ఈ స్మార్ట్‌వాచ్ మీ చేతి కదలికలను ఇట్టే పసిగట్టేస్తుంది
మీరు ధరించే స్మార్ట్‌వాచ్‌లు మీ చేతి కదలికలను గుర్తిస్తాయనే విషయం మీకు తెలుసా.. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. మీరు ధరించే స్మార్ట్‌వాచ్‌లు మీ చేతులు ఏం పనిచేస్తున్నాయో ఇట్టే పసిగట్టేస్తాయని పరిశోధకులు
మీరు ధరించే స్మార్ట్‌వాచ్‌లు మీ చేతి కదలికలను గుర్తిస్తాయనే విషయం మీకు తెలుసా.. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. మీరు ధరించే స్మార్ట్‌వాచ్‌లు మీ చేతులు ఏం పనిచేస్తున్నాయో ఇట్టే పసిగట్టేస్తాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. మీ చేతులు వాషింగ్ చేస్తున్నా లేకుంటే వంట చేస్తున్నా మరేదైనా పనులు చేస్తున్నా అవి ఇట్టే పసిగట్టేస్తాయట. మీరు ఇష్టపడి కొనుక్కున్న స్మార్ట్‌వాచ్‌లు చేతి కదలికలను గుర్తిస్తాయని అమెరికాలోని కార్నేగి మెలోన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. సాధారణ స్మార్ట్‌వాచ్‌లను ధరించిన వారు కీబోర్డుపై టైప్ చేస్తున్నా, వంట పాత్రలు కడుగుతున్నా, పెంపుడు కుక్కలను బయటకు తీసుకెళ్లినా, ఏదైనా కత్తిరిస్తున్నా అవి గుర్తించగలిగాయని పరిశోధనల ద్వారా కనుగొన్నారు.

అయితే దీని ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్)లో కొద్దిగా మార్పులు చేస్తే.. సుమారు 25 రకాల చేతి కదలికలను 95 శాతం కచ్చితత్వంతో గుర్తించగలదని వారు చెబుతున్నారు. అలాగే బ్రష్ చేయడం, ధూమపానం వంటి కార్యకలాపాలను పర్యవేక్షించే ఆరోగ్య సంబంధిత కొత్త యాప్‌ల రూపకల్పనకు కూడా ఇవి దోహదపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

కొద్ది రకాల మార్పులను
స్మార్ట్‌వాచ్‌లో పొందపరిచిన ఆపరేటింగ్ సిస్టం మీ చేతి కదలికలో జరిగే కొద్ది రకాల మార్పులను ఇట్టే పసిగడుతుంది. accelerometer మీ చేతి ద్వారా జరిగే పనులను ఇట్టే గుర్తిస్తాయని తెలిపారు. ఈ పరిశోధకులు దాదాపు 25 రకాల వ్యక్తుల చేతుల మీద ఈ పరిశోధనలు చేశారు. ఇందులో దాదాపు 95 శాతం ఖచ్చితత్వం వచ్చింది.

25మంది వ్యక్తుల చేతులు
దాదాపు 25 మంది వ్యక్తుల చేతులకు ఈ స్మార్ట్‌వాచ్‌లు ధరించి ప్రయోగాలు జరిపారు. వారు ఏం పనిచేస్తున్నా అంటే కీ బోర్డ్ టైపింగ్, washing dishes, petting a dog, pouring from a pitcher, cutting with scissors వంటి పనులు చేస్తున్నప్పుడు ఆటోమేటిగ్గానే కదలికలను స్మార్ట్ వాచీ పసిగట్టేసిందని పరిశోధకులు చెబుతున్నారు.

యాక్టివిటీని
స్మార్ట్ వాచీలో ఉన్న వెరైటీ యాప్స్ కూడా చేతుల యాక్టివిటీని పసిగట్టగలవని బాడీలో జరిగే మార్పులను గుర్తించగలవని తేల్చారు.స్మార్ట్ ఫోన్ లో యూజర్ డ్రైవింగ్ చేసే సమయంలో టెక్ట్స్ మెసేజ్ లు బ్లాక్ చేయగలిగే అవకాశం ఉందని అయితే ఫ్యూచర్ లో ఇది మరింతగా ముందుకు వచ్చి అనేక రకాల మార్పులుకు వేదికయ్యే అవకాశం ఉందని చేతుల ద్వారానే ఆటోమేటిగ్గా పనులు జరిగిపోతాయని చెప్పారు.

health-related apps
దీంతో పాటు ఇప్పుడు హెల్త్ రిలేటెడ్ యాప్స్ కూడా బాగా పాపులర్ అవుతున్నాయి. ఈ యాప్స్ ద్వారా మనిషి ఆరోగ్యంలోని ప్రతి కదలికను తెలుసుకునే అవకాశం ఉంది. మనిషి చేసే అన్ని రకాల పనులను అలాగే ఆరోగ్య సమస్యలపై అవి చూపే ప్రభావాన్ని ఇవి పసిగట్టగలవు. ఏ పనిచేసినా వెంటనే దాని ప్రభావాన్ని ఇవి పసిగట్టగలవని పరిశోధకులు చెబుతున్నారు.

10 డైలీ యోగా పోజెస్
ఆండ్రాయిడ్ డివైస్‌లను వాడుతున్న యూజర్ల కోసం '10 డైలీ యోగా పోజెస్ (10 Daily Yoga Poses)' పేరిట యోగా యాప్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ను యూజర్లు ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 2.3.3 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. 10 డైలీ యోగా పోజెస్ యాప్ ద్వారా యూజర్లు యోగాకు చెందిన పలు ఆసనాలను సులభంగా వేయవచ్చు. ఇందుకోసం ఆసనాలను ఎలా వేయాలో చూపించే పలు సూచనలు యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. యోగాను ఎంత సేపు చేశారో తెలుసుకునేందుకు ఇందులో వీలు కల్పించారు. రిమైండర్లు, టోటల్ ఫిట్‌నెస్ వంటి ఆప్షన్‌లు ఇందులో ఉన్నాయి.

ది హార్ట్ యాప్
న్యూఢిల్లీలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు చెందిన వైద్యుడు 'ది హార్ట్ యాప్ (The Heart App)' పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ యాప్‌ను రూపొందించాడు. దీని వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కలిగే లక్షణాలను, శరీర హెచ్చరికలను ముందుగానే గుర్తించి జాగ్రత్త పడవచ్చు. ఈ యాప్ మొదటి వెర్షన్‌ను యూజర్లు ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 2.2 ఆపైన వెర్షన్ కలిగిన డివైస్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది.

పలు ప్రశ్నలను ఎంచుకుని
ఛాతిలో అసౌకర్యంగా ఉండడం, భారంగా ఉండడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉన్న వారు యాప్‌లో ఉండే పలు ప్రశ్నలను ఎంచుకుని వాటికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా అన్ని ప్రశ్నలకు వేగంగా సమాధానం చెబితే యాప్ చివరికి గుండె జబ్బు సమస్య ఉందో లేదో చెప్పేస్తుంది. దీంతో యూజర్లు తమకు హార్ట్ ఎటాక్ రాకుండా, వచ్చినా జాగ్రత్తగా వ్యవహరించే విధంగా ముందస్తు చర్యలను తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఇదే కాకుండా ఈ యాప్‌లో గుండె జబ్బులను ముందే గుర్తించే పలు లక్షణాలు, హెచ్చరికలు, చికిత్సలకు సంబంధించిన వివరాలను పొందు పరిచారు. గుండె జబ్బుల పట్ల అవగాహన లేకపోవడం వల్ల, వాటిని సరిగా గుర్తించకపోవడం వల్ల నేడు అనేక మంది హార్ట్ ఎటాక్ వచ్చినా రక్షింపబడలేకపోతున్నారని సదరు వైద్యుడు తెలిపాడు. ఈ నేపథ్యంలోనే గుండె జబ్బులను సరైన సమయంలో గుర్తించి వాటికి తగిన చికిత్సను అందించడం కోసం ఉపయోగపడే విధంగా ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపాడు.


Click it and Unblock the Notifications








