పెద్ద నోట్ల రద్దు.. స్నాప్‌డీల్ కొత్త ఆఫర్

మోదీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు చేసిన నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ స్నాప్‌డీల్ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. వాలెట్ ఆన్ డెలివరీ పేరుతో Snapdeal ఇప్పటికే పేమెంట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ వాలెట్ ఆప్షన్ ద్వారా అన్ని రకాల క్రెడిట్, డెబిట్ కార్డుల పై 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నట్లు స్నాప్‌డీల్ తెలిపింది.

Read More : నెట్ బ్యాంకింగ్ చేస్తున్నారా..? జరభద్రం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.5,000 కొనుగోలు పై రూ.500 డిస్కౌంట్

ఈ సర్వీసును ఉపయోగించుకోవటం ద్వారా రూ.5,000 కొనుగోలు పై రూ.500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ నవంబర్ 10వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్నాప్‌డీల్ తెలిపింది.

దూసుకుపోతున్న పేటీఎమ్

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ కంపెనీలలో ఒకటైన పేటీఎమ్ 400 శాతం ట్రాఫిక్ పెరిగినట్లు తెలుస్తోంది.

'Paytm on Delivery'

స్నాప్‌డీల్ వాలెట్ ఆన్ డెలివరీ తరహాలోనే పేటీఎమ్ కూడా 'Paytm on Delivery' ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పేటీఎమ్ యూజర్లు ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఆన్‌లైన్ చెల్లింపుల పై తక్షణ డిస్కౌంట్‌లను పొందే అవకాశం ఉంటుంది.

అమెజాన్ క్యాష్ ఆన్ డెలివరీ నిలిపివేత

పెద్ద నోట్ల రద్దు తరువాత అమెజాన్ క్యాష్ ఆన్ డెలివరీ ప్రక్రియను పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.2000 వరకే

ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి సంస్థలు రూ.2,000 వరకు విలువ చేసే వస్తువుల పై మాత్రమ క్యాష్ ఆన్ డెలివరీని అనుమతిస్తున్నాయి.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Rs.500, 1000 Notes Banned: Snapdeal Offers 10 Percent Instant Discount on All Card Transactions. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot