ఎస్ఎంఎస్ లిమిట్ రోజుకు 20కి పొడిగింపు

Posted By: Prashanth

ఎస్ఎంఎస్ లిమిట్ రోజుకు 20కి పొడిగింపు

 

అసోం అల్లర్ల నేపధ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా 15 రోజుల పాటు బల్క్ ఎస్ఎంఎస్ ఇంకా ఎమ్ఎమ్ఎస్‌లను బ్యాన్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం సడలించింది. సమాచార మంత్రుత్వ శాఖ తాజా ఆదేశాల ప్రకారం మొబైల్ నుంచి రోజుకు 20 సందేశాల వరకు పంపుకోవచ్చు. తాజా ఉత్తర్వులు అమలయ్యేలా ఇప్పటికే టెలికామ్ ఆపరేటర్లకు ఇప్పటికే ఆదేశాలు జారి అయ్యాయి.

ఆస్సాం అల్లర్ల నేపధ్యంలో ఆగస్టు 18 నుంచి దేశ వ్యాప్తంగా 15 రోజుల పాటు బల్క్ ఎస్ఎంఎస్ ఇంకా ఎమ్ఎమ్ఎస్‌లను బ్యాన్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన్ విషయం తెలిసిందే. ఈ అత్యవసర చర్య కారణంగా టెలికం ఆపరేటర్లకు ఈ నెలలో 7 నుంచి 8% మేరకు ఆదాయంలో కోతపడనుంది. సెల్యులర్ ఆపరేటర్ల అసోసియేషన్ (సీవోఏఐ) డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ ఈ అంచనాలను వెల్లడించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot