ఇకపై మీ ఇంటికే జియో సిమ్, డెలివరీ చేయనున్న స్నాప్‌డీల్

Written By:

రిలయన్స్ జియో సిమ్‌ల కోసం ఇప్పటికే చాలామంది ఎదురుచూస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఉచిత ఆఫర్లు ఊరిస్తుండటంతో అందరూ జియో వెంట పరుగులు పెడుతున్నారు. అయితే జియో సిమ్ లు ఇకపై నేరుగా ఇంటికే రానున్నాయి. యాక్టివేషన్ కూడా ఇంటి దగ్గరే జరిగిపోనుంది. మీరు చేయాల్సిందల్లా మీ వివరాలను స్నాప్‌డీల్‌లో ఎంటర్ చేస్తే చాలు.

జియోకి ఉచిత ఆఫర్ తిప్పలు, రేపటిలోగా స్పందన

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్నాప్‌డీల్‌తో ఒప్పందం

ఇప్పుడు జియో సిమ్ నేరుగా ఇంటికే తీసుకొచ్చేలా రిలయన్స్ సంస్థ ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

వెల్ కమ్ పేరిట ఒక కొత్త ఆఫర్ ను

ఈ ఒప్పందంలో భాగంగా 'స్నాప్ డీల్' వెల్ కమ్ పేరిట ఒక కొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టనుంది. ఈ ఆఫర్ అధికారికంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఈ ఆఫర్ ద్వారా రిలయన్స్ సంస్థ 'జియో' సిమ్ ను వినియోగదారుల ఇళ్లకే ఉచితంగా పంపనుంది.

సిమ్ యాక్టివేషన్ ప్రక్రియను కూడా

దీంతోపాటు సిమ్ యాక్టివేషన్ ప్రక్రియను కూడా వారే పూర్తి చేయనున్నారు. ఇందుకుగాను, ముందుగా తమ పూర్తి చిరునామాను 'స్నాప్ డీల్'లో పొందుపరచాలి.

డెలివరీ చేసే సమయంలో

జియో సిమ్ ను డెలివరీ చేసే సమయంలో సంబంధిత ఆధార్ కార్డు వివరాలను సంస్థ ప్రతినిధికి సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. ఆ తరవాత అందరికీ అందుబాటులో తేనున్నట్లు తెలుస్తోంది.

పూర్తి అడ్రస్ ను

తమ పూర్తి అడ్రస్ ను ఇప్పటికే పొందుపరచిన వినియోగదారులకు 'స్నాప్ డీల్' ఈ-మెయిల్స్ పంపిస్తోంది. ఈ ఆఫర్ అధికారికంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Snapdeal will now home-deliver Reliance Jio SIM cards: All you need to know read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot