ఒంటరిగా వెళ్తున్న వారి స్మార్ట్ ఫోన్లు లాగేసుకుంటున్న గ్యాంగ్ ! అరెస్ట్ చేసిన పోలీసులు ..వివరాలు.
హైదరాబాద్ పోలీస్ లు నలుగురు మొబైల్ ఫోన్ దొంగలను అరెస్ట్ చేసి ఎనిమిది మంది ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు మద్యానికి బానిసై డబ్బుల కోసం ఫోన్లు లాక్కోవడం వైపు మొగ్గు చూపారు. అరెస్టయిన నిందితులు బంజారాహిల్స్‌లోని సింగడికుంటకు చెందిన ఎండీ ఖాజా పాషాఎండీ సబీల్, ఎస్కే సోహైల్, ఎం పవన్ కుమార్. ఈ నలుగురు యువకులను ముట్టడి చేసేందుకు పోలీసులు నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని ధృవీకరించారు.

జనవరి మొదటి వారంలో రాయ్‌గురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని దర్గా ప్రాంతంలోని మెహ్‌ఫిల్ హోటల్, షాగౌస్ హోటల్ సమీపంలో నిందితులు మొబైల్స్‌ను లాక్కెళ్లారు. జనవరి 24న ముగ్గురు బైక్‌పై టోలీచౌకిలోని బృందావన్ కాలనీలో కాళీ నడకన ఒంటరిగా వెళ్తున్న వారి డాగర స్మార్ట్ఫోన్లు లాగేసుకున్నారు.అనంతరం షేక్‌పేటలోని ప్రెసిడెంట్ గార్డెన్ సమీపంలో మరో ఫోన్ లాక్కుని రాత్రి 10.30 గంటల సమయంలో ఫిల్మ్ నగర్ ఆటో స్టాండ్ వద్ద ఉన్న బాటా షోరూమ్ సమీపంలో మరో బాధితుడిని గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల పాషా బైక్ కొనుగోలు చేసి రాయదుర్గంలో మొబైల్ ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. జనవరి 24న రాత్రి సింగాడి కుంట ఆటో స్టాండ్‌లో కలుసుకుని మద్యం సేవించి గోల్కొండలోని టోలీచౌకీకి వెళ్లి పాదచారుల మొబైల్ ఫోన్ లాక్కెళ్లారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లో మరో వ్యక్తి మొబైల్ ఫోన్‌ను కూడా లాక్కెళ్లారు. నిందితుడి ,ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, నేరం జరిగిన ప్రదేశం, పరిసరాల్లోని నిఘా కెమెరాల సాయంతో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.

మీ స్మార్ట్‌ఫోన్ దొంగిలించ బడినప్పుడు, మీకు మీ డేటా భద్రతా కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!!
మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి సంఘటనలు మనకు కూడా జరిగే అవకాశం ఉంది.అందుకే, ఈ విషయాలు తెలుసుకోండి ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితం లో అత్యవసర పరికరం.వ్యక్తికి సంబంచిన కీలక సమాచారం మొత్తం స్మార్ట్ ఫోన్ లో భద్రపరచడం జరుగుతుంది బ్యాంకింగ్ కి సంబందించిన సమాచారం కానీ నగదు లావాదేవీలకు సంబందించి ఇంకా ఇతర అనేక పనులు ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా జరుగుతుంది.ఇలా మన జీవితంలో కీలక పాత్రా పోషిస్తున్న స్మార్ట్ ఫోన్ ఉన్నంటుండి పోగొట్టుకుంటే ఇంకా అంతే సంగతి కొన్ని సందర్భాల్లో వీటికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.ఆండ్రాయిడ్, యాపిల్ వంటి స్మార్ట్‌ఫోన్‌లలో లేటెస్ట్ సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరచటం వల్ల కొంతలో కొంత ఉపశమనంగా మీ ఫోన్‌లకు సంబంధించి ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుంది. ఒక వేళా ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ద్వారా కూడా మీ ఫోన్ కనుగొనలేకపోతే ఈ టిప్స్ ద్వారా ఫోన్ ను రికవర్ చేసి అందులో ఉన్న డేటా ను ఎరేజ్ చేసి దాన్ని రిమోట్గా లాక్ చేయండి.
స్టెప్స్...
- మీ స్మార్ట్‌ఫోన్‌లో Android Device Manager యాప్ ను ఇన్స్టాల్ చేయండి
- యాప్ ఓపెన్ చేసి మీరు ఉపయోగిస్తున్న డివైస్ ను సెలెక్ట్ చేయండి
- secure device అనే ఆప్షన్ ను ప్రెస్ చేయండి
- lock screen మెసేజ్ మరియు ఫోన్ నెంబర్ ను యాడ్ చేయండి

Google అకౌంట్ ను రిమోట్ విధానంలో...
ఈ విధంగా మీరు మీ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు Google అకౌంట్ ను రిమోట్ విధానంలో నుండి లాగ్ అవుట్ చేసి దాని నుండి మొత్తం డేటాను ఎరేజ్ చేయగలుగుతారు. మీరు మీ డివైస్ లో Google Play సర్వీస్ ను ప్రారంభించకపోతే, మీ ఫోన్లో యాప్ ను ఉంచండి. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ పోగొట్టుకుంటే మీరు ఏమి చేయాలి, దాన్నిఎలా లాగ్ అవుట్ చేయాలో మీ డేటాను ఎలా ఎరేజ్ చేయాలో ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి...
స్టెప్స్...
- google.com/android/devicemanager లోకి వెళ్ళండి
- మీరు లాస్ట్ లో ఉపయోగించిన డివైస్ ను సలెక్ట్ చేయండి
- మీరు మ్యాప్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ స్థానాన్ని చూడగలుగుతారు. మీరు ఇక్కడ ఉన్నట్లయితే, Play sound pi నొక్కండి. ఇది గట్టిగ రింగ్ చేస్తుంది అప్పుడు మీరు మీ డివైస్ కనుగొనగలరు.
- ఒక వేళా మీ ఫోన్ దొంగలించబడితే ‘Secure Device' ను ప్రెస్ చేసి మీ ఫోన్ ను లాక్ చేయవచ్చు.
- మీ ఫోన్ లో క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ లేదా ఫొటోస్ వంటివి ఏమైనా ఉంటె ‘Erase Device' ను నొక్కి డేటా అంత ఎరేజ్ చేయండి.


Click it and Unblock the Notifications








