స్నాప్‌డీల్ సూపర్ ఫాస్ట్ డెలివరీ..సేవలన్నీ ఒకే చోట..

Written By:

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థల కన్నా వేగంగా వస్తువులను డెలివరీ చేయడానికి 'స్నాప్‌డీల్' సిద్ధమయ్యింది. అందులో భాగంగా ఆరు కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాం తంలో మూడు, లక్నో, హైదరాబాద్, కోల్‌కతాలలో ఒకటి చొప్పున హబ్‌లను ఏర్పాటు చేసింది. అయితే ఈ హబ్‌ల ఏర్పాటు కోసం ఎంత మొత్తాన్ని వెచ్చించిందనేది మాత్రం వెల్లడించలేదు. రానున్న పండుగ సీజన్ పురస్కరించుకుని ఈ హబ్ లను ప్రారంభించనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొనుగోలుదారునికి అన్ని సేవలు ఒకే చోట లభించేలా ఈ హబ్ లను ఏర్పాటు చేయనున్నారు.

చిక్కుల్లో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్నాప్‌డీల్ సూపర్ ఫాస్ట్ డెలివరీ..సేవలన్నీ ఒకే చోట..

10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ గిడ్డంగిలో నాణ్యత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక వసతి, కొనుగోలుదారులకోసం రవాణా వ్యవస్థను సైతం ఏర్పాటు చేసింది.

స్నాప్‌డీల్ సూపర్ ఫాస్ట్ డెలివరీ..సేవలన్నీ ఒకే చోట..

స్టాకులను భద్రపరుచడం, నాణ్యతపై తనిఖీ, సరుకు రవాణా వ్యవస్థలను ఒకే తాటిపైకి తేవడానికి ఈ గిడ్డంగులను ఏర్పాటు చేసింది.

స్నాప్‌డీల్ సూపర్ ఫాస్ట్ డెలివరీ..సేవలన్నీ ఒకే చోట..

వీటివల్ల విక్రయదారుల నిర్వహణ ఖర్చులు తగ్గడంతోపాటు కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి వీలు పడుతుందని కంపెనీ వెల్లడించింది.

స్నాప్‌డీల్ సూపర్ ఫాస్ట్ డెలివరీ..సేవలన్నీ ఒకే చోట..

ఈ ఆరు హబ్‌లను స్నాప్‌డీల్‌కు చెందిన పూర్తి అనుబంధ కంపెనీ ‘వెల్‌కన్ ఎక్స్‌ప్రెస్' ఏర్పాటు చేసింది. ఉత్పత్తుల స్వీకరణ, వాటి నాణ్యతా పరీక్ష, డెలివరీకి సిద్ధం చేయడం, రిటర్న్ వస్తువుల పరిశీలన వంటి పనులన్నీ వీటిల్లో జరుగుతాయని కంపెనీ తెలియజేసింది.

స్నాప్‌డీల్ సూపర్ ఫాస్ట్ డెలివరీ..సేవలన్నీ ఒకే చోట..

స్నాప్‌డీల్‌కు చెందిన 100 శాతం సబ్సిడరీ సంస్థయైన వల్కన్ ఎక్స్‌ప్రెస్ ఈ ఆరు సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే వల్కన్ దేశవ్యాప్తంగా 10 సెంటర్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

స్నాప్‌డీల్ సూపర్ ఫాస్ట్ డెలివరీ..సేవలన్నీ ఒకే చోట..

జైపూర్, ముంబై, అహ్మదాబాద్, చెన్నైలలో ఏర్పాటు చేసిన గిడ్డంగులతోపాటు ఇతర వర్గాలకు చెందిన 69 గిడ్డంగులను సైతం సంస్థ వినియోగించుకొని వినియోగదారులకు సేవలను అందిస్తున్నది.

స్నాప్‌డీల్ సూపర్ ఫాస్ట్ డెలివరీ..సేవలన్నీ ఒకే చోట..

వినియోగదారుల కోసం ఇటీవల సూపర్-ఫాస్ట్ డెలివరీ పథకానికి శ్రీకారం చుట్టిన సంస్థ అందుకు తగ్గట్టుగానే పలు కీలక చర్యలు తీసుకుంటున్నట్లు స్నాప్‌డీల్ చీఫ్ కస్టమర్ జయంత్ సూద్ తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Snapdeal Opens 6 Logistics Hubs to Boost Delivery Operations
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot