ఇక Snapchatలో ఫ్రంట్‌, బ్యాక్ కెమెరాలు ఒకేసారి ఉప‌యోగించొచ్చు!

|

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా యాప్ Snapchat, నిత్యం రక‌ర‌కాల కొత్త ఫీచ‌ర్ల‌తో త‌మ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. తాజాగా మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను వినియోగ‌దారుల‌కు ప‌రిచ‌యం చేసింది. అదేంటంటే.. ఏక కాలంలో ఫ్రంట్ మ‌రియు బ్యాక్ కెమెరాల‌తో ఫొటో క్యాప్చ‌ర్ చేసే ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచ‌ర్ యూజ‌ర్ల‌ను ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాల‌ను ఒకేసారి ఉప‌యోగించ‌డానికి అనుమ‌తిస్తుంది.

 
snapchat

ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే కెమెరాలలో స్నాప్ కెమెరా ఒకటి అని కంపెనీ ఈ సంద‌ర్భంగా తెలిపింది. డ్యూయల్ కెమెరా ఫీచర్ నాలుగు ర‌కాల‌ లేఅవుట్‌లతో వస్తుందని పేర్కొంది. అంతేకాకుండా, స్నాప్‌చాట్ యూజ‌ర్లు కంటెంట్ క్రియేట్ చేయడానికి డ్యుయ‌ల్ కెమెరా రికార్డింగ్‌తో పాటుగా సంగీతం, స్టిక్కర్లు మరియు లెన్స్‌ల వంటి వాటిని అద‌నంగా జోడించ‌వ‌చ్చు.

 

కంపెనీ తెలిపిన ప్రకారం, స్నాప్‌చాట్ డ్యూయల్ కెమెరా ఈరోజు నుంచి iOSలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. రాబోయే కొద్ది నెలల్లో Android యూజ‌ర్ల‌కు కూడా అందుబాటులోకి వస్తుంది. బ్లాగ్ పోస్ట్ ప్రకారం, iPhone XS, iPhone XS Max, iPhone XR, iPhone 11 Pro, iPhone 11 Pro Max, iPhone SE, iPhone 12 Pro మరియు iPhone 12 Pro Maxతో సహా iPhone మోడల్‌లు ప్రారంభంలో ఈ ఫీచ‌ర్ స‌పోర్టును పొందుతాయి. స్నాప్‌చాట్‌లోని డ్యూయల్ కెమెరా ముందు మరియు వెనుక కెమెరాలను ఏకకాలంలో ఉపయోగించి కంటెంట్‌ను క్యాప్చర్ చేయడానికి ఈ ఫీచ‌ర్ మిమ్మల్ని అనుమతిస్తుంది. డ్యుయ‌ల్ కెమెరాతో, మీరు సెల్ఫీ ద్వారా మీ పరిస్థితిని రికార్డు చేయ‌డంతో పాటు.. మీకు ఎదురుగా ఏం జ‌రుగుతుందో ఆ ప‌రిస్థితిని కూడా ఏక‌కాలంలో రికార్డు చేయ‌వ‌చ్చు.

snapchat

ఈ డ్యుయ‌ల్ కెమెరాను వినియోగించ‌డం ఎలా:
* ముందుగా మీ స్నాప్‌చాట్‌ని ఓపెన్ చేయాలి. కెమెరా టూల్‌బార్‌లో మీకు కొత్త సింబ‌ల్ కనిపిస్తుంది.
* స్నాప్‌చాట్‌లో డ్యుయ‌ల్ కెమెరా ప్రారంభించ‌డానికి మీరు ముందుగా కెమెరా స్క్రీన్ ఓపెన్ చేయాలి.
* కెమెరా టూల్‌బార్‌లో డ్యుయ‌ల్ కెమెరా ఐకాన్ క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత అందులో వివిధ ర‌కాల లే అవుట్ల‌లో మీకు న‌చ్చిన‌ది ఎంపిక చేసుకోవాలి.
* హారిజాంట‌ల్‌, వ‌ర్టిక‌ల్‌, పిక్చ‌ర్ ఇన్ పిక్చ‌ర్‌, క‌టౌట్ ఇలా నాలుగు లే అవుట్‌లు ఉంటాయి. అందులో మీకు న‌చ్చిన‌ది ఎంపిక చేసుకోవాలి.
* ఆ త‌ర్వాత యూజ‌ర్లు మ్యూజిక్‌, స్టిక్క‌ర్లు, లెన్సెస్ కూడా కెమెరా రికార్డింగ్ కు యాడ్ చేసుకోవచ్చు.
* కెమెరా యొక్క ప్రైమ‌రీ, సెకండ‌రీ వీక్షణలను మార్చేందుకు 'ఫ్లిప్ కెమెరా' బటన్ కూడా ఉంది.

snapchat

"ఒక ట్యాప్‌తో, మీరు మెరుగైన స్నాప్‌లు మరియు స్టోరీలు లేదా మరిన్ని స్పాట్‌లైట్ వీడియోలను క్రియేట్ చేయ‌డం ప్రారంభించవచ్చు. డ్యుయల్ కెమెరా అనేది మా కమ్యూనిటీకి అద్భుతమైన క్షణాలను క్యాప్చర్ చేయడానికి ఒక మంచి మార్గం." అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మ‌రోవైపు, Snapchat పేరెంట్ అయిన Snap స్పాట్‌లైట్ క్రియేటర్‌ల కోసం రివార్డ్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రకటించింది, ఇక్కడ టాప్ స్పాట్‌లైట్ స్నాప్‌లను సృష్టించే అర్హత ఉన్న స్నాప్‌చాటర్‌లు "మిలియన్ల డాలర్లు" పొందుతారని కంపెనీ పేర్కొంది.

మ‌రోవైపు, స్నాప్‌చాట్ ప్ల‌స్ ప్రీమియం ప్రారంభించిన త‌ర్వాత రికార్డు స్థాయిలో స‌బ్‌స్క్రిప్ష‌న్‌లు న‌మోదు!

ప్ర‌ముఖ సోషల్ మీడియా యాప్ Snapcha స‌రికొత్త రికార్డు సృష్టించింది. గ‌త కొద్ది రోజుల క్రితం Snapchat+ పేరుతో త‌మ యొక్క ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కాగా, స‌బ్‌స్క్రిప్ష‌న్ స‌ర్వీసులు ప్రారంభించిన అతి కొద్ది రోజుల్లోనే 1 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను చేరుకుంది. ఈ మేర‌కు కంపెనీ సోమవారం తెలిపింది. కేవ‌లం మూడు నెల‌ల్లోపు కాలంలో 1 మిలియ‌న్ స‌బ్‌స్క్రైబ‌ర్ కౌంట్ చేరుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

snapchat

భార‌త్‌లో SNAPCHAT+ స‌బ్‌స్క్రిప్ష‌న్ ధ‌ర ఎంత‌!
ప్రపంచవ్యాప్తంగా, Snapchat+ ధర $3.99 గా కంపెనీ నిర్ణ‌యించింది. ఇది భారత కరెన్సీ ప్ర‌కారం చూస్తే దాదాపు రూ.320 ఉంటుంది. కానీ, ఆ కంపెనీ భార‌త్‌లో మాత్రం స్నాప్‌చాట్+ (Snapchat+) సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ధర చాలా త‌క్కువ ధ‌ర ఒక నెలకు రూ.49 గా నిర్ణయించింది. దీన్ని బ‌ట్టి చూస్తే.. ఆ కంపెనీ భార‌త‌ దేశంలోని వినియోగదారులను ఆకర్షించడానికి తీవ్రమైన ప్రయత్నం చేసిందని స్ప‌ష్టంగా అర్థం చేసుకోవ‌చ్చు.

SNAPCHAT+ స‌బ్‌స్క్రిప్ష‌న్ యూజ‌ర్ల‌కు వ‌చ్చే అద‌న‌పు ఫీచ‌ర్లు!
భారతదేశంలో ఈ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వినియోగదారులు ప్రత్యేకమైన, ప్రయోగాత్మక అదనపు ఫీచర్‌లను పొందుతారని Snap ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. "ఈ సబ్‌స్క్రిప్షన్ మా కమ్యూనిటీలోని కొంతమంది అత్యంత ఉద్వేగభరితమైన సభ్యులకు కొత్త స్నాప్‌చాట్ ఫీచర్‌లను అందించడానికి అనుమతిస్తుంది మరియు ప్రాధాన్య మద్దతును అందించడానికి మమ్మల్ని అనుమతిస్తుంది" అని కంపెనీ గ‌తంలో తెలిపింది.

Best Mobiles in India

English summary
Snapchat Dual Camera Feature Launched, to Let Users Record Content Using Front, Back Snappers Simultaneously

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X