ఈ స్మార్ట్ ఫోన్ లు... ఖచ్చితంగా 5G సపోర్ట్ చేయాల్సిందే! భారత ప్రభుత్వం వార్నింగ్.

By Maheswara
|

భారత ప్రభుత్వం యొక్క డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) నుండి ముఖ్యమైన ప్రతినిధులు, మొబైల్ ఆపరేటర్‌లు మరియు స్మార్ట్‌ఫోన్ తయారీదారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం లో ముఖ్యంగా 5G స్మార్ట్‌ఫోన్‌లతో 5G సేవలకు మారడానికి మూడు నెలల గడువు ఇచ్చారు.

 

4G ఫోన్ల తయారీకి స్వస్తి

4G ఫోన్ల తయారీకి స్వస్తి

బుధవారం సీనియర్ ప్రభుత్వ అధికారులతో జరిగిన సమావేశంలో, మొబైల్ ఫోన్ పరిశ్రమ ప్రతినిధులు రూ. 10,000 కంటే ఎక్కువ ఖరీదు చేసే 4G ఫోన్‌ల తయారీని క్రమంగా నిలిపివేస్తామని మరియు 5G టెక్నాలజీకి మారాలని హామీ ఇచ్చారు. వినియోగదారులు కూడా 5G సేవలను పొందడానికి సులభమైన పద్దతి ని అమలు చేయడం గురించి చర్చించడానికి టెలికాం క్యారియర్‌లు మరియు Apple మరియు Samsung వంటి స్మార్ట్‌ఫోన్ తయారీదారుల నుండి అగ్ర ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

750 మిలియన్ల మొబైల్ ఫోన్ వినియోగదారులు

750 మిలియన్ల మొబైల్ ఫోన్ వినియోగదారులు

భారతదేశంలో దాదాపు 750 మిలియన్ల మొబైల్ ఫోన్ వినియోగదారులు  ఉన్నారు; ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీకి చెందిన ఓ అధికారి ANIకి ఇచ్చిన సమాచారం లో ఈ వివరాలు అందించారు. 350 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు కేవలం 3G-4G అనుకూలమైన ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు, అయితే భారతదేశంలో 100 మిలియన్ల మంది చందాదారులు ఇప్పటికే 5G-రెడీ ఫోన్‌లను కలిగి ఉన్నారు. ఇకపై , రూ. 10,000 కంటే ఎక్కువ ఖరీదు చేసే 3G-4G అనుకూల ఫోన్‌ల ఉత్పత్తిని క్రమంగా నిలిపివేస్తామని స్మార్ట్‌ఫోన్ కంపెనీ ద్వారా మంత్రిత్వ శాఖకు సమాచారం అందించింది.

5g స్మార్ట్ ఫోన్లు
 

5g స్మార్ట్ ఫోన్లు

భారతదేశంలో 100 మిలియన్లకు పైగా వినియోగదారులు 5G-సామర్థ్యం గల ఫోన్‌లను కలిగి ఉన్నారు, అయితే Appleతో సహా అనేక మంది తయారీదారులు తమ ఉత్పత్తులలో ఇంకా 5G సేవను అందించడం లేదు. 5G ఫోన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు  స్మార్ట్‌ఫోన్ తయారీదారులు పరిష్కారం త్వరలోనే కనుగొంటారని ప్రకటించారు. జియోతో పోల్చితే, భారతీ ఎయిర్‌టెల్ ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్ మరియు వారణాసిలలో 5Gని విడుదల చేస్తోంది. 5G నెట్‌వర్క్‌లలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ప్రవేశపెట్టిన 5G సేవల కోసం క్లయింట్ పరికరాలను సిద్ధం చేయడం గురించిన అంశం ఈ సమావేశంలో ఎజెండా లో ముఖ్యంగా ఉంది.

సాఫ్ట్‌వేర్ FOTA అప్‌డేట్‌

సాఫ్ట్‌వేర్ FOTA అప్‌డేట్‌

అన్ని 5G హ్యాండ్‌సెట్‌ల కోసం సాఫ్ట్‌వేర్ FOTA అప్‌డేట్‌ల విస్తరణలో స్మార్ట్‌ఫోన్ తయారీదారులు మరియు టెలికాం కంపెనీల ప్రమేయం గురించి కూడా చర్చ జరిగింది. అదనంగా, భారతదేశం యొక్క 5G యొక్క విస్తరణ కోసం సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించబడింది.

5G సాఫ్ట్‌వేర్ అప్డేట్ లు

5G సాఫ్ట్‌వేర్ అప్డేట్ లు

Samsung మరియు Apple ఫోన్లకు 5G సాఫ్ట్‌వేర్ అప్డేట్ లు నవంబర్ ,డిసెంబర్ కు అందిస్తామని ఇప్పటికే ఆయా సంస్థలు పేర్కొన్నాయి.Apple Inc మరియు Samsung Electronics సంస్థలు ఈ డిసెంబర్ నాటికి భారతదేశంలో తమ 5G ఫోన్‌ల కోసం సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేస్తాయని కంపెనీలు బుధవారం తెలిపాయి. భారతీయ అధికారులు హై-స్పీడ్ నెట్‌వర్క్‌ను స్వీకరించమని మొబైల్ ఫోన్ తయారీదారులను ఇప్పటికే ఒత్తిడి చేస్తున్నారు. ఐఫోన్ 14, 13, 12 మరియు ఐఫోన్ SEతో సహా ఇటీవలి మోడల్‌లకు సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లను పుష్ చేస్తామని ఆపిల్ తెలిపింది, పరిశ్రమ వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం 5G నెట్‌వర్క్‌కు ఇంకా మద్దతు ఇవ్వడం లేదు."నెట్‌వర్క్ ధ్రువీకరణ మరియు నాణ్యత మరియు పనితీరు కోసం పరీక్షలు పూర్తయిన వెంటనే iPhone వినియోగదారులకు ఉత్తమ 5G అనుభవాన్ని అందించడానికి మేము భారతదేశంలోని మా క్యారియర్ భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాము" అని ఆపిల్ ఒక ప్రకటనలో తెలిపింది.

Best Mobiles in India

Read more about:
English summary
Smartphones Priced Above Rs.10000 Must Support 5G. Indian Government Told To Smartphone Manufacturers.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X