600 మంది ఉద్యోగులపై స్నాప్‌డీల్ వేటు : పీకే మహత్యమేనా..

Written By:

అమీర్ ఖాన్‌ వ్యాఖ్యలతో లేనిపోని చిక్కుల్లో ఇరుక్కున్న స్నాప్‌డీల్ తాజాగా మరో వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఇప్పటికే అమీర్ ఖాన్ ని బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తొలగించి సర్దుకుంటున్న సమయంలో ఉద్యోగులపై వేటు అంటూ మరో కొత్త వివాదానికి తెరలేపింది. తాజాగా ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హలచల్ చేస్తోంది. దీనికి తోడు కంపెనీ ఉద్యోగులు గుర్ గావ్ లోని సంస్థ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం కూడా ఈ అనుమానాలకు మరింత బలానిచ్చినట్లయింది.

Read more: మళ్లీ పంచ్ పడింది : పీకేకి షాకిచ్చిన స్నాప్‌డీల్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దాదాపు 600 మంది ఉద్యోగులపై వేటు వేసిందనే వార్త

పాత వివాదం సద్దుమణగకముందే ప్రముఖ ఆన్లైన్ విక్రయ సంస్థ స్నాప్‌డీల్ మరో వివాదంలో ఇరుక్కుంది. దాదాపు 600 మంది ఉద్యోగులపై వేటు వేసిందనే వార్త .. సోషల్ మీడియాలో భగ్గుమంది.

మరో 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు

మరో 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైందన్న వార్తలు నెట్లో గుప్పుమన్నాయి. ఉద్యోగుల పూర్ పెర్ ఫార్మెన్స్ కారణంగా స్నాప్‌డీల్ మరికొంతమంది ఉద్యోగులకు పింక్ స్లిప్పులను జారీ చేసిందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.

కంపెనీకి చెందిన కొంతమంది ఉద్యోగులు

ఇదిలా ఉంటే కంపెనీకి చెందిన కొంతమంది ఉద్యోగులు గుర్గావ్‌లోని సంస్థ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు.

కంపెనీ నష్టాల ప్రభావం సిబ్బందిపై భారీగా పడనుందనే ఆందోళన

దీంతో సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు మరింత బలం చేకూరింది. ఎంతమంది ఉద్యోగులను తొలగించారనే దానిపై స్పష్టత రానప్పటికీ ... ఇటీవలి కంపెనీ నష్టాల ప్రభావం సిబ్బందిపై భారీగా పడనుందనే ఆందోళన చెలరేగింది.

సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై స్నాప్‌డీల్

అయితే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై స్నాప్‌డీల్ స్పందించింది. పనితనంలో మెరుగుదల కోసం శిక్షణా కార్యక్రమాలను చేపట్టామని వెల్లడించింది. మరి కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేశారని పేర్కొంది.

అప్పట్లో అమీర్ ఖాన్ వ్యాఖ్యల అనంతరం

కాగా అప్పట్లో అమీర్ ఖాన్ వ్యాఖ్యల అనంతరం నెటిజన్లు ఆయన ప్రచారం చేస్తున్న స్నాప్ డీల్ బహిష్కరించాలనే ప్రచారం లేవనెత్తింది.

అమిర్ వ్యాఖ్యలపై వేగంగా స్పందించిన నెటిజన్లు

అమిర్ వ్యాఖ్యలపై వేగంగా స్పందించిన నెటిజన్లు తమ మొబైల్ ఫోన్లలోని స్నాప్ డీల్ యాప్ నువాపస్ చేయడంతో పాటు సదరు యాప్ రేటింగ్ ను బాగా తగ్గించేశారు.

మీ బ్రాండ్ అంబాసిడర్ దేశద్రోహి

మీ బ్రాండ్ అంబాసిడర్ దేశద్రోహి ఆ ద్రోహిని తొలగించేదాకా మా యాప్ ద్వారానే కాక సైట్ ద్వారా కూడా వస్తువులను కొనుగోలు చేయం అని నెటిజన్లు తెగేసి చెప్పారు.

అమిర్ వ్యాఖ్యలతో తమకేమి సంబంధం లేదని

అమిర్ వ్యాఖ్యలతో తమకేమి సంబంధం లేదని స్నాప్ డీల్ ప్రకటించినా నెటిజన్ల ఆగ్రహం చల్లారలేదు. దీంతో సంస్థ భారీ నష్టాలను మూటగట్టుకుంది.

ఈ పరిణామాల నేపథ్యంలో

ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కొనసాగితే మరింత నష్టం తప్పదనే భావనతో అమీర్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు మళ్లీ ఉద్యోగుల వేటుతో ఏం జరుగుతుందో చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Snapdeal lay off reports go viral on social media
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot