స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 వచ్చేసింది.. ఇకపై మిడ్-రేంజ్ మొబైల్స్‌లోనూ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. టాప్-ఎండ్ పర్ఫామెన్స్
Snapdragon 6 Gen 4: క్వాల్‌కామ్ సంస్థ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ల కోసం సరికొత్త స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను విడుదల చేసింది. ఇది మిడ్-రేంజ్ ఫోన్ల ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించబోతోంది. ఈ కొత్త చిప్‌సెట్ పనితీరులోనూ, గేమింగ్‌లోనూ, కృత్రిమ మేధస్సు (AI) ఫీచర్లలోనూ, కెమెరా క్వాలిటీలోనూ, బ్యాటరీ లైఫ్‌లోనూ అద్భుతమైన మార్పులు తీసుకురానుంది. ఇప్పటిదాకా టాప్-ఎండ్ ఫోన్లలో మాత్రమే కనిపించే ఫీచర్లను ఇప్పుడు మీ బడ్జెట్ ఫోన్లలో కూడా చూడొచ్చు.
* నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్, అదిరిపోయే ఎఫిషియెన్సీ
రీయల్‌మీ, ఒప్పో, హానర్ లాంటి బ్రాండ్లు ఈ చిప్‌సెట్‌ను వాడేందుకు సిద్ధమవుతున్నాయి. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్ తయారీలో TSMC కంపెనీ లేటెస్ట్ 4nm టెక్నాలజీని వాడింది. దీనివల్ల చిప్ చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది, అదే సమయంలో బ్యాటరీ కూడా ఎక్కువసేపు వస్తుంది.

ఇందులో ARMv9 ఆర్కిటెక్చర్ కలిగిన CPU కోర్లు ఉన్నాయి. ఒక Cortex-A720 (2.3GHz) ప్రైమ్ కోర్, మూడు A720 (2.2GHz) పెద్ద కోర్లు, నాలుగు Cortex-A520 (1.8GHz) ఎఫిషియెన్సీ కోర్లు ఉన్నాయి. ఇంతకుముందు ARMv8 డిజైన్లను వాడేవారు, కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీతో CPU పనితీరు ఏకంగా 11% పెరిగింది.
* గ్రాఫిక్స్
అడ్రినో GPU ఏకంగా 29% ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. గేమ్స్, వీడియోల పిక్చర్ క్వాలిటీ అదిరిపోతుంది. అంతేకాదు, పవర్ ఎఫిషియెన్సీ కూడా 12% పెరిగింది. ఈ ప్రాసెసర్ 16GB వరకు LPDDR5 RAM (3,200MHz), UFS 3.1 స్టోరేజ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంటే మల్టీ టాస్కింగ్ చేసినా, డేటా ట్రాన్స్‌ఫర్ చేసినా స్మూత్‌గా సాగిపోతుంది.
* గేమింగ్ విజువల్స్ కిర్రాక్
స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్ కన్సోల్ గేమ్స్‌లో ఉండే క్వాలిటీ విజువల్స్‌ను మొబైల్‌లోనే అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ గేమ్ సూపర్ రెజల్యూషన్ టెక్నాలజీతో గ్రాఫిక్స్‌ను 4Kకి అప్‌స్కేల్ చేస్తుంది, అయినా గేమ్ మాత్రం స్మూత్‌గా ఆడుకోవచ్చు. అడ్రినో HDR ఫాస్ట్ బ్లెండ్ టెక్నాలజీ క్లిష్టమైన సీన్లను కూడా రెండింతలు వేగంగా రెండర్ చేస్తుంది.
అడ్రినో ఫ్రేమ్ మోషన్ ఇంజన్ ఫ్రేమ్ రేట్‌లను డబుల్ చేస్తుంది, కానీ పవర్ మాత్రం ఎక్కువ వాడదు. ఈ చిప్‌సెట్ 1080p+ డిస్‌ప్లేలలో 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌ను పెద్ద స్క్రీన్‌కు కనెక్ట్ చేసుకోవాలంటే, 4K @ 60Hz HDR10+ వరకు ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లేను కూడా సపోర్ట్ చేస్తుంది.
* AI స్మార్ట్ ఫీచర్లు
స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4లో AI టెక్నాలజీ ఒక ప్రత్యేక ఆకర్షణ. స్నాప్‌డ్రాగన్ 6 సిరీస్‌లో మొదటిసారిగా INT4 AI సపోర్ట్ వచ్చింది. దీనివల్ల వాయిస్ అసిస్టెంట్లు మరింత స్మార్ట్‌గా పనిచేస్తాయి, నాయిస్ క్యాన్సిలేషన్ ఇంకా బాగా పనిచేస్తుంది, కంటెంట్ సమ్మరైజేషన్ ఈజీ అవుతుంది.
AI బేస్డ్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ వల్ల ఫోన్‌లో మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తికి మీ వాయిస్ చాలా క్లియర్‌గా వినిపిస్తుంది. అంతేకాదు, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ పవర్ యూసేజ్‌ను ఆప్టిమైజ్ చేస్తాయి, AI ఫీచర్లు వాడేటప్పుడు బ్యాటరీ ఎక్కువసేపు వచ్చేలా చేస్తాయి.
* కెమెరా క్వాలిటీ నెక్స్ట్ లెవెల్
స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్ 200MP సింగిల్-షాట్ ఫొటోగ్రఫీని సపోర్ట్ చేస్తుంది. ఫొటోలు ఎంత జూమ్ చేసినా క్లారిటీ మిస్ అవ్వదు. ట్రిపుల్ ISP (ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్) టెక్నాలజీతో ఒకేసారి ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేసినా ఫోన్ స్లో అవ్వదు. లో-లైట్‌లోనూ ఫొటోలు, వీడియోలు చాలా బాగా వచ్చేలా ఆప్టిమైజేషన్ చేశారు.
* లాస్‌లెస్ ఆడియో
స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 స్టూడియో క్వాలిటీ ఆడియోను అందిస్తుంది. క్వాల్‌కామ్ aptX™ లాస్‌లెస్ టెక్నాలజీతో బ్లూటూత్ సౌండ్ క్వాలిటీ అదిరిపోతుంది. స్నాప్‌డ్రాగన్ సౌండ్™ లేటెన్సీని తగ్గిస్తుంది, గేమింగ్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇంకా LE ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల ఒకేసారి చాలా డివైజ్‌లకు మ్యూజిక్ స్ట్రీమ్ చేయొచ్చు.
* ఫాస్ట్ 5G, వై-ఫై 6E కనెక్టివిటీ..
స్నాప్‌డ్రాగన్ 5G మోడెమ్-RFతో కనెక్టివిటీ స్పీడ్ కూడా పెరిగింది. 5G స్పీడ్స్ ఫాస్ట్‌గా ఉంటాయి, నెట్‌వర్క్ కవరేజ్ కూడా బాగుంటుంది. ట్రిపుల్ ఫ్రీక్వెన్సీ GPS (L1/L5/L2) ఉండటం వల్ల లొకేషన్ ట్రాకింగ్ చాలా కచ్చితంగా ఉంటుంది. వై-ఫై 6E సపోర్ట్ ఉండటంతో ఇంటర్నెట్ కనెక్షన్ చాలా ఫాస్ట్‌గా, స్టేబుల్‌గా ఉంటుంది.
* మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లకు గేమ్ ఛేంజర్
టాప్-ఎండ్ ఫోన్లకు ఉండే ఫీచర్లు, AI టెక్నాలజీ, అదిరిపోయే గేమింగ్, కెమెరా ఫీచర్లు... అన్నీ కలిపి స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. గేమర్, కంటెంట్ క్రియేటర్, రెగ్యులర్ యూజర్ ఎవరికైనా ఈ ప్రాసెసర్ స్పీడ్, ఎఫిషియెన్సీ, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.


Click it and Unblock the Notifications








