ఆర్డర్ చేస్తే డబ్బులు ఇంటికి తెచ్చిస్తాం : స్నాప్‌డీల్

పెద్ద నోట్ల ఉపసంహరణ తరువాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ మార్కెట్‌ ప్లేస్ స్నాప్‌డీల్ Cash@Home పేరుతో సరికొత్త సర్వీసును మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ సర్వీసులో భాగంగా యూజర్ రూ.2000 వరకు నగదును ఆర్డర్ చేసే వీలుంటుంది. ఈ సర్వీసులో భాగంగా క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయాన్ని కూడా స్నాప్‌డీల్ కల్సిస్తోంది.

Read More : ఫోన్‌లో బంగారం ఎక్కడుంటుంది?, ఎలా బయటకు తీస్తారు?

ఆర్డర్ చేస్తే డబ్బులు ఇంటికి తెచ్చిస్తాం : స్నాప్‌డీల్

ఆర్డర్ చేసిన డబ్బును స్నాప్‌డీల్ డెలివరీ సిబ్బంది నేరుగా ఇంటికే డెలివరీ చేస్తారు. వాళ్ల వెంట తీసుకువచ్చే PoS మెచీన్‌లలో మీ ఏటీఎమ్ కార్డులను స్వైప్ చేయటం ద్వారా డబ్బులు చెల్లించవచ్చు.

ఆర్డర్ చేస్తే డబ్బులు ఇంటికి తెచ్చిస్తాం : స్నాప్‌డీల్

Read More : బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ!

సౌలభ్య రుసుము క్రింద మీ నుంచి రూ.1 మాత్రమే ఛార్జ్ చేస్తారు. మీ డెబిట్ కార్డును ఉపయోగించుకుని Freecharge ద్వారా కూడా స్నాప్‌డీల్‌కు నగదు చెల్లించవచ్చు. ప్రస్తుతానికి ఈ సర్వీస్ గురుగ్రామ్ ఇంకా బెంగుళూరు నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో మరిన్ని నగరాల్లో ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్నాప్ డీల్ సహ వ్యవస్థాపకులు రోహిత్ బన్సాల్ తెలిపారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Snapdeal to deliver cash at your doorstep. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot