Snapchat ప్రీమియంతో Snapchat+ గా మార‌నుందా? స‌బ్‌స్క్రిప్ష‌న్ వివ‌రాలేంటి!

|

ఇటీవ‌లి కాలంలో ర‌క‌ర‌కాల సోష‌ల్ మీడియా యాప్‌లు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అందులో భాగంగా Snapchat అనే సోష‌ల్ మీడియా యాప్ కూడా వినియోగ‌దారుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం మ‌న దేశంలోని యువ‌త చాలా వ‌ర‌కు ఈ యాప్ బాగా అట్రాక్ట్ అయ్యార‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. యూత్ తాము ఎప్పుడు ఎక్క‌డ ఉన్నారు, ఏం చేస్తున్నార‌నే విష‌యాలు త‌మ మిత్రులు, లేదా కుటుంబ‌స‌భ్యుల‌తో పంచుకోవ‌డానికి ఈ Snapchat బాగా ఉప‌యోగ‌డుతోంది. ఈ క్ర‌మంలో దీని వినియోగం బాగా పెరిగింది.

Snapchat+ గా మార‌నుందా!

Snapchat+ గా మార‌నుందా!

ఇదిలాఉండ‌గా ఇప్పుడు Snapchat త‌మ యాప్‌లో మ‌రిన్ని అప్‌డేట్స్ తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అందులో భాగంగా సబ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్ తెచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు కంపెనీ వ‌ర్గాల నుంచి స‌మాచారం. ఈ స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్ ద్వారా యూజ‌ర్ల‌కు మ‌రిన్ని ఫీచ‌ర్ల‌ను వెసులుబాటు క‌ల్పించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్ ప్ర‌కారం ప్రీమియం చెల్లించిన వారికి మాత్ర‌మే ఆ ఫీచ‌ర్లు అంద‌నున్నాయి. దీని ప‌రిధిలోకి వ‌చ్చే యూజ‌ర్ల‌కు క‌స్ట‌మ్ స్నాప్‌చాట్ ఐకాన్స్‌తో పాటు ప్ర‌త్యేక‌మైన బ్యాడ్జ్ కూడా ల‌భించ‌నుంది. సంబంధిత డెవ‌ల‌ప‌ర్ త‌న ట్విట‌ర్ ద్వారా చేసిన‌ పోస్ట్ తో ఈ ఫీచ‌ర్ గురించి తొలిసారిగా బ‌య‌ట‌కు తెలిసింది. ఆయ‌న ట్వీట్ ప్ర‌కారం.. ఈ స్నాప్‌చాట్ ప్ల‌స్ (Snapchat+) ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ధ‌ర నెల‌కు రూ.370 (4.59యూరోలు) గా ఉండ‌నుంది.

Snapchat+ కు ఎంత చెల్లించాలి!

Snapchat+ కు ఎంత చెల్లించాలి!

డెవ‌ల‌ప‌ర్ చేసిన ట్వీట్ వివ‌రాలు ఇలా ఉన్నాయి. స్నాప్‌చాట్ ప్ల‌స్ (Snapchat+) ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ధ‌ర నెల‌కు 4.59యూరోలు (రూ.370) గా ఉంది. అదే ఆరు నెల‌ల స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్ అయితే 24.99యూరోలు (రూ.2000)గా ఉంది. ఇక ఏడాది స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్‌కు 45.99యూరోలు (రూ.3700) గా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే దీని విడుద‌ల‌కు ముందు కంపెనీ వినియోగ‌దారుల కోసం ఒక వారం ఉచిత ట్ర‌య‌ల్ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. ఒక‌సారి వినియోగ‌దారుడు స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకున్న త‌ర్వాత ఆటో రెన్యూవ‌ల్ స‌దుపాయాన్ని క‌ల్పించారు. అత‌ను క్యాన్స‌ల్ చేసుకునే వ‌ర‌కు ఆ ఆటో రెన్యూవ‌ల్ ఆప్ష‌న్ కొన‌సాగుతుంది.

భ‌ద్ర‌త‌కు లొకేష‌న్ షేర్ స‌దుపాయం..

భ‌ద్ర‌త‌కు లొకేష‌న్ షేర్ స‌దుపాయం..

ఇటీవ‌ల కూడా స్నాప్‌చాట్ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాం చాలా కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. ఈ కాలంలో మ‌న స‌న్నిహితుల‌ భద్రతకు(Security) ఎంతో అవసరమైన లొకేషన్‌(Location) షేర్‌(Share) చేసుకొనే సదుపాయాన్ని తీసుకొచ్చేసింది. క‌నీసం 15 నిమిషాల నుంచి కొన్ని గంట‌ల వ‌ర‌కు మీరు మీ లొకేష‌న్‌ను మీ తోటి వారితో పంచుకోవ‌చ్చు. ఈ ఆప్ష‌న్ ద్వారా మీ కుటుంబ‌స‌భ్యులు గానీ, మిత్రులు గానీ బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు వారు ఏదైనా ప్ర‌మాదంలో ప‌డితే.. ఆ లొకేష‌న్ షేరింగ్ ద్వారా వారు ఎక్క‌డ ఉన్నార‌నే విష‌యాన్ని మ‌నం సులువుగా తెలుసుకోవ‌డానికి మార్గం ఉంటుంది. అదే విధంగా యూట్యూబ్‌ మ్యూజిక్ ను షేర్‌ చేసుకొనే ఫీచర్‌ను కూడా వినియోగదారులకు అందిస్తోంది. అక్టోబరు నెలలో ఐఓఎస్‌ డివైజెస్‌లో (iOS Devises) యూట్యూబ్‌ మ్యూజిక్‌ను స్నాప్‌చాట్‌లో షేర్‌ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా ఈ సదుపాయం ఆండ్రాయిడ్‌ ఫోన్లపై(Android Phones)కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు 9టూ5గూగుల్‌ అనే సంస్థ ఓ నివేదికలో పేర్కొంది.

సేవ్ మెమోరీస్ బ్యాక‌ప్‌

సేవ్ మెమోరీస్ బ్యాక‌ప్‌

వినియోగ‌దారులు త‌మ జ్ఞాప‌కాల‌ను కోల్పోకుండా, వాటిని ప‌దిలంగా బ్యాక‌ప్ చేసుకోవ‌డానికి గ‌త ఏప్రిల్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. మెమోరీస్ బ్యాక‌ప్ పేరుతో ఈ ఆప్ష‌న్‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది. ఈ మెమోరీ బ్యాక‌ప్ స‌దుపాయాన్ని మీరు పొందాల‌నుకుంటే ఈ కింది ఇచ్చిన విధానాన్ని అనుస‌రించండి.
* ముందుగా మై ప్రొఫైల్‌లోకి వెళ్లి సెట్టింగ్స్ ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి.
* సెట్టింగ్స్ ట్యాబ్ ఓపెన్ అయిన త‌ర్వాత కింద‌కు స్క్రోల్ చేసి మెమోరీస్ ట్యాబ్ ఎంపిక చేసుకోవాలి.
* ఆ త‌ర్వాత చెక్ ది బ్యాక్అప్ ప్రొగ్రెస్ ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి. అనంత‌రం కంప్లీట్ అనే నోటిఫికేష‌న్ చూపిస్తే మీ మెమోరీ బ్యాక‌ప్ స‌క్సెస్ అయిన‌ట్లు నిర్దార‌ణ చేసుకోవాలి.
ఒక‌వేళ మీకు మెమోరీ బ్యాక‌ప్ కంప్లీట్ కాలేదు అని వ‌స్తే.. మీ డివైజ్ వైఫై స‌క్ర‌మంగా ఉందో లేదో చూసుకోవాలి.

స్నాప్, షేర్‌చాట్ (మోజ్‌) భాగ‌స్వామ్యం..

స్నాప్, షేర్‌చాట్ (మోజ్‌) భాగ‌స్వామ్యం..

ఇప్ప‌టికే స్నాప్‌చాట్ త‌మ ఏఆర్ కెమెరా కిట్ (MX TakaTak) ఇంటిగ్రేష‌న్‌లో భాగంగా షేర్‌చాట్‌(మోజ్‌తో) భాగ‌స్వామ్యం ఏర్ప‌ర‌చుకున్న విష‌యం తెలిసిందే. స్నాప్‌చాట్ ఆగ్‌మెంట్ రియాలిటీ టెక్నాల‌జీ సాయంతో MX TakaTak యాప్ ఇప్పుడు కొత్త కెమెరా అనుభూతిని క‌ల్పిస్తోంది.

Best Mobiles in India

English summary
Snapchat reportedly working on subscription plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X