప్పెనను సృష్టించింది.

 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో SMS ద్వారా మీ లొకేషన్ ను షేర్ చేయడం ఎలా?ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో SMS ద్వారా మీ లొకేషన్ ను షేర్ చేయడం ఎలా?

3. ఆపిల్

3. ఆపిల్

ఆపిల్ ఐఫోన్ యొక్క ఎగుమతులు ఈ సంవత్సరం 4% తగ్గాయి. దీని ఫలితంగా ఆపిల్ యొక్క ఆదాయం 2019 సంవత్సరంలో 11% పడిపోయింది. అయితే మూడవ త్రైమాసికం యొక్క టెయిల్ ఎండ్ సమయంలో ప్రారంభించిన కొత్త ఫోన్‌లయిన ఐఫోన్ 11 సిరీస్ అమ్మకాలు ఎక్కువ ఊపు అందుకోవడంతో ఆపిల్‌కు కాస్త ఊరటను ఇచ్చాయి. యుఎస్‌లో ప్రారంభించిన ప్రీ-ఆర్డర్‌లు మరియు అమ్మకాల మొదటి వారంలో వినియోగదారులు ఐఫోన్ ప్రో మాక్స్ మరియు ఐఫోన్ ప్రోలను ఎక్కువగా కొనుగోలు చేశారు. కాని ఐఫోన్ 11 అమ్మకాలు అతి తక్కువ సమయంలో అధికంగా పెరిగాయి. కానీ ఈ సంవత్సరం ఆపిల్ సంస్థ యొక్క మార్కెట్ మాత్రం తగ్గింది.

 

ఐఫోన్ నుండి Wi-Fi పాస్‌వర్డ్‌ను సులువుగా ఎలా షేర్ చేయవచ్చుఐఫోన్ నుండి Wi-Fi పాస్‌వర్డ్‌ను సులువుగా ఎలా షేర్ చేయవచ్చు

4. ఒప్పో

4. ఒప్పో

BBK యాజమాన్యంలోని ఒప్పో బ్రాండ్ యొక్క స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం 4 వ స్థానంలో ఉంది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఎగుమతులు మరియు మార్కెట్ వాటా స్వల్ప మొత్తంలో తగ్గుదలను చూసాయి. దీని యొక్క ఎగుమతులు 33.9 మిలియన్ల నుండి 32.7 మిలియన్లకు పడిపోగా ప్రపంచ మార్కెట్ షేర్ సంవత్సరానికి 8.9 % నుండి 8.6% కి పడిపోయింది.

 

ఆన్‌లైన్‌ ద్వారా రైల్వే క్రిమినల్ ఫిర్యాదులను ఎలా నమోదు చేయవచ్చుఆన్‌లైన్‌ ద్వారా రైల్వే క్రిమినల్ ఫిర్యాదులను ఎలా నమోదు చేయవచ్చు

5. షియోమి

5. షియోమి

ప్రముఖ చైనా సంస్థ షియోమి ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో ఎగుమతులు 31.7 మిలియన్లకు తగ్గింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో దీని యొక్క ఎగుమతులు 33.3 మిలియన్లు. చైనాలో హువాయి సంస్థ సాధించిన లాభాల కారణంగా ఈ సంస్థను తన స్వదేశంలో దెబ్బతీసినట్లు కనిపిస్తోంది. అయితే ఈ సంస్థ భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో న్యూమెరో యునో టైటిల్‌ను నిలుపుకుంది.

 

ios13లో యాప్ లను డెలిట్ చేయడం ఎలా?ios13లో యాప్ లను డెలిట్ చేయడం ఎలా?

6. వివో

6. వివో

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ సంస్థ వివో కూడా దాని ఎగుమతులు మరియు మార్కెట్ వాటా రెండింటిలోను స్వల్పంగా క్షీణించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో (క్యూ 3-2018) కంపెనీ ఎగుమతులు 30.5 మిలియన్లు ఉండగా ఈ సంవత్సరం మాత్రం వీటి ఎగుమతులు 29.5 మిలియన్లకు పడిపోయాయి. అలాగే కంపెనీ యొక్క మార్కెట్ వాటా సంవత్సరానికి 8% నుండి 7.8% కి పడిపోయింది.

 

అమెజాన్ ఫైర్ టీవీలో ఆపిల్ టీవీ యాప్‌అమెజాన్ ఫైర్ టీవీలో ఆపిల్ టీవీ యాప్‌

7. రియల్ మి

7. రియల్ మి

ఒప్పో సంస్థ యొక్క సబ్-బ్రాండ్ రియల్ మి వరుసగా రెండవ సంవత్సరం కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా నిలిచింది. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో కూడా ఈ కంపెనీ తన స్థానాన్ని మెరుగుపరచుకున్నది. భారతదేశంలో బలమైన అమ్మకాలు మరియు విదేశాలలో కూడా తన అమ్మకాలను విస్తరించడం ద్వారా వీటి ఎగుమతులు పెంచడానికి సహాయపడ్డాయి. భారతదేశంలో టాప్ 5 బ్రాండ్లలో రియల్ మి కూడా వరుసగా నాలుగో స్థానంలో నిలిచింది.

 

స్నాప్‌చాట్‌లో స్పాటిఫై సాంగ్స్‌ని షేర్ చేయడం ఎలా?స్నాప్‌చాట్‌లో స్పాటిఫై సాంగ్స్‌ని షేర్ చేయడం ఎలా?

8. మోటరోలా

8. మోటరోలా

లెనోవా యాజమాన్యంలోని మోటరోలా సంస్థ యొక్క ప్రపంచ ఎగుమతులు గత త్రైమాసికంలో 11.5 మిలియన్లు ఉండగా ఈ సంవత్సరం లో దాని ఎగుమతులు10 మిలియన్లకు పడిపోయాయి. సంస్థ తన కొత్త రేజర్ సిరీస్ ఫోన్‌లతో మార్కెట్లో ‘పునరాగమనం' పై దృష్టి సారించింది.

 

ట్రాఫిక్ జరిమానాలను ఆన్‌లైన్‌లో చెల్లించడం ఎలా?ట్రాఫిక్ జరిమానాలను ఆన్‌లైన్‌లో చెల్లించడం ఎలా?

9. LG

9. LG

దక్షిణ కొరియాకు చెందిన LG సంస్థ తన ప్రపంచ ఎగుమతుల విషయంలో బాగా పడిపోయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ యొక్క ఎగుమతులు పోలిస్తే 10.5 మిలియన్ల నుండి 7.7 మిలియన్లకు పడిపోయాయి.

10. టెక్నో

10. టెక్నో

10 వ స్థానంలో చైనాకు చెందిన టెక్నో సంస్థ ఉంది. ఎగుమతుల్లో స్వల్ప పెరుగుదలతో పాటు కంపెనీ యొక్క మార్కెట్ వాటా కూడా వృద్ధిని చవిచూసింది. ఈ త్రైమాసికంలో దీని ఎగుమతులు 5 మిలియన్లకు చేరుకున్నాయి. గతంలో దీని ఎగుమతులు 4.6 మిలియన్లుగా ఉన్నాయి. అలాగే ప్రపంచ మార్కెట్ వాటా కూడా కొద్దిగా పెరిగి 1.2% నుండి 1.3% కి చేరుకుంది.

Best Mobiles in India

English summary
Smartphone Total Shipments Touched 380 Million Units: Know Which Handsets Are Winner And Losers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X