Home
News

త్వరలో ఆండ్రాయిడ్‌ ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లు.. అది కూడా బడ్జెట్‌ రేంజ్‌లో..!

ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ అంటే స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్‌లు మాత్రమే గుర్తొచ్చేవి. అయితే త్వరలో ఆండ్రాయిడ్‌ OS తో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు కూడా రానున్నాయి. ఈ విషయాన్ని టెక్‌ దిగ్గజం గూగుల్‌ ధ్రువీకరించింది. స్నాప్‌డ్రాగన్‌ సమ్మిట్‌ 2025 లో (Snapdragon Summit 2025) గూగుల్‌ డివైజ్ మరియు సర్వీస్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రిక్‌ ఓస్టర్లోహ్‌ చెప్పారు. క్వాల్‌కాం CEO క్రిస్టియానో అమోన్‌తో కలిగి ఆయన పాల్గొన్నారు.

ప్రస్తుతం వేర్వేరు ప్లాట్‌ఫాంలు :
గూగుల్‌ ఇప్పటి వరకు వేర్వేరు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఆండ్రాయిడ్ OS, అదే ల్యాప్‌టాప్‌ల కోసం క్రోమ్‌ OS ను ఉపయోగిస్తోంది. అయితే క్వాల్‌కామ్ భాగస్వామ్యంతో గూగుల్‌ ప్రత్యేకమైన ప్లాట్‌ఫాంను (Google Android Laptops) క్రియేట్‌ చేయనున్నట్లు చెబుతోంది.

Google Confirms android laptops and desktops soon

ఏకీకృత ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫాం :
ఈ ఏకీకృత ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫాంపై ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లు పనిచేయనున్నాయని గూగుల్‌ సీనియర్‌ వైస్ ప్రెసిడెంట్‌ రిక్‌ ఓస్టర్లోహ్‌ చెప్పారు. ఇందులో క్వాల్‌కాంకు చెందిన స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ ఉపయోగించే వీలుందని తెలుస్తోంది. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొబిలిటీ కోసం తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కీలక పాత్ర పోషిస్తుందా? :
గూగుల్‌, స్నాప్‌డ్రాగన్ భాగస్వామ్యంతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న ఏకీకృత ప్లాట్‌ఫాం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ కీలక పా‌త్ర పోషిస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గూగుల్‌ జెమిని AI మోడల్‌తోపాటు సంబంధిత యాప్‌లను ఈ కొత్త ప్లాట్‌ఫాంతో అనుసంధానం చేస్తారని తెలుస్తోంది.

బడ్జెట్‌ సెగ్మెంటే టార్గెట్‌గా? :
క్రోమ్‌బుక్‌ తరహాలోనే బడ్జెట్‌ ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ల లక్ష్యంగా ఈ కొత్త ప్లాట్‌ఫాంను తీసుకొస్తున్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు. దీని వల్ల యూజర్లకు కూడా ఉపయోగం ఉంటుందని, మరియు డెవలపర్‌లకు కూడా కొత్త అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం? :
దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో పిక్సల్ బ్రాండ్‌తో ఆండ్రాయిడ్‌ ల్యాప్‌టాప్‌లు విడుదల చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఏఐ, క్వాల్‌కాం టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కొత్త డివైజ్‌లను తీసుకురావడం దీని వెనుకున్న లక్ష్యంగా తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇటీవలే గూగుల్‌ నుంచి అనేక ఉత్పత్తుల విడుదల :
గత నెలలో మేడ్ బై గూగుల్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఇందులో గూగుల్ పిక్సల్‌ 10 సిరీస్‌, గూగుల్‌ పిక్సల్‌ బడ్స్‌ 2a, పిక్సల్‌ బడ్స్‌ ప్రో 2, పిక్సల్‌ వాచ్ 4 విడుదల అయ్యాయి. పిక్సల్ 10 సిరీస్‌లో భాగంగా పిక్సల్‌ 10, పిక్సల్ 10 ప్రో, పిక్సల్‌ 10 ప్రో XL, గూగుల్‌ పిక్సల్‌ 10 ప్రో ఫోల్డ్‌ మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ సిరీస్‌ సేల్‌ కూడా ప్రారంభం అయింది. గత సిరీస్‌తో పోలిస్తే అనేక అప్‌గ్రేడ్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చింది. టెన్సార్‌ G5, టైటాన్‌ M2 సెక్యూరిటీ చిప్‌తో ఈ సిరీస్‌ లాంచ్ అయింది. ఈ సిరీస్‌ 7 సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్‌, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Snapdragon Summit 2025 Google Confirms android laptops and desktops soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X