2023 లో SmartPhones ధ‌ర‌లు మ‌రింత ప్రియం కానున్నాయా!

|

రానున్న రోజుల్లో SmartPhones ధ‌ర‌లు మ‌రింత ప్రియం కానున్నాయా.. అంటే అవున‌నే చెబుతున్నాయి టెక్ వ‌ర్గాలు. ఎందుకంటే ChipSets మ‌రియు ఇత‌ర కాంపొనెంట్స్ ధ‌ర‌లు భారీగా పెరిగిన‌ట్లు స‌మాచారం. ఈ కార‌ణంగా SmartPhones ధ‌ర‌లు కూడా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇందుకు సంబంధించి బ్లూంబ‌ర్గ్ నివేదిక‌లు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించాయి.

 
2023 లో SmartPhones ధ‌ర‌లు మ‌రింత ప్రియం కానున్నాయా!

2023లో Chip ల ధర మరింత పెరగనున్నందునే:
TSMC (తైవాన్ సెమీకండక్టర్ త‌యారీ కంపెనీ) కి ముడి స‌రుకులు స‌ర‌ఫ‌రా చేసే షోవా డెంకో K.K., జపనీస్ కెమికల్స్ కంపెనీ ధరలను మరింత పెంచాలని మరియు లాభదాయకం కాని ఉత్పత్తి లైన్లను తగ్గించాలని భావిస్తోంది. అంతేకాకుండా, కరోనావైరస్ మహమ్మారి సృష్టించిన న‌ష్టాల‌తో స‌ప్లై చైన్ సమస్యలు కూడా ఏర్ప‌డ్డాయి.. మరియు ఉక్రెయిన్ యుద్ధం వంటి అనేక అంశాలతో కాంపొనెంట్స్‌ మరియు చిప్‌సెట్‌ల ధరల‌ పెరుగుదలకు దారితీశాయి.

TSMC చిప్స్ ధరను పెంచుతుందా?
చిప్ సెట్‌ల‌ను తయారీ వ్య‌యానికే విక్రయిస్తే TSMC కి లాభాలు దూరమవుతాయి. అందువల్ల, 2023లో ఆ కంపెనీ చిప్‌ల ధరను పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రోవైపు, మార్కెట్‌లో చిప్‌లను తయారు చేసే కంపెనీలు చాలా త‌క్కువ ఉన్నాయి. కాబ‌ట్టి, అది కూడా ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు ఒక కార‌ణంగా నివేదిక‌లు చెబుతున్నాయి.

2023 లో SmartPhones ధ‌ర‌లు మ‌రింత ప్రియం కానున్నాయా!

భారతదేశ ప్ర‌భుత్వం ప్రస్తుతం స్థానికంగా సెమీ కండక్టర్ తయారీదారులను ఆహ్వానించడానికి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. దేశీయంగా PLI (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) పథకం ద్వారా టీవీ తయారీ, సెమీ కండక్టర్ తయారీ, డిస్‌ప్లే తయారీ, స్మార్ట్‌ఫోన్ తయారీ మరియు మరిన్నింటిని స్థానికంగా త‌యారు చేసేందుకు ఆహ్వానిస్తోంది. ఈ ప‌రిణామాలు భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థకు సహాయపడుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. శాంసంగ్ మరియు TSMC చిప్‌ల ధరలను పెంచాలని భావిస్తున్నట్లు తమ వినియోగదారులకు ఇప్పటికే తెలియజేసినట్లు నివేదిక పేర్కొంది. చిప్‌సెట్ ధరల పెరుగుదల అంతిమంగా వినియోగదారులను దెబ్బతీస్తుంది, ఎందుకంటే వారు స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

చిప్ త‌యారీ రంగంలో రూ.1.53 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులే ల‌క్ష్యం: కేంద్ర మంత్రి
రాబోయే నాలుగేళ్లలో దేశీయంగా 300 బిలియన్‌ డాలర్ల ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంద‌ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఇందుకోసం 70-80 బిలియన్‌ డాలర్ల సెమీకండక్టర్లు (చిప్‌లు) అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్‌లో జ‌రిగిన సెమీకాన్‌ ఇండియా 2022 సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయ‌న‌ ఈ విషయాలు తెలిపారు. 'డిజిటల్‌ పరికరాలు, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ విజన్‌ డాక్యుమెంట్‌ ప్రకారం 2026 నాటికి 300 బిలియన్‌ డాలర్ల ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ' అని మంత్రి చెప్పారు.

 

సెమీకాన్‌ ఇండియా పథకం కింద భారత్‌లో దాదాపు రూ.1.53 లక్షల కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రానిక్‌ చిప్, డిస్‌ప్లే తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అయిదు కంపెనీల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. 13.6 బిలియ‌న్ డాల‌ర్ల‌తో వేదాంత ఫాక్స్‌కాన్‌ జేవీ, ఐజీఎస్‌ఎస్‌ వెంచర్స్, ఐఎస్‌ఎంసీ సంస్థలు.. ఎలక్ట్రానిక్‌ చిప్‌ తయారీ ప్లాంట్లను పెట్టే యోచనలో ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే ప్ర‌తిపాద‌న‌లు పంపిన‌ట్లు ప‌లు నివేదిక‌లు వెల్ల‌డించాయి. వేదాంత, ఎలెస్ట్‌ సంస్థలు మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన వాటిలో ఉపయోగించే డిస్‌ప్లే తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసిన‌ట్లు మంత్రి తెలిపారు. వారి ప్ర‌తిపాద‌న‌లు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు చెప్పిన ఆయ‌న, అనుమ‌తి మంజూరు చేయ‌డంపై ఏం వెల్ల‌డించ‌లేదు.

Best Mobiles in India

English summary
Smartphones to Get Further Expensive in 2023

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X