ఫ్లిప్‌కార్ట్‌కి భారీ షాకిస్తున్న స్నాప్‌డీల్

Written By:

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న ఫ్లిప్‌కార్ట్‌కి భారీ షాక్ తగిలింది. స్నాప్‌డీల్‌ ఫ్లిప్‌కార్ట్‌ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించి, మరో కంపెనీకి చేయి అందిస్తోంది. కొనుగోలుకు తక్కువ విలువ కడుతున్న ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌కు నో చెప్పిన స్నాప్‌డీల్‌, ఇక ఫ్లిప్‌కార్ట్‌కు అమ్మడం కంటే, మరో కంపెనీతో జతకట్టడమే మంచిదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పబ్లిక్‌గా లిస్టు అయిన ఒకే ఒక్క ఈ-కామర్స్‌ కంపెనీగా పేరున్న ఇన్ఫీబీమ్‌తో స్నాప్‌డీల్‌ విలీన చర్చలు జరుపుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి.

జియోపై దాడి, ఎయిర్‌టెల్ అదిరే ఆఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండింటి మధ్య డీల్‌

ఈ రెండింటి మధ్య డీల్‌ 1 బిలియన్‌ డాలర్ల(రూ.6446కోట్లకు పైగా)కు కుదురుతున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేసిన

గతవారమే ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేసిన 700-750 మిలియన్‌ డాలర్ల డీల్‌ను స్నాప్‌డీల్‌ బోర్డు తిరస్కరించింది.

900-950 మిలియన్‌ డాలర్లకు

ఆఫర్‌ను స్నాప్‌డీల్‌ తిరస్కరించడంతో మరోసారి ఆ కంపెనీకి 900-950 మిలియన్‌ డాలర్లకు విలువకట్టాలని మరోవైపు నుంచి ఫ్లిప్‌కార్ట్‌ చూస్తోంది. కానీ స్నాప్‌డీల్‌, ఇన్ఫీబీమ్‌తో చర్చలు సాగిస్తోంది.

స్నాప్‌డీల్‌ రాకతో

ప్రస్తుతం ఇన్ఫీబీమ్ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.6106 కోట్లగా ఉంది. స్నాప్‌డీల్‌ రాకతో వీటి విలీన సంస్థ 2 బిలియన్‌ సంస్థగా అవతరించనుంది.

ఈ డీల్‌లో

అయితే ఈ డీల్‌లో స్నాప్‌డీల్‌ లాజిస్టిక్‌ బిజినెస్‌లు వుల్కాన్‌ ఎక్స్‌ప్రెస్(లాజిస్టిక్‌ విభాగం)‌, పేమెంట్స్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రీఛార్జ్‌లను కలుపడం లేదని తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Snapdeal may merge with Infibeam to create $2 billion company Read More at gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot