Camera Industryని ధ్వంసం చేస్తున్న స్మార్ట్‌ఫోన్లు

By Gizbot Bureau
|

ఇప్పుడు మార్కెట్లో టెక్నాలజీ పరంగా ఏదైనా ట్రెండింగ్ లో ఉందంటే అది కెమెరా ఇండస్ట్రీనే. ఏడాదికేడాది మొబైల్ కంపెనీలు లార్జ్ కెమెరా స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. యూజర్లు డిజిటల్ కెమెరా కన్నా ఫోన్ కెమెరాతోనే అన్ని రకాలైన చిత్రాలను క్యాప్చర్ చేస్తున్నారు. డిజిటల్ కెమెరా అవసరం లేకుండానే వీడియోలు తీస్తున్నారు.

 
Smartphones Threatening the Camera Industry

high-end DSLR , mirrorless camera కెమెరాతో షూట్ చేసే వీడియోలను ఇప్పుడు కేవలం మొబైల్ కెమెరాతోనే షూట్ చేస్తున్నారు. క్వాలిటీ కూడా అదే స్థాయిలో ఉండటంతో ఈ కెమెరా ఫోన్లకు బాగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో కెమెరా ఇండస్ట్రీని స్మార్ట్ ఫోన్లు పూర్తిగా ఆక్రమించేశాయి. ఈ శీర్షికలో భాగంగా స్మార్ట్ ఫోన్ కెమెరాలు కెమెరా ఇండస్ట్రీని శాసిస్తాయా లేదా అనేది తెలుసుకుందాం.

కెమెరా ఇండస్ట్రీ పయనం ఎటు

కెమెరా ఇండస్ట్రీ పయనం ఎటు

సామాజిక మాధ్యమాల పుణ్యమాని అత్యాధునిక పాప్‌-అప్, మల్టీ కెమెరా స్మార్ట్‌ఫోనే వినియోగదారుల ఏకైక డిమాండ్‌గా నిలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేవైపు నాలుగు కెమెరాలున్న మోడళ్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి చేరాయి. ఇటీవలే అయిదు కెమెరాలతో నోకియా 9 ప్యూర్‌వ్యూ ఫోన్‌ను తీసుకొచ్చింది. 64 మెగా పిక్సెల్‌ కెమెరాతో కూడిన ఫోన్లు కొద్ది రోజుల్లో కస్టమర్ల చేతుల్లో క్లిక్‌మనిపించనున్నాయి. దీంతో కెమెరా ఇండస్ట్రీ దిక్కుతోచని స్థితిలో పడింది. గతేడాది Nikon and Canon కెమెరాల అమ్మకాలు భారీగా తగ్గాయి.

 కెమెరా టెక్నాలజీతోనే

కెమెరా టెక్నాలజీతోనే

కెమెరాను కేంద్రంగా చేసుకునే మోడళ్ల రూపకల్పనలో కంపెనీలు ఇప్పుడు నిమగ్నమయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కెమెరా టెక్నాలజీతోనే కంపెనీలు తమ ప్రత్యేకతను చాటుకోవాల్సిందేనని జర్మనీకి చెందిన ఆప్టికల్స్‌ తయారీ దిగ్గజం జాయిస్‌ సీఈవో మైఖేల్‌ కాష్‌కే స్పష్టం చేశారు. కెమెరాల సామర్థ్యం పెరగడంతో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జోరు మీదున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

మల్టీ కెమెరాలకే మొగ్గు
 

మల్టీ కెమెరాలకే మొగ్గు

ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ రంగంలో మల్టీ కెమెరాలు ఇప్పుడు సందడి చేస్తున్నాయి. బెజెల్‌ లేకుండా పూర్తి డిస్‌ప్లేతో ఫోన్లను అందించేందుకు పాప్‌-అప్‌ సెల్ఫీ కెమెరాలతో మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్, ఆప్టికల్‌ జూమ్, ఫాస్ట్‌ ఆటో ఫోకస్, వైడ్‌ యాంగిల్‌ వంటి ఫీచర్లతో ఇవి రంగ ప్రవేశం చేస్తున్నాయి. ఇక వెనుకవైపు రెండింటితో మొదలై అయిదు కెమెరాల స్థాయికి వచ్చిందంటే ట్రెండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ‘ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో అందమైన ఫొటోలను పోస్ట్‌ చేసేందుకు కస్టమర్లు పాప్‌-అప్‌తోపాటు వెనుకవైపు మూడు, నాలుగు కెమెరాలున్న ఫోన్లు కోరుకుంటున్నారు.

పాప్‌–అప్‌ కెమెరా

పాప్‌–అప్‌ కెమెరా

పాప్‌-అప్‌ కెమెరా మోడల్‌ ఇప్పుడు రూ.18 వేల నుంచే ప్రారంభం అవుతున్నాయి. వివిధ కంపెనీల నుంచి వచ్చిన క్వాడ్, ట్రిపుల్‌ కెమెరా మోడళ్లు దాదాపు 90 వరకు ఉంటాయి. 48 మెగాపిక్సెల్‌తో ప్రధాన కెమెరా ఉన్న మోడళ్లు 60 దాకా ఉన్నాయి. అలాగే 48 ఎంపీతో కూడిన డ్యూయల్‌ ఫ్రంట్‌ కెమెరా ఫోన్లూ వచ్చి చేరాయి. 48 ఎంపీ రొటేటింగ్‌ పాప్‌-అప్‌ కెమెరాతో సామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ80ని ఆవిష్కరించింది. 64 ఎంపీ ప్రధాన కెమెరాతో షియోమి, రియల్‌మీ త్వరలో రంగంలోకి దిగుతున్నాయి.

Best Mobiles in India

English summary
Are Smartphones Threatening the Camera Industry

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X