Home
News

ఢిల్లీలో 3 అమ్మాయిల పై దాడి చేసిన గుర్తు తెలియని దుండగలు

దేశ రాజధాని ఢిల్లీలో ఆడవాళ్లకు భద్రతలేదని మరో సారి తేలిపోయింది. నడి రోడ్డు పై కొందరు గుర్తు తెలియని దుండగలు 3 అమ్మాయిల పై దాడి చేసి వారి వద్ద ఉన్న మొబైల్స్ మరియు డబ్బులు లాక్కొని వెళ్లిపోయారు.

By Anil

దేశ రాజధాని ఢిల్లీలో ఆడవాళ్లకు భద్రతలేదని మరో సారి తేలిపోయింది. నడి రోడ్డు పై కొందరు గుర్తు తెలియని దుండగలు 3 అమ్మాయిల పై దాడి చేసి వారి వద్ద ఉన్న మొబైల్స్ మరియు డబ్బులు లాక్కొని వెళ్లిపోయారు. ఈ ఘటన ఢిల్లీ లోని Mahindra Park ఏరియా దగ్గర రెండు రోజుల క్రితం చోటు చేసుకుంది. ముగ్గురు అమ్మాయిలకి తీవ్రంగా గాయపడ్డారు. ఆ సంఘటన చూసిన కొందరు వ్యక్తులు ఆ అమ్మాయిలని సమీపంలో ఉండే బాబా జగ్జివన్ రామ్ ఆసుపత్రికి తరలించారు.ఈ విషాద సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే...

సర్వోదయ సీనియర్ సెకండరీ స్కూల్ లో చదువుతున్నారు....

సర్వోదయ సీనియర్ సెకండరీ స్కూల్ లో చదువుతున్నారు....

గాయపడిన అమ్మాయిలు జహంగీర్పూరి , సర్వోదయ సీనియర్ సెకండరీ స్కూల్ లో చదువుతున్నారు.అందులో ఇద్దరు అమ్మాయిలు 9 వ తరగతి కాగా మరొక అమ్మాయి 8 వ తరగతి చదువుతుంది. స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్తుండగా....

స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్తుండగా....

స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని దుండగలు వచ్చి ఈ 3 అమ్మాయిల పై దాడి చేసి వారి వద్ద ఉన్న మొబైల్స్ మరియు డబ్బులు లాక్కొని వెళ్లిపోయారు.

తీవ్ర గాయాలు...

తీవ్ర గాయాలు...

అందులో ఇద్దరి అమ్మాయిలకు ఛాతి దగ్గర మరొక అమ్మాయికి చేయి పై తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ సంఘటన చూసిన కొందరి వ్యక్తులు....

ఈ సంఘటన చూసిన కొందరి వ్యక్తులు....

ఈ సంఘటన చూసిన కొందరు వ్యక్తులు వెంటనే ఆ అమ్మాయిల్ని సమీపంలో ఉన్న బాబా జగ్జివన్ రామ్ హాస్పిటల్ కి తరలించారు.అయితే అక్కడి హాస్పిటల్ సిబ్బంది మరొక హాస్పిటల్ అయిన సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ హాస్పిటల్ ని రెఫెర్ చేయగ ఆ హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు.

FIR ఫైల్ చేసిన పోలీసులు....

FIR ఫైల్ చేసిన పోలీసులు....

FIR ఫైల్ చేసిన పోలీసులు ఆ ఏరియా యొక్క CCTV కెమెరాలో రికార్డు ఆధారంగా దుండగులను పట్టుకుంటామని తెలిపారు.

 

 

Best Mobiles in India

English summary
Snatchers stab three school girls in Delhi.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X