అక్టోబర్ నెలలో విడుదల కానున్న ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు.. లిస్ట్ ఇదే..!
సెప్టెంబర్‌లో ప్రముఖ సంస్థల నుంచి స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. అదేవిధంగా అక్టోబర్‌లో అనేక పాపులర్ బ్రాండ్ల ఫోన్లు విడుదల కానున్నాయి. ఈ జాబితాలో గూగుల్, శాంసంగ్, వివో, వన్‌ప్లస్, ఒప్పో సహా మరిన్ని సంస్థల స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్ల లాంచింగ్ తేదీలు సహా స్పెసిఫికేషన్ల వివరాలు మీకోసం.
Google Pixel 8 Series గూగుల్ నుంచి అక్టోబర్ 4 తన ఫ్లాగ్‌షిప్ మోడల్ గూగుల్ పిక్సల్ 8 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో పిక్సల్ 8, పిక్సల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్ గూగుల్ టెన్సర్ G3, ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. గూగుల్ పిక్సల్ 8 ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.1 అంగుళాల OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

అదే పిక్సల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. మరియు ఈ రెండు ఫోన్లు 1600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో రానున్నాయి. అయితే ఈ రెండు ఫోన్ల గురించి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
Samsung Galaxy S23 FE శాంసంగ్ నుంచి ప్రీమియం మోడల్‌గా ఈ ఫోన్ రానుంది. శాంసంగ్ గెలాక్సీ S23 FE ఫోన్ అక్టోబర్ 4న విడుదల కానుంది. ఈ ఫోన్ శాంసంగ్ S23 తరహా డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ Exynos 2200 చిప్‌సెట్ సహా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. కొన్ని నివేదికల ఆధారంగా ఈ ఫోన్ 8GB ర్యామ్‌తో 128GB, 256GB అంతర్గత స్టోరేజీలను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
Vivo V29 భారత్ మార్కెట్‌లో వివో తన V సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విస్తరించనుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 4న Vivo V29, Vivo V29 Pro స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుంది. ఈ ఫోన్లు వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటాయి. అరా లైట్, LED ఫ్లాష్‌తో రానున్నాయి. 3D పార్టికల్ టెక్నాలజీ ఫినిషింగ్‌ను కలిగి ఉంటాయి.
OnePlus Open వన్‌ప్లస్ నుంచి తొలిసారిగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్లు సమాచారం. కొన్ని లీక్‌ల ఆధారంగా ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. జూమ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు పెరిస్కోప్ లెన్స్‌లను కలిగి ఉంటాయని తెలుస్తోంది.
దీంతోపాటు ఈ ఫోల్డబుల్ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫ్రింగర్ ప్రింట్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. మరియు పంచ్ హోల్ కెమెరా డిజైన్‌తో రానుంది. కొన్ని నివేదికల ఆధారంగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 OS ఆధారిత ఆక్సిజన్ OS ఫోల్డ్ ఇంటర్‌ఫేస్‌తో రానుంది. దీంతోపాటు ఆక్టా కోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.
Oppo Find N3 ఒప్పో నుంచి కూడా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ రానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టీజర్‌ను తన అధికారిక X (ట్విట్టర్) ద్వారా విడుదల చేసింది. అయితే ఈ ఫోన్‌ను ఈ నెలలోనే విడుదల చేస్తారని తెలుస్తోంది. కానీ తేదీపై ఇంకా స్పష్టత రాలేదు.
ఒప్పో ఫైండ్ N3 ఫోన్ 6.8 అంగుళాల FHD+ ఇంటర్నల్ డిస్‌ప్లే, 3.26 అంగుళాల AMOLED బాహ్య డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఒప్పో ఫైండ్ N3 స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్‌సెట్‌ను కలిగి ఉంటాయి. మరియు ఆండ్రాయిడ్ 13 OSపై పనిచేస్తుంది. మరియు 4300mAh బ్యాటరీ సామర్థ్యం సహా 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రానుంది.


Click it and Unblock the Notifications








