Smartphones & ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ఉచిత వారంటీని పెంచిన సంస్థలు ఇవే...

|

కరోనావైరస్ వ్యాధి వ్యాప్తి రోజు రోజుకి పెరుగుతున్నందున్న ఇండియాలో లాక్డౌన్ ను మరో రెండు వారాల పాటు పొడిగించారు. ప్రస్తుతం కొసాగుతున్న లాక్ డౌన్ కారణంగా అనేక ఎలక్ట్రానిక్ మరియు మొబైల్ బ్రాండ్లు తమ వినియోగదారులకు సహాయపడటానికి వారి ఉత్పత్తుల మీద గల వారంటీని మరికొంత కాలం పాటు పొడిగిస్తున్నాయి.

వారంటీ

కంపెనీలు సాధారణంగా పొడిగించిన వారంటీని అందించడానికి అదనపు మొత్తాన్ని వసూలు చేస్తాయి. అయితే ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎదురుకొంటున్న ఉహించని సంక్షోభం కారణంగా ఈ బ్రాండ్లు తమ పరికరాలు మరియు ఉపకరణాలపై వారంటీ వ్యవధిని ఉచితంగా పొడిగించాయి.

 

 

Tata Sky, Dish TV అందిస్తున్న లోన్ ఆఫర్స్ & వివిధ రకాల ఉచిత ఆఫర్స్...Tata Sky, Dish TV అందిస్తున్న లోన్ ఆఫర్స్ & వివిధ రకాల ఉచిత ఆఫర్స్...

శామ్సంగ్

శామ్సంగ్

స్మార్ట్ ఫోన్లు మరియు వాటి యొక్క ఉపకారణాలతో పాటుగా మిగిలిన అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద వారంటీని పొడిగించిన సంస్థలలో అందరికంటే ముందున్నది శామ్సంగ్ సంస్థ. శామ్సంగ్ యొక్క అన్ని పరికరాలపై గల వారంటీని మే 31, 2020 వరకు పొడిగించింది. మార్చి 20 మరియు ఏప్రిల్ 30, 2020 మధ్య ఈ లాక్డౌన్ వ్యవధిలో వారంటీ గడువు ముగిసిన అన్ని ఉత్పత్తులకు ఇది చెల్లుతుంది.

 

 

 

JioMeet వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్.. జూమ్, గూగుల్ మీట్ లకు పోటీగా...JioMeet వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్.. జూమ్, గూగుల్ మీట్ లకు పోటీగా...

రియల్‌మి

రియల్‌మి

ప్రస్తుతం మీరు రియల్‌మి బ్రాండ్ యొక్క ఫోన్‌ను వాడుతూ ఉంటే కనుక దానిపై గల వారంటీ మార్చి 20 మరియు ఏప్రిల్ 30, 2020 మధ్య ముగుస్తున్నట్లు అయితే ఆ ఫోన్ యొక్క వారంటీ ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా మే 31 వరకు స్వయంచాలకంగా పొడిగించిన వారంటీని పొందుతుంది.

ఒప్పో & వివో

ఒప్పో & వివో

ఒప్పో సంస్థ కూడా ఈ లాక్ డౌన్ సమయంలో తన బ్రాండ్ ఫోన్ల మీద మార్చి 23తో వారంటీ గడువు ముగిసిన అన్ని ఒప్పో ఫోన్ల మీద వారంటీని స్వయంచాలకంగా మే 31 వరకు పొడిగించింది. ఇది స్మార్ట్ వాచ్‌లు మరియు ఇతర ఉపకరణాలకు కూడా వర్తిస్తుంది. ఇదే వారంటీ పొడిగింపు వివో మరియు వన్ ప్లస్ సంస్థల యొక్క అన్ని స్మార్ట్ ఫోన్లు మరియు స్మార్ట్ వాచ్ ల మీద కూడా సంస్థలు అందిస్తోంది.

నోకియా

నోకియా

మార్చి 15 మరియు మే 15 మధ్య వారంటీ గడువు ముగిసిన అన్ని నోకియా ఫోన్‌లు ప్రస్తుతం స్వయంచాలకంగా 60 రోజుల వరకు పొడిగించిన వారంటీని పొందుతాయి. అంటే వీటి మీద గల వారంటీ జూన్ వరకు పొడిగించింది.

హువాయి & హానర్

హువాయి & హానర్

హువాయి మరియు హానర్ సంస్థ యొక్క అన్ని రకాల బ్రాండెడ్ పరికరాల మీద వారంటీని జూన్ 30 వరకు సంస్థ పొడిగించింది. ఈ వారంటీ మార్చి 21 మరియు జూన్ 21 మధ్య వారంటీ గడువు ముగిస్తే సంస్థ యొక్క అన్ని పరికరాలకు చెల్లుతుంది.

ఇతర సంస్థలు

ఇతర సంస్థలు

స్మార్ట్ ఫోన్లు మరియు లాప్ టాప్ ల మీద వారంటీని పొడిగించే సంస్థలలో లెనోవో మరియు మెట్రోలో వంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఇవి తమ ఫోన్ల మీద వారంటీని జూన్ 30 వరకు పొడిగించాయి. అలాగే ఇన్ఫినిక్ సంస్థ కూడా తన ఫోన్ల మీద వారంటీని మరొక 60 రోజుల పాటు పొడిగించాయి. లాప్ టాప్ మీద వారంటీ పొడిగింపు విషయానికి వస్తే అసూస్ మరియు MSI సంస్థలు తమ బ్రాండెడ్ పరికరాల మీద పొడిగింపును మరొక 70 రోజుల పాటు పొడిగించాయి.

Best Mobiles in India

English summary
Smartphones and Electronics Brands Warranty Extended : Here are The List

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X