రైల్వే టికెట్ ఖాయమైతే మీ మొబైల్‌కు ఎస్ఎంఎస్

Posted By:

వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్యాసెంజర్లకు తమ రైల్వే టికెట్ ఖాయమైందో లేదా తెలుసుకోవడానికి ఇక పై టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రయాణానికి మూడు గంటల మందు అంటే రైలు బయల్దేరడానికి 180 నిమిషాల ముందు మీ మొబైల్ నంబరుకు టికెట్ కన్ఫర్మేషన్‌కు సంబంధించిన సమచారం ఎస్ఎంఎస్ రూపంలో వచ్చి చేరుతుంది. టీకెట్ ఖాయమైందా... ఆర్ఏసీ వచ్చిందా ఇంకా కోచ్ నంబరు, సీటు నంబరు మొదలగు వివరాలను ఆ ఎస్ఎంఎస్‌లో చూసుకోవచ్చు.

రైల్వే టికెట్ ఖాయమైతే మీ మొబైల్‌కు ఎస్ఎంఎస్

టెకిట్ ఖాయం కాని పక్షంలో సందేశం రాదు. ఈ కొత్త విధానాన్ని రైల్వే సహాయ మంత్రి అధీర్ రంజన్ చౌదరి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. రైల్వే సాంకేతిక విభాగం (సీఆర్ఎస్) ఈ ప్రయోగాత్మక సాఫ్టవేర్‌ను వృద్థి చేసింది.

మీరు ఎక్కాల్సిన ట్రెయిన్ ఎక్కడుందో.. ఎంత దూరంలో ఉందో ఖచ్చితమైన వివరాలతో ఇక పై తెలుసుకోవచ్చు. రైల్వే శాఖ తాజాగా ‘రైల్ రాడార్' పేరుతో సరికొత్త ఆన్‌లైన్ అప్లికేషన్‌ను విడుదల చేసింది. ఈ అప్లికేషన్ ఉపయోగించుకుని గూగుల్ మ్యాప్ సాయంతో దేశవ్యాప్తంగా ఉన్న 6,500 రైళ్లకు సంబంధించి ఖచ్చితమైన భౌగోళిక స్థానాన్ని తెలసుకోవచ్చు. రైల్వే శాఖ దేశవ్యాప్తంగా రోజుకు 10,000 రైళ్లను నడుపుతోంది. ఈ అప్లికేషన్‌ను ఓపెన్ చేయగానే ప్రత్యక్షమయ్యే మ్యాప్ ద్వారా అవసరమైన రైళ్ల సమచారాన్ని తెలుసుకోవచ్చు. రైల్ రాడార్ అప్లికేషన్ లింక్ అడ్రస్

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot