సిగరెట్స్, మద్యం కంటే డేంజర్ 'సోషల్ మీడియా'

Posted By: Super

సిగరెట్స్, మద్యం కంటే డేంజర్ 'సోషల్ మీడియా'

 

సోషల్ మీడియా యువతను వ్యసనంలా పట్టుకుంటుందని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఐతే దీనిని బలపరుస్తూ ఇటీవల  ఓ ఆన్‌లైన్ మీడియా కొన్ని నిజాలను తెలియచేసింది. ఈ ఆన్‌లైన్ సర్వేలో వెల్లడైన నిజాల ప్రకారం యువత సిగరెట్లు, ఆల్కహాల్ కంటే కూడా సోషల్ మీడియాకు పెద్ద వ్యసన పరులుగా తయారయ్యారని తెలిపింది. ఈ విషయం అందరిని షాకింగ్‌కి గురి చేసింది.

18 నుండి 25 సంవత్సరాల మద్య గల కొంత మంది యువకులతో ఈ రీసెర్చ్ సంస్ద సర్వేని నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గోన్న యువత అంతా రోజుకీ 18 గంటల పాటు సోషల్ మీడియాని ఉపయోగించడమే కాకుండా.. సోషల్ మీడియా లేకుండా తాము ఉండలేక పోతున్నామని తెలిపారు. దీంతో యువతలో మానసిక రుగ్మతలు పెంచి,  ఏకాగ్రత స్థాయి తగ్గిస్తుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.

 

ఈ పరిశోధనలో వెల్లడైన మరో నిజం ఏమిటంటే ఫేస్‌బుక్ అప్‌డేట్ స్టేటస్ మద్యం సేవించడం మాదిరి తయారైందని వాపోయారు. సాధారణంగా మనుషులకు  మద్యం తాగ్రడం, ధూమపానం వంటి ఇతర కోరికల మాదిరే ఫేస్‌బుక్ ఉపయోగించడానికి పురిగొల్పుతుందని అన్నారు. చివరకు సైకాలజిస్టులు చెప్పిన మాటలు వింటే అందిరికీ ఆశ్చర్యం కలుగుతుంది. సోషల్ మీడియా వ్యసనం అనేది మనిషిలోని ఆలోచనలను దెబ్బతీయడమే కాకుండా.. రాబోయే కాలంలో పిల్లలు పుట్టించే సత్తాని కూడా క్రమ క్రమంగా తగ్గుతుందనే విషయాన్ని తెలిపారు.

సో దీనిని బట్టి సోషల్ మీడియా వాడకంపై బహిరంగ డిబేట్ పెట్టి దీని నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వెల్లడించాల్సిందిగా కోరుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ వన్‌గా కొనసాగుతున్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో 800 మిలియన్ యూజర్స్ ఉన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot