ఎస్ఎంఎస్ @ ఇరువై ఏళ్లు!

Posted By: Prashanth

ఎస్ఎంఎస్ @ ఇరువై ఏళ్లు!

 

సంక్షిప్త సందేశం (ఎస్ఎంఎస్)కు రెండు దశాబ్దాలు నిండాయి. కమ్యూనికేషన్ బంధాలను మరింత చేరవ చేసిన ఎస్ఎంఎస్‌కు ఈ డిసెంబర్ 3‌తో ఇరువై ఏళ్లు పూర్తయ్యాయి. ఎస్సెమ్మెస్ 1992, డిసెండర్ 3న ఆవిర్భవించింది. 22 ఏళ్ల బ్రిటీషు ఇంజనీర్ నీల్‌పాప్ వర్త్ మొట్టమొదటిసారిగా 'మేరీ కిస్మస్' అంటూ సంక్షిప్త సందేశం పంపారు. వోడాఫోన్ యూకే నెట్‌వర్క్ నుంచి ఆర్బిటెల్ 901 మొబైల్‌కు ఆయనీ ఎస్ఎంఎస్ చేశారు. అయితే ఇది జరగడానికి 8 ఏళ్ల ముందే జరిగిన టెలికమ్యూనికేషన్ కాన్పెరెన్స్‌లో ఫిన్‌లాండ్ ప్రభుత్వాధికారి మాటి మాకోనెన్ పొట్టి సందేశం గురించి ప్రస్తావించారు. వాణిజ్య ఎస్ఎంఎస్ సేవలను స్వీడన్ 1993లో ప్రారంభించింది. సంక్షిప్త సందేశాలు పంపుకునేందుకు అనువైన సెల్‌ఫోన్లు మొదటగా నోకియా కంపెనీ తయారుచేసింది. 1994లో ఎస్సెమ్మెస్ ఎనబిల్డ్ నోకియా 2110 జీఎస్ఎమ్ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.

సెల్‌ఫోన్ల వాడకం అనుహ్యంగా పెరగడంతో ఎస్ఎంఎస్‌ల హవా మొదలయింది. ప్రపంచవ్యాప్తంగా నేడు 400 కోట్ల మంది పొట్టి సందేశాలను ఇచ్చి పుచ్చుకుంటున్నారు. సెకనుకు 2 లక్షల సంక్షిప్త సందేశాలు చేతులు మారుతున్నాయి. అయితే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు ఎస్ఎంఎస్‌ ఉనికికి ప్రశ్నార్థకంగా నిలిచాయి. బ్రిటన్‌లో గతేడాది 39.7 బిలియన్ల శిఖరస్థాయికి చేరుకున్న స్మాల్' సందేశాలు ఈ ఏడాది 38.5 బిలియన్లకు పరిమితమయ్యాయి. సామాజిక సంబంధాల వెబ్ సైట్ల లాంటి ఇన్‌స్టంట్ సమాచార వేదికలు అందుబాటులోకి రావడమే ఎస్ఎంఎస్‌ల పతనానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting